Axis
-
టాటా ఇన్నోవేషన్ ఫండ్.. రూ. 5000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
హైదరాబాద్: వినూత్న వ్యూహాలు, థీమ్‌లతో ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ టాటా ఇండియా ఇన్నోవేషన్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఇది నవంబర్ 11 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటుంది.కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. వివిధ మార్కెట్ క్యాప్‌లు, రంగాలవ్యాప్తంగా ఇన్నోవేషన్ థీమ్ ద్వారా లబ్ధి పొందే సంస్థల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి ఈ ఫండ్ తోడ్పడుతుందని సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రాహుల్ సింగ్ తెలిపారు.యాక్సిస్ క్రిసిల్–ఐబీఎక్స్ ఇండెక్స్ ఫండ్.. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా యాక్సిస్ క్రిసిల్–ఐబిఎక్స్ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్–సెప్టెంబర్ 2027 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది క్రిసిల్–ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్–సెప్టెంబర్ 2027లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నవంబర్ 21 వరకు ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
యాక్సిస్ క్రిసిల్ డెట్ ఇండెక్స్ ఫండ్
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ క్రిసిల్ ఐబీఎక్స్ ఎస్డీఎల్ జూన్ 2034 డెట్ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్చి 12తో ఈ ఎన్ఎఫ్వో ముగుస్తుంది. ఈ ఆఫర్ ద్వారా సమీకరించిన నిధులను నిర్దేశిత ఇండెక్స్ సెక్యూరిటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుత ఈల్డ్ కర్వ్ .. మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులపై మెరుగైన రాబడులు అందుకునేందుకు అనువుగా ఉందని సంస్థ తెలిపింది. ఫిక్సిడ్ ఇన్కమ్ పోర్ట్‌ఫోలియోను పటిష్టపర్చుకోవాలని భావిస్తున్న ఇన్వెస్టర్లకు ఇది అనుకూలమైన ఫండ్ కాగలదని తెలిపింది. -
రిస్క్ లపై ఇన్వెస్టర్లలో అవగాహన అంతంతే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కష్టపడి సంపాదించే ధనాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇదే క్రమంలో పెట్టుబడి సాధనంగా మ్యుచువల్ ఫండ్స్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. కానీ, ఇన్వెస్టర్లలో రిస్కులు, తమ రిస్కు సామర్థ్యాలపై అవగాహన అంతంతమాత్రంగాన ఉంటోంది. సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడంలో తమ రిస్కు సామర్థ్యాలను అర్థం చేసుకుని, వ్యవహరించడం కీలకాంశమని 89 శాతం మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నప్పటికీ .. వాస్తవంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న వారు 27 శాతమే. 53 శాతం మంది ఇన్వెస్టర్లు తమ వ్యక్తిగత రిస్కుల మదింపు విషయంలో ధీమాగా వ్యవహరించలేకపోతున్నారు. యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ (ఏఎంసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మ్యుచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఉండే రిస్కుల విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1,700 మంది పైచిలుకు యాక్సిస్ ఎంఎఫ్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. సర్వే నివేదిక ప్రకారం ఫండ్ రిస్కులను మదింపు చేసేందుకు రిస్్క–ఓ–మీటర్ అనే సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని 55 శాతం మందికి, అలాగే వ్యక్తిగత రిస్కులను మదింపు చేసుకునేందుకు రిస్క్ ప్రొఫైలర్‌ను ఉపయోగించుకోవచ్చని 69 శాతం మందికి అవగాహన లేదు. దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా వారికి మరింత తోడ్పాటు అందించేందుకు పరిశ్రమ కృషి చేస్తోందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు. సర్వేలో మరిన్ని అంశాలు.. ► ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రామాణికంగా తీసుకోతగిన అంశాల్లో, దాని గత పనితీరు కూడా ఒకటని 59% మంది ఇంకా విశ్వసిస్తున్నారు. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించాల్సిన అవసరం, కాంపౌండింగ్ ప్రయో జనాల గురించి తెలిసినప్పటికీ చాలా మంది ఇ న్వెస్టర్లు పలు సందర్భాల్లో తమ పెట్టుబడులను ముందుగానే ఉపసంహరించుకుంటున్నారు. ► పరిశ్రమ సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 22.2% మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు 12–24 నెలల పాటే తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. 48.7% మంది తమ పోర్ట్‌ఫోలియోను రెండేళ్లు, అంతకన్నా తక్కువ వ్యవధిలోనే రిడీమ్ చేసుకుంటున్నారు. ► పెట్టుబడులు పెట్టేటప్పుడు తమ రిస్కు సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన 27% మందిలో దాదాపు 64% మందికి రిస్కు సామర్థ్యాలను మదింపు చేసుకోవడానికి రిస్క్ ప్రొఫైలర్ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని తెలియదు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 30% మందికి మాత్రమే రిస్క్ ప్రొఫైలర్ గురించి అవగాహన ఉంది. ► 61% మందికి రిస్్క–ఓ–మీటర్ దేన్ని సూచిస్తుందనేది తెలియదు. ఇది ‘ఫండ్’ రిసు్కను సూచిస్తుందని 16% మందికి మాత్రమే తెలుసు. తాము పెట్టుబడులు పెట్టే ముందు రిస్కోమీటర్ను చూసుకునే ఇన్వెస్ట్ చేస్తామని సదరు ఇన్వెస్టర్లు తెలిపారు. -
నయా ఫండ్: యాక్సిస్ ఏఎంసీ నుంచి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్
ముంబై: యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది జూన్ 27న ప్రారంభమై జూలై 11తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని సంస్థ సీఈవో బి. గోప్‌కుమార్ తెలిపారు. నిఫ్టీ ఐటీ టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధులను ఐటీ సూచీలోని స్టాక్స్‌లో దాదాపు అదే నిష్పత్తి కింద ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. తదనుగుణంగా ఇందులో సిప్, ఎస్టీపీ, ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు. అన్ని వ్యాపారాల్లోనూ టెక్నాలజీ కీలకంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐటీ రంగానికి మరింత డిమాండ్ ఉండగలదని, తదనుగుణంగా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని గోప్‌కుమార్ తెలిపారు. -
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కొత్త ఫండ్ చూశారా?
హైదరాబాద్: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా యాక్సిస్ నిఫ్టీ ఎస్డీఎల్ సెప్టెంబర్ 2026 డెట్ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. నవంబర్ 16తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నిఫ్టీ ఎస్డీఎల్ సెప్టెంబర్ 2026 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల ఆధారంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. దీర్ఘకాలిక కోణంలో 3-5 ఏళ్ల వ్యవధికి నాణ్యమైన డెట్ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు అనువైనది. (పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్) -
యాక్సిస్ ఏఎంసీ 3,500 కోట్ల డి్రస్టెస్డ్ ఫండ్
ముంబై: యాక్సిస్ ఏఎంసీ (మ్యూచువల్ ఫండ్ నిర్వహణ సంస్థ).. ఇన్వర్షన్ అడ్వైజరీ సర్విసెస్ భాగస్వామ్యంతో రూ.3,500 కోట్ల డి్రస్టెస్డ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీలను లాభాల్లోకి తీసుకురావడంలో (టర్న్అరౌండ్) నైపుణ్యం ఉన్న ఇన్వర్షన్ అడ్వైజరీ సర్విసెస్ (అఖిల్ గుప్తా ఏర్పాటు చేసిన సంస్థ)తో ఒక ఈక్విటీ ఫండ్ మేనేజర్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం కొత్త తరహాగా యాక్సిస్ ఏఎంసీ పేర్కొంది. సెబీ ఆమోదం అనంతరం రూ.3,500 కోట్లతో డి్రస్టెస్డ్ ఫండ్‌ను ప్రారంభిస్తామని.. అదనంగా మరో రూ.500 కోట్ల మేర గ్రీన్ షూ ఆప్షన్ ఉంటుందని తెలిపింది. పనితీరు సజావుగా లేని కంపెనీల్లో నియంత్రిత వాటాలను ఈ ఫండ్‌తో కొనుగోలు చేసి.. తదుపరి వాటి నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ద్వారా టర్న్అరౌండ్ చేస్తామని వివరించింది. ‘‘టర్న్అరౌండ్ పెట్టుబడుల విధానంలోకి అడుగు పెట్టడం ద్వారా దేశ వృద్ధి పథంలో పాల్గొని, ప్రయోజనం పొందే వినూత్న అవకాశాన్ని ఇన్వెస్టర్లకు తీసుకొచ్చాం’’ అని యాక్సిస్ ఏఎంసీ ఎండీ, సీఈవో చంద్రేష్ నిగమ్ పేర్కొన్నారు. -
యాక్సిస్ ఎనర్జీ సంస్థకు ఐటీ షాక్
సాక్షి, హైదరాబాద్: యాక్సిస్ ఎనర్జీ సంస్థకు భారీ షాక్ తగిలింది. విండ్ పర్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో యాక్సెస్ ఎనర్జీ కంపెనీ గ్రూప్ సంస్థలపై 20 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. -
తక్కువ రిస్క్.. చక్కని రాబడి
ఏడాది కాలంగా అనిశ్చితులతో ట్రేడ్ అయిన ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు స్థిరమైన ర్యాలీ బాటలో ఉన్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నూతన గరిష్టాలకు చేరువయ్యాయి. కానీ పరిశీలించి చూస్తే స్టాక్స్ పనితీరులో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఎంపిక చేసిన స్టాక్స్ మాత్రమే ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని లార్జ్‌క్యాప్ స్టాక్స్ మంచి పనితీరు చూపిస్తుండగా, అధిక శాతం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ వెనుకబడే ఉంటున్నాయి. మార్కెట్ ర్యాలీ చాలా సంకుచితంగా ఉంటోంది. దీంతో భిన్న మార్కెట్ క్యాప్ విభాగాల్లో పెట్టుబడుల పరంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భిన్న విభాగాల్లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మల్టీక్యాప్ ఆధారిత ఫోకస్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. ఈ విభాగంలో యాక్సిస్ ఫోకస్డ్–25 మ్యూచువల్ ఫండ్ పథకం మంచి పనితీరుతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాబడులు..: ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 20 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ 50 టీఆర్ఐ పెరుగుదల 13.8 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో 17.5 శాతం, ఐదేళ్ల కాలంలో 12.9 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకం సొంతం. ఇదే కాలంలో నిఫ్టీ 50 టీఆర్ఐ వృద్ధి 14.2 శాతం, 8.6 శాతంగానే ఉంది. అంటే బెంచ్ మార్క్ పనితీరు కంటే ఎంతో ఉత్తమ రాబడుల చరిత్ర ఈ పథకంలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ పథకం 2012లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు వార్షిక రాబడులు సగటున 16 శాతం పైనే ఉండటం మెరుగైన పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోనూ అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న పథకాల్లోనూ యాక్సిస్ ఫోకస్డ్ 25 అగ్ర పథాన ఉంది. పెట్టుబడుల వ్యూహాలు..: సెబీ నిబంధనల ప్రకారం ఫోకస్డ్ ఫండ్స్ గరిష్టంగా 30 స్టాక్స్ వరకు పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండొచ్చు. ఈ పథకం మాత్రం 25 స్టాక్స్‌నే పరిమితిగా పెట్టుకుంది. అది కూడా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ నుంచి వీటిని ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 24 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే మొత్తం పెట్టుబడుల్లో 64.5 శాతం వరకు ఇన్వెస్ట్ చేసి ఉంది. బోటమ్‌అప్ విధానాన్ని స్టాక్స్ ఎంపికకు పాటిస్తుంది. స్థిరమైన, అధిక నాణ్యతతో కూడిన వ్యాపారాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడుల్లో సగం మేర తక్కువ అస్థిరతలు కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకునే వ్యూహాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను గమనిస్తూ, రిస్క్ ఎక్కువగా ఉన్న విభాగం నుంచి తక్కువగా ఉండే విభాగానికి పెట్టుబడులను మళ్లించే వ్యూహాలను పాటిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెట్టుబడుల్లో 42.5 శాతం మేర వీటిల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కెమికల్స్, సేవల రంగంలోని కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. -
వివాదాల్లో చిక్కుకున్న బ్యాంకింగ్ రాణులు
-
ఉబెర్ రైడ్స్‌కు యూపీఐ ద్వారా చెల్లింపు
ఎన్పీసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో భాగస్వామ్యం న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ తాజాగా తన ప్లాట్‌ఫామ్‌కు యూపీఐ సేవలను అనుసంధానించింది. దీని కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ), యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఉబెర్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయిన 4.5 లక్షలకుపైగా డ్రైవర్లు యూపీఐ ద్వారా పేమెంట్స్‌ను స్వీకరించొచ్చు. అంటే మనం కూడా ఉబెర్ రైడ్స్‌కు అయిన మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. కాగా ఇప్పటి వరకు యూజర్లు క్యాష్, డెబిట్/క్రెడిట్ కార్డులు, పేటీఎం వాలెట్ ద్వారా ఉబెర్ రైడ్స్‌కు చెల్లింపులు చేస్తున్నారు. ఆ మూడు మార్కెట్లపై ప్రధాన దృష్టి ఉబెర్.. భారత్, బ్రెజిల్, మెక్సికో మార్కెట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. తద్వారా కంపెనీ వృద్ధిని మరింత పెంచుకోవాలని చూస్తోంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది జూలైలో భారత్‌లో 115 శాతం వృద్ధిని సాధించినట్లు ఉబెర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ బిజినెస్) డేవిడ్ రిచ్టర్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. తమ ప్లాట్‌ఫామ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి మరిన్ని సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇప్పటికే కంపెనీ ఈ దిశగా పలు చర్యలు తీసుకుందని, ప్లాట్‌ఫామ్‌కు యూపీఐ సేవల అనుసంధానం ఇందులో భాగమేనని తెలిపారు. తమకు అమెరికా వెలుపల భారత్ అతిపెద్ద మార్కెట్ అని గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... అందుబాటులో ఉండే, అభివృద్ధికి సహకరించే టెక్నాలజీలను కలిగి ఉండటమే డిజిటల్ ఇండియా ప్రధాన ఉద్దేశమని తెలిపారు. -
బ్యాంకుకెళ్తే బాదుడే..!!
-
బ్యాంకుకెళ్తే బాదుడే..!!
⇒ నగదు లావాదేవీలపై పరిమితులు ⇒ నెలలో 4 దాటితే రూ. 150 వడ్డన ⇒ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో అమల్లోకి న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను కుదిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు బుధవారం నుంచి పరిమితులను అమల్లోకి తెచ్చాయి. నెలలో నాలుగు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్) దాటితే రూ. 150 వడ్డించడం మొదలుపెట్టాయి. పొదుపు, శాలరీ అకౌంట్లకు వీటిని వర్తింపచేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. దీని ప్రకారం ఒక నెలలో పొదుపు ఖాతాలకు సంబంధించి హోమ్ బ్రాంచ్‌లలో నాలుగు నగదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. అవి దాటితే ప్రతి అదనపు లావాదేవీపై రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక థర్డ్ పార్టీ నగదు లావాదేవీలకు సంబంధించి రోజుకు రూ. 25,000 పరిమితి ఉంటుంది. బేసిక్ నో–ఫ్రిల్స్ ఖాతాల్లో గరిష్టంగా నాలుగు విత్‌డ్రాయల్స్ ఉచితంగా ఉంటాయి. నగదు డిపాజిట్లకు ఫీజులేమీ వర్తించవు. ఐసీఐసీఐ: ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. హోమ్ బ్రాంచ్‌లో నెలలో తొలి నాలుగు లావాదేవీలు ఉచితం. అవి దాటితే ప్రతి రూ. 1,000కి రూ. 5 చొప్పున.. కనిష్టంగా రూ. 150 చార్జీలు ఉంటాయి. థర్డ్ పార్టీ లిమిట్ రోజుకు రూ. 50,000గా ఉంటుంది. నాన్–హోమ్ బ్రాంచ్‌లలో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితం. అటుపైన ప్రతి రూ. 1,000కి రూ. 5 చార్జీ. కనిష్టంగా రూ. 150 చార్జీలు వర్తిస్తాయి. అటు క్యాష్ డిపాజిట్ మెషీన్లలో కూడా తొలి నగదు డిపాజిట్ ఉచితం. ఆ తర్వాత రూ. 1,000కి రూ. 5 చొప్పున చార్జీలు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్..: విలువపరంగా రూ. 10 లక్షల దాకా తొలి అయిదు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్) ఉచితం. దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 5 లేదా రూ. 150 (ఏది ఎక్కువైతే అది) మేర చార్జీలు వర్తిస్తాయి. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
గత ఏడు సెషన్‌లోని పతనానికి బ్రేక్ పడి వారాంతంలో కోలుకున్న స్టాక్‌మార్కెట్లు, మళ్లీ భారీ నష్టాల బాట పట్టాయి. ఈక్విటీ బెంచ్ మార్కు సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కిందకి దిగజారింది. నిఫ్టీ తన కీలకమార్కు 7950నుంచి పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 237.70 పాయింట్ల నష్టంలో 25,803 వద్ద, నిఫ్టీ 76.05 పాయింట్ల నష్టంలో 7,909 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, సిప్లా, ఎస్బీఐ, టాటా మోటార్స్ల్లో నెలకొన్న నష్టాలతో సెన్సెక్స్ నష్టాల్లో కొనసాగుతోందని విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ సైతం రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరెబుల్స్లో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా 67.82 వద్ద ప్రారంభమైంది. ఆయిల్ ధరలపై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని తెలిసింది. లిబియా ఉత్పత్తిని పెంచాలన్న నేపథ్యంలో ఒపెక్ అవుట్‌పుట్‌లో కోతకు ఎలా ప్లాన్ చేయబోతుందోనని మార్కెట్లు దృష్టిసారించినట్టు విశ్లేషకులు చెప్పారు. 10 నెలల కనిష్టానికి వచ్చిన బంగారం ధరలపై కొనుగోలుదారులు లబ్ది పొందాలని కొనుగోళ్లు చేపట్టడంతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 37 రూపాయల లాభంతో 27,005 వద్ద కొనసాగుతోంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : స్వల్పలాభాలతో ప్రారంభమైన గురువారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే నాటికి నష్టాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 205.37 పాయింట్ల నష్టంతో 27,710 వద్ద, నిఫ్టీ 55.75 పాయింట్ల నష్టంతో 8,510 దగ్గర ముగిసింది. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పేయింట్స్, విప్రో టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. యాక్సిస్ బ్యాంకు, బీహెచ్ఈఎల్, ఐసీఐసీఐ, ఎస్ బీఐ, ఎమ్ అడ్ ఎమ్ టాప్ లూజర్లుగా నష్టాల్లో గడించాయి. కంపెనీలు ప్రకటిస్తున్న నిరాశజనకమైన తొలి త్రైమాసిక ఫలితాలు, బ్యాంకు స్టాక్స్ లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదుచేశాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంకు నిఫ్టీ దాదాపు 1.5శాతం మేర నష్టపోయింది. యాక్సిస్ బ్యాంకు, ఎస్ బీఐలు 3-4శాతం మేర నష్టపోయాయి. మరోవైపు జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన అనంతరం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కూడా 1శాతం మేర నష్టపోయింది. లాభాల్లో అదరగొట్టినప్పటికీ, బ్యాంకుకు ఉన్న మొండిబకాయిల బెడదతో షేర్లు పతనమయ్యాయి. కాగా, మార్కెట్ వాల్యుయేషన్ లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు నేటి మార్నింగ్ ట్రేడింగ్ లో ఆల్ టైమ్ గరిష్టస్థాయికి చేరింది. రూ.107 లక్షల కోట్లగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ నమోదైంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 67.19గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో భారీగా నష్టోయిన పుత్తడి కొంత కోలుకొని, రూ.97 లాభంతో రూ.30,834గా నమోదైంది.