
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నాస్‌డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ .. నాస్‌డాక్ 100 టీఆర్‌ఐ ఆధారిత ఈటీఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. హితేష్ దాస్ దీనికి ఫండ్ మేనేజరుగా వ్యవహరిస్తారు. అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ ఫండ్ ఎన్‌ఎఫ్‌వో అక్టోబర్ 21న ముగుస్తుంది. కనీసం రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.
పేరొందిన టెక్ కంపెనీలతో పాటు హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు నాస్‌డాక్ 100 సూచీలో భాగం. అంతర్జాతీయ పెట్టుబడులు పెట్టడం ద్వారా లబ్ధి పొందే అవకాశంతో పాటు రూపాయి పతనాన్ని హెడ్జ్ చేసుకునేందుకు కూడా ఈ ఫండ్ ఉపయోగపడగలదని సంస్థ ఎండీ చంద్రేశ్ నిగమ్ తెలిపారు.
చదవండి: బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్!
Comments
Please login to add a commentAdd a comment