ముంబై: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘యాక్సిస్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. డిసెంబర్ 1 నుంచి 15 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. నూతన పథకం ద్వారారూ.2,500 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. దేశ తయారీ రంగంలోని అవకాశాలపై ఈ పథకం పెట్టుబడులు పెడుతుందని తెలిపింది. నిఫ్టీ మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్‌ను ఈ పథకం ట్రాక్ చేస్తుంది.
శ్రేయాష్ దేవాల్కర్, నితిన్ అరోరా ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో చేసిన పెట్టుబడిని 12 నెలల్లోపు ఉపసంహరించుకుంటే 10 శాతంపై ఎలాంటి ఎగ్జిట్ లోడ్ విధించరు. మిగిలిన మొత్తంపై 1 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి నాటికి సంస్థ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.2.25 లక్షల కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో బి.గోప్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment