Axis Mutual Fund
-
యాక్సిస్ క్రిసిల్ డెట్ ఇండెక్స్ ఫండ్
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ క్రిసిల్ ఐబీఎక్స్ ఎస్డీఎల్ జూన్ 2034 డెట్ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్చి 12తో ఈ ఎన్ఎఫ్వో ముగుస్తుంది. ఈ ఆఫర్ ద్వారా సమీకరించిన నిధులను నిర్దేశిత ఇండెక్స్ సెక్యూరిటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుత ఈల్డ్ కర్వ్ .. మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులపై మెరుగైన రాబడులు అందుకునేందుకు అనువుగా ఉందని సంస్థ తెలిపింది. ఫిక్సిడ్ ఇన్కమ్ పోర్ట్‌ఫోలియోను పటిష్టపర్చుకోవాలని భావిస్తున్న ఇన్వెస్టర్లకు ఇది అనుకూలమైన ఫండ్ కాగలదని తెలిపింది. -
యాక్సిస్ నుంచి మాన్యుఫాక్చరింగ్ ఫండ్
ముంబై: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘యాక్సిస్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. డిసెంబర్ 1 నుంచి 15 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. నూతన పథకం ద్వారారూ.2,500 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. దేశ తయారీ రంగంలోని అవకాశాలపై ఈ పథకం పెట్టుబడులు పెడుతుందని తెలిపింది. నిఫ్టీ మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్‌ను ఈ పథకం ట్రాక్ చేస్తుంది. శ్రేయాష్ దేవాల్కర్, నితిన్ అరోరా ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో చేసిన పెట్టుబడిని 12 నెలల్లోపు ఉపసంహరించుకుంటే 10 శాతంపై ఎలాంటి ఎగ్జిట్ లోడ్ విధించరు. మిగిలిన మొత్తంపై 1 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి నాటికి సంస్థ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.2.25 లక్షల కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో బి.గోప్‌కుమార్ తెలిపారు. -
నయా ఫండ్: యాక్సిస్ ఏఎంసీ నుంచి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్
ముంబై: యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది జూన్ 27న ప్రారంభమై జూలై 11తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని సంస్థ సీఈవో బి. గోప్‌కుమార్ తెలిపారు. నిఫ్టీ ఐటీ టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధులను ఐటీ సూచీలోని స్టాక్స్‌లో దాదాపు అదే నిష్పత్తి కింద ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. తదనుగుణంగా ఇందులో సిప్, ఎస్టీపీ, ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు. అన్ని వ్యాపారాల్లోనూ టెక్నాలజీ కీలకంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐటీ రంగానికి మరింత డిమాండ్ ఉండగలదని, తదనుగుణంగా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని గోప్‌కుమార్ తెలిపారు. -
యాక్సిస్ కొత్త ఈటీఎఫ్ ఫండ్... రూ. 50 కోట్లు సమీకరణకు టార్గెట్
ముంబై: దేశీయంగా ఏడో పెద్ద ఫండ్ హౌస్ యాక్సిస్ ఎంఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్వో)కు తెరతీస్తోంది. ఈ నెల 22న ఫండ్ ప్రారంభమైన ఫండ్, ఏప్రిల్ 5న ముగియనుంది. ఈ ఎన్ఎఫ్వో(ఓపెన్ ఎండెడ్ ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్) ద్వారా కనీసం రూ. 50 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్‌లైన్ ముగియకముందే మేల్కొండి! ఈ నిధులను ఎస్అండ్పీ 500 ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)లో ఇన్వెస్ట్ చేయనుంది. ఫండ్‌ను వినాయక్ జయంత్ నిర్వహించనున్నారు. అలాట్మెంట్ తేదీ నుంచి 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే 0.25 శాతం ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... అలాట్మెంట్ అయ్యాక 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అమలుకాదని ఫండ్ హౌస్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాఘవ్ అయ్యంగర్ పేర్కొన్నారు. వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడులు చేపట్టే ఇతర రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మాదిరికాకుండా ఈ ఫండ్ సొంత పథకాలు లేదా ఇతర ఫండ్ హౌస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? -
యాక్సిస్ క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ఫండ్ ఎన్ఎఫ్వో
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ తాజాగా ’క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్డీఎల్ జూన్ 2028 ఇండెక్స్ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జనవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్.. క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్డీఎల్ జూన్ 2028 సూచీలోని డెట్ సాధనాల్లో 95–100 శాతం ఇన్వెస్ట్ చేస్తుంది. మిగతాది డెట్, మనీ మార్కెట్ సాధనాలు (ఏడాది వ్యవధిలోనే మెచ్యూర్ అయ్యే ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో) పెట్టుబడులు పెడుతుంది. తదనుగుణంగా మెరుగైన రాబడులు అందించేలా ఇది పనిచేస్తుంది. ఇందులో లాకిన్ వ్యవధిలాంటివి ఉండవు కాబట్టి లిక్విడిటీకి సమస్య ఉండదు. తక్కువ డిఫాల్ట్ రిస్కులతో అత్యంత నాణ్యమైన పోర్ట్‌ఫోలియోను కోరుకునే వారికి, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఇది అనువుగా ఉంటుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ చంద్రేశ్ నిగమ్ తెలిపారు. చదవండి: రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే! -
మధ్య కాలానికి డెట్‌లో పెట్టుబడులు: ఫండ్ రివ్యూ
ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా అన్ని ప్రముఖ సెంట్రల్ బ్యాంకుల వైఖరి ప్రస్తుతం రేట్ల పెంపు దిశగానే ఉంది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీల్లో మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో వడ్డీ రేట్ల పరంగా అనిశ్చితి నెలకొని ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాల వ్యవధితో కూడిన బాండ్లను ఎంచుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఈ తరుణంలో మీడియం డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాల బాండ్లతో పోలిస్తే వడ్డీ రేట్ల మార్పులతో వీటిపై పడే ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కనుక మధ్య కాలానికి ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. పెట్టుబడుల పరంగా పెద్దగా రిస్క్ తీసుకోకుండా మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల విషయంలో ఈ పథకం ఎక్కువ రిస్క్ తీసుకోదు. ఇందుకు నిదర్శనం పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం అధిక భద్రతను సూచించే ఏఏఏ, ఏఏ రేటింగ్ సాధనాలు ఉండడాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలోని రూ.1,570 కోట్ల పెట్టుబడుల్లో 20 శాతం నగదు రూపంలోనే ఉంది. వడ్డీ రేట్ల పరంగా స్థిరత్వం లేనందున నగదు నిల్వలు ఎక్కువగా కలిగి ఉందని తెలుస్తోంది. ఇక మిగిలిన 80 శాతం పెట్టుబడుల్లో 94 శాతం అధిక భద్రత సాధనాల్లోనే ఉన్నాయి. రిస్క్ ఉండే ఏ, అంతకంటే దిగువ రేటింగ్ సాధనాల్లో కేవలం 5 శాతం పెట్టుబడులనే కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడుల కాల వ్యవధి సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. 33 శాతం పెట్టుబడులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఉండడాన్ని గమనించాలి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ 3.5 శాతం రాబడినిచ్చింది. ఇక గడిచిన ఐదేళ్లలో వార్షికంగా 6.5 శాతం చొప్పున రాబడులను తెచ్చి పెట్టింది. ఏడేళ్లలో 7.34 శాతం, పదేళ్లలో 7.89 శాతం చొప్పున ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రతిఫలాన్నిచ్చింది. ఈ విభాగం సగటు రాబడుల కంటే ఈ పథకంలోనే ఎక్కువ ఉన్నాయి. మీడియం డ్యురేషన్ విభాగం సగటు రాబడులు గడిచిన ఐదేళ్లలో వార్షికంగా 5.5 శాతంగా ఉన్నాయి. ఏడేళ్లలో 6.32 శాతం, పదేళ్లలో 7.37 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. బాండ్ ఫండఖ కావడంతో ఈ పథకంలో సిప్ వల్ల ఉపయోగం ఉండదు. దీనికి బదులు ఏకమొత్తంలో నిర్ణీత కాలానికోసారి పెట్టుబడి పెట్టుకోవడం మంచిది -
యాక్సిస్ నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్..
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ .. నాస్డాక్ 100 టీఆర్ఐ ఆధారిత ఈటీఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. హితేష్ దాస్ దీనికి ఫండ్ మేనేజరుగా వ్యవహరిస్తారు. అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ ఫండ్ ఎన్ఎఫ్వో అక్టోబర్ 21న ముగుస్తుంది. కనీసం రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. పేరొందిన టెక్ కంపెనీలతో పాటు హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు నాస్డాక్ 100 సూచీలో భాగం. అంతర్జాతీయ పెట్టుబడులు పెట్టడం ద్వారా లబ్ధి పొందే అవకాశంతో పాటు రూపాయి పతనాన్ని హెడ్జ్ చేసుకునేందుకు కూడా ఈ ఫండ్ ఉపయోగపడగలదని సంస్థ ఎండీ చంద్రేశ్ నిగమ్ తెలిపారు. చదవండి: బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్! -
ఈక్విటీల్లో రిటైలర్లకు రాబడులు అంతంతే!
ముంబై: గడిచిన రెండు దశాబ్దాల్లో ఈక్విటీ మార్కెట్లు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. కానీ, ఈ ప్రయాణంలో రిటైల్ ఇన్వెస్టర్లు పొందిన రాబడులు (సొంతంగా) మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాదు, మార్కెట్లు ప్రతికూలంగా మారిపోతే రిటైల్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను వేగంగా మార్చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన వివరాలను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. 2003 నుంచి 2022 వరకు (20 ఏళ్లు) ఈక్విటీ మార్కెట్లు, డెట్ ఫండ్స్‌కు సంబంధించి 2009–2022 (14 ఏళ్లు) గణాంకాలను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ చేసి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో ఈక్విటీ లేదా హైబ్రిడ్ ఫండ్స్ విభాగాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడులు కనిష్ట స్థాయిలో ఉంటే, మ్యూచువల్ ఫండ్స్ రాబడులు గరిష్టంగా ఉన్నాయి. ఇదీ వ్యత్యాసం.. 2003 నుంచి 2022 మధ్య మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈక్విటీ పెట్టుబడులపై సగటున 19.1 శాతం వార్షిక రాబడులను సంపాదించాయి ఇదే కాలంలో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడి 13.8 శాతంగానే ఉంది. ఇక సిప్ ద్వారా వచ్చిన రాబడులు 15.2 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడి 7.4 శాతం మేర ఉంటే, ఫండ్స్ సంస్థలకు 12.5 శాతం చొప్పున వచ్చాయి. ఇక్కడ కూడా సిప్ రాబడి 10.1 శాతానికి పరిమితమైంది. ఇక పూర్తిగా డెట్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు 6.6 శాతం మేర వార్షిక రాబడి సంపాదించగా, సిప్ ఫండ్స్ సంస్థల రాబడి 7 శాతం చొప్పున ఉంది. ఎందుకని..? మరి రిటైల్ ఇన్వెస్టర్ల రాబడులు ఎందుకు తక్కువగా ఉన్నాయి..? మార్కెట్లు అస్థిరంగా మారిన వెంటనే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్‌ను వేగంగా మార్చేస్తుండడం రాబడులను దెబ్బతీస్తోంది. మార్కెట్ ధోరణికి తగ్గట్టు పరుగెత్తకుండా.. పూర్తి మార్కెట్ సైకిల్ వరకు పెట్టుబడులను కొనసాగించడమే దీనికి పరిష్కారమని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో సూచించింది. పాయింట్ టు పాయింట్ (కచ్చితంగా నిర్ణీత కాలానికి) రాబడులు అధ్యయనంలోకి తీసుకుంది. స్వల్పకాల మార్కెట్ల అస్థిరతలను చూసి సిప్ నిలిపివేస్తే, అసలు లక్ష్యమే దెబ్బతింటుందని యాక్సిస్ మ్యాచువల్ ఫండ్ హెచ్చరించింది. అస్థిరతల్లో స్థిరత్వం కోల్పోకుండా, పెట్టుబడులను నమ్మకంగా కొనసాగించడం.. అది సాధ్యం కాకపోతే రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఈ నివేదిక తెలియజేస్తోంది. -
‘యాక్సిస్’లో అవకతవకలు.. కీలక అధికారి తొలగింపు
దేశంలోనే పెద్ద మ్యూచువల్ ఫండ్లలో ఒకటైన యాక్సిస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫండ్ మేనేజ్మెంట్లో అవకతవకలకు పాల్పడ్డాడంటూ చీఫ్ డీలర్‌ను విధుల్లోంచి తొలగించింది యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ. యాక్సిస్ సంస్థ దేశంలోనే దేశంలోనే ఏడో అతి పెద్ద మ్యూచువల్ఫండ్ సంస్థగా ఉంది. దీని పరిధిలో యాక్సిస్ ఆర్బిట్రేజ్ ఫండ్, యాక్సిస్ బ్యాంకింగ్ ఈటీఎఫ్, యాక్సిస్ నిఫ్టీ ఈటీఎఫ్, యాక్సిస్ టెక్నాలజీ ఈటీఎఫ్, యాక్సిస్ కన్సప్షన్ ఈటీఎఫ్ ఫండ్లకు మేనేజర్‌గా చీఫ్ డీలర్‌గా వీరేశ్ జోషి పని చేసేవారు. అయితే ఫండ్ మేనేజ్మెంట్లో ఆయన అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 2022 ఫిబ్రవరిలో ఆరోపణలు చుట్టుముట్టగా.. అప్పటి నుంచి విచారన జరుగుతోంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టారు. చివరకు విచారణ నివేదిక ఆధారంగా వివేశ్జోషిని చీఫ్ డీలర్ పదవి నుంచి తప్పించడంతో పాటు మొత్తంగా యాక్సిస్ నుంచి తొలగించారు. చదవండి: ఎల్ఐసీ లిస్టింగ్.. ప్చ్! -
యాక్సిస్ ఏఎంసీ 3,500 కోట్ల డి్రస్టెస్డ్ ఫండ్
ముంబై: యాక్సిస్ ఏఎంసీ (మ్యూచువల్ ఫండ్ నిర్వహణ సంస్థ).. ఇన్వర్షన్ అడ్వైజరీ సర్విసెస్ భాగస్వామ్యంతో రూ.3,500 కోట్ల డి్రస్టెస్డ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీలను లాభాల్లోకి తీసుకురావడంలో (టర్న్అరౌండ్) నైపుణ్యం ఉన్న ఇన్వర్షన్ అడ్వైజరీ సర్విసెస్ (అఖిల్ గుప్తా ఏర్పాటు చేసిన సంస్థ)తో ఒక ఈక్విటీ ఫండ్ మేనేజర్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం కొత్త తరహాగా యాక్సిస్ ఏఎంసీ పేర్కొంది. సెబీ ఆమోదం అనంతరం రూ.3,500 కోట్లతో డి్రస్టెస్డ్ ఫండ్‌ను ప్రారంభిస్తామని.. అదనంగా మరో రూ.500 కోట్ల మేర గ్రీన్ షూ ఆప్షన్ ఉంటుందని తెలిపింది. పనితీరు సజావుగా లేని కంపెనీల్లో నియంత్రిత వాటాలను ఈ ఫండ్‌తో కొనుగోలు చేసి.. తదుపరి వాటి నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ద్వారా టర్న్అరౌండ్ చేస్తామని వివరించింది. ‘‘టర్న్అరౌండ్ పెట్టుబడుల విధానంలోకి అడుగు పెట్టడం ద్వారా దేశ వృద్ధి పథంలో పాల్గొని, ప్రయోజనం పొందే వినూత్న అవకాశాన్ని ఇన్వెస్టర్లకు తీసుకొచ్చాం’’ అని యాక్సిస్ ఏఎంసీ ఎండీ, సీఈవో చంద్రేష్ నిగమ్ పేర్కొన్నారు. -
యాక్సిస్ మ్యూచువల్ నుంచి రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యాలకు తగ్గట్లుగా మూడు వేర్వేరు ప్లాన్స్ (అగ్రెసివ్, డైనమిక్, కన్జర్వేటివ్) ఇందులో ఉంటాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్)కు కట్టే వాయిదాల పరిమాణాన్ని బట్టి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఐప్లస్ సిప్ ఇన్సూరెన్స్ పేరిట బీమా సదుపాయం కూడా లభిస్తుందని సంస్థ సీఈవో చంద్రేశ్ కుమార్ నిగమ్ తెలిపారు. -
మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన ప్రదర్శన
గడిచిన ఏడాది కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ 15 శాతం వరకు ర్యాలీ చేసింది. కానీ, ఇదే కాలంలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం ఫ్లాట్‌గా కొనసాగింది. గతంలో ప్రధాన సూచీలతో పోలిస్తే అధిక వ్యాల్యూషన్లకు చేరిన మిడ్‌క్యాప్ విభాగంలో ప్రస్తుత పరిస్థితి పూర్తి విరుద్ధం. ప్రధాన సూచీల కంటే ఎంతో చౌకగా స్టాక్స్ వ్యాల్యూషన్లు ఉన్నాయి. కనుక ఈ సమయంలో నాణ్యమైన మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందే అవకాశం ఉంటుందని విశ్లేషకులు, నిపుణుల అంచనా. మిడ్‌క్యాప్ విభాగంలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పథకం రాబడుల పరంగా మెరుగైన ప్రదర్శన చూపుతోంది. రాబడులు...: గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్ విభాగంలో నికర రాబడులు సున్నాయే. కచ్చితంగా చెప్పుకోవాలంటే బీఎస్ఈ మిడ్‌క్యాప్ టీఆర్ఐ 0.3 శాతం నికరంగా నష్టపోయింది. కానీ, యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ మాత్రం ఏడాది కాలంలో 14.6 శాతం రాబడులను ఇచ్చి ఈ విభాగంలోనే ఉత్తమ పథకంగా నిలిచింది. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కేవలం 8 శాతమే వృద్ధి చెందింది. ఈ కాలంలోనూ యాక్సిస్ మిడ్‌క్యాప్ పథకం వార్షికంగా 17.3 శాతం రాబడులతో అద్భుత పనితీరు చూపించింది. అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి వృద్ధి, ర్యాలీకి అవకాశం ఉన్న కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడంలో ఫండ్ మేనేజర్ విజయవంతమైనట్టు ఇది సూచిస్తోంది. ఇక ఐదేళ్ల కాలంలోనూ వార్షికంగా 9.9 శాతం రాబడులను ఈ పథకం ఇచ్చింది. ఈ కాలంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 8.4 శాతమే వృద్ధి చెందింది. ఈ పథకం ఫిబ్రవరి 2011న ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా 16.79 శాతం రాబడులను ఇన్వెస్టర్లకు పంచింది. పెట్టుబడుల విధానాలు.. మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ నిబంధనల ప్రకారం తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ ఈ నిబంధనలను అనుసరిస్తోంది. ప్రస్తుతం డెట్ విభాగంలో 15 శాతం మేర ఇన్వెస్ట్ చేసి ఉంటే, 85 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించింది. ఈక్విటీ పెట్టుబడుల్లో 79 శాతం మిడ్‌క్యాప్ విభాగానికి, 21 శాతం లార్జ్‌క్యాప్ విభాగానికి కేటాయించి ఉంది. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 42 స్టాక్స్ ఉన్నాయి. ప్రధానంగా గడిచిన రెండేళ్ల కాలంలో (2018 నుంచి) మార్కెట్లలో ఎంతో అస్థిరతలు ఉన్నా కానీ, ఈ పథకం మంచి పనితీరు చూపించడానికి గల కారణాల్లో డెట్ విభాగానికి చెప్పుకోతగ్గ పెట్టుబడులను కేటాయించడం కూడా ఒకటి. మార్కెట్ అస్థిరతల్లో ఈ పథకం నష్టాల రిస్క్‌ను తగ్గించేందుకు డెట్ విభాగంలోకి కొంత పెట్టుబడులను మళ్లిస్తుంది. 2017 మార్కెట్ ర్యాలీలో ఈక్విటీల్లో పెట్టుబడులను 95 శాతం మేర నిర్వహించగా, ఆ తర్వాత 2018లో అస్థిరతలు ఆరంభం కాగానే ఈక్విటీ ఎక్స్పోజర్ను కొంత మేర తగ్గించుకుంది. అంతేకాదు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీగా కేటాయించిన పెట్టుబడుల్లోనూ మార్పులు చేస్తుంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీసెస్, కెమికల్స్ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. ఈ తరహా విధానాలతో ఈ పథకం తన పనితీరును మెరుగ్గా కొనసాగిస్తోంది. -
తెలిసిన సంఘటనలు ‘బేర్’మనిపించలేవు..
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ సుధాంశు ఆస్థానా ♦ ఊహించనివేవైనా జరిగితేనే మనకు ఇబ్బంది ♦ మన మార్కెట్లు ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్నాయి ♦ మన వడ్డీ రేట్లు ఏడాదిలో మరో శాతం తగ్గొచ్చు ♦ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్నాం ముందునుంచే ఊహిస్తున్న సంఘటనలు మార్కెట్లపై స్వల్పకాల ప్రభావాన్ని చూపుతాయని, ఇలాంటి వాటిని కొనుగోళ్లకు ఉపయోగించుకోవాలంటోంది యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ. దేశీయ స్టాక్ సూచీలు ఫండమెంటల్‌గా బలంగా ఉన్నాయని, ఊహించని సంక్షోభం ఎదురైనపుడు మాత్రమే ఇవి కిందకు పడతాయని చెబుతున్న యాక్సిస్ ఎంఎఫ్ సీనియర్ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) సుధాంశు ఆస్థానాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... స్టాక్ సూచీలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరాక కాస్త ఆగుతున్నాయి. అలాంటపుడు రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారు? సిప్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెరిగాయా? దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో మా ఒక్క యాక్సిస్ మ్యూచువల్ ఫండ్‌లో చేరిన 10 లక్షల మంది ఖాతాదారుల్లో రెండు లక్షల మంది తొలిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినవారే. పరిశ్రమలో సిప్ ఖాతాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు ప్రతి నెలా సగటును రూ.2,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొద్ది వారాలుగా మార్కెట్లు పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. వచ్చే ఏడాదిలో..? ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థగా మార్కెట్లు ఎంత లాభాలందిస్తాయనేది చెప్పలేను. కానీ ఇండియా ఆర్థిక వృద్ధిరేటు వచ్చే ఏడాదిలో పదేళ్ల సగటు జీడీపీ 6.5 శాతం (పాత జీడీపీ లెక్కల్లో) దాటుతుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం జీడీపీ రేటు 5 శాతం (పాత లెక్కల ప్రకారం) దగ్గర ఉండొచ్చు. దేశంలోని 10,000 కంపెనీల పదేళ్ల లాభాల సగటు 11 శాతంగా ఉంటే అది ఇప్పుడు 4.5 శాతంగా ఉంది. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ పూర్వవైభవానికి వస్తే కంపెనీల లాభాలు కూడా ఆ స్థాయికి చేరుతాయి. ఇదే సమయంలో ఈక్విటీ ఫండ్స్ సగటున 15 శాతం రాబడిని అందించాయి. ఇవన్నీ ఫండమెంటల్ పరంగా దీర్ఘకాలానికి ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించే అంశాలే. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ పెంచితే ఎలా ఉంటుంది? అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుండటంతో వడ్డీరేట్ల పెంపు తప్పనిసరి అనేది అందరికీ తెలిసిందే. కానీ అది ఎప్పటి నుంచనేది తెలియాల్సి ఉంది. ఇలా తెలిసిన సంఘటనలు మార్కెట్లపై అంతగా ప్రతికూల ప్రభావాన్ని చూపలేవు. ఆ సమయంలో కాస్త ఒడిదుడుకులు వస్తే రావచ్చు. అమెరికా వడ్డీరేట్లు పెంచినా ఎఫ్ఐఐల నిధుల ప్రవాహం తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఫండమెంటల్‌గా మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. అదికాకుండా గత మూడేళ్లలో ఎఫ్ఐఐలు దీర్ఘకాలిక దృష్టితో ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఇలా తెలిసిన సంఘటనలు జరిగినప్పుడు వచ్చే పతనాలను కొనుగోళ్లకు ఉపయోగించుకోమని సూచిస్తా. అమెరికా వడ్డీరేట్లు పెంచితే డాలరు బలపడి రూపాయి మరింత బలహీన పడుతుందా? వచ్చే ఏడాది కాలంలో డాలరు విలువ ఏ స్థాయిలో ఉంటుంది? ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగా ఉంది. రూపాయి మరింత క్షీణించకుండా ఆర్బీఐ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ అమెరికా వడ్డీరేట్లు పెంచడం వల్ల డాలరు విలువ బలపడినా ఆ ప్రభావం మన కరెన్సీపై అంతగా ఉండకపోవచ్చు. డాలరు విలువ ఏ శ్రేణిలో కదులుతుందో చెప్పలేను. ఏటా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 2-3% తగ్గుతోంది. రానున్న కాలంలో కూడా ఇదే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. చైనా మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. మనపై ఎంత ప్రభావం ఉండొచ్చు? చైనా మార్కెట్లతో ఇండియాకు నేరుగా ఎలాంటి సంబంధాలు లేవు. మెటల్స్ ధరలు బాగా తగ్గుతుండటంతో ఆ రంగంపై ఎక్కువగా ఆధారపడిన చైనా పడుతోంది. చైనా మార్కెట్లు భారీగా పడినప్పుడు సెంటిమెంటల్‌గా మన మార్కెట్లు కూడా కాస్త ఒత్తిడికి లోను కావచ్చు కానీ, దీర్ఘకాలిక ర్యాలీపై ప్రభావం చూపలేదు. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందా? వచ్చే ఏడాది కాలంలో వడ్డీరేట్లు ఏ విధంగా ఉండొచ్చు? ఈ నెలలో వడ్డీరేట్లు తగ్గుతాయా లేదా అనేది చెప్పలేం. కానీ వచ్చే ఏడాది కాలంలో వడ్డీరేట్లు 0.75-1 శాతం తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఏ రంగాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు? మేం మార్కెట్‌తో సంబంధం లేకుండా బోటమ్ అప్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని అనుసరిస్తాం. భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉన్న రంగాల్లో ఫండమెంటల్‌గా, యాజమాన్య, నిర్వహణ పరంగా పటిష్టంగా ఉన్న కంపెనీలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై ఆసక్తి చూపిస్తున్నాం. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, మెటల్స్ రంగాల్లో ఎంపిక చేసిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఏ ఒక్క రంగంలో 10 శాతం మించి ఇన్వెస్ట్ చేయటం లేదు.