Axis Mutual Fund launches Axis Nifty IT Index Fund - Sakshi
Sakshi News home page

నయా ఫండ్‌: యాక్సిస్‌ ఏఎంసీ నుంచి నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఫండ్‌

Published Tue, Jun 27 2023 9:43 AM | Last Updated on Tue, Jun 27 2023 10:32 AM

Axis Mutual Fund launches Axis Nifty IT Index Fund - Sakshi

ముంబై: యాక్సిస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తాజాగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది జూన్‌ 27న ప్రారంభమై జూలై 11తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇందులో ఇన్వెస్ట్‌ చేయొచ్చని సంస్థ సీఈవో బి. గోప్‌కుమార్‌ తెలిపారు. నిఫ్టీ ఐటీ టీఆర్‌ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. ఈ ఫండ్‌ ద్వారా సేకరించే నిధులను ఐటీ సూచీలోని స్టాక్స్‌లో దాదాపు అదే నిష్పత్తి కింద ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు చెప్పారు.

తదనుగుణంగా ఇందులో సిప్, ఎస్‌టీపీ, ఏకమొత్తంగా ఇన్వెస్ట్‌ చేయొచ్చని చెప్పారు. అన్ని వ్యాపారాల్లోనూ టెక్నాలజీ కీలకంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐటీ రంగానికి మరింత డిమాండ్‌ ఉండగలదని, తదనుగుణంగా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని గోప్‌కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement