IT index
-
నయా ఫండ్: యాక్సిస్ ఏఎంసీ నుంచి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్
ముంబై: యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది జూన్ 27న ప్రారంభమై జూలై 11తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని సంస్థ సీఈవో బి. గోప్‌కుమార్ తెలిపారు. నిఫ్టీ ఐటీ టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధులను ఐటీ సూచీలోని స్టాక్స్‌లో దాదాపు అదే నిష్పత్తి కింద ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. తదనుగుణంగా ఇందులో సిప్, ఎస్టీపీ, ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు. అన్ని వ్యాపారాల్లోనూ టెక్నాలజీ కీలకంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐటీ రంగానికి మరింత డిమాండ్ ఉండగలదని, తదనుగుణంగా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని గోప్‌కుమార్ తెలిపారు. -
ఐటీ రికార్డ్- మళ్లీ 46,000కు సెన్సెక్స్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి బంతిలా పైకెగశాయి. వెరసి సెన్సెక్స్ మళ్లీ 46,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. చివర్లో ఊపందుకున్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 453 పాయింట్లు జంప్‌చేసి 46,007 వద్ద ముగిసింది. నిఫ్టీ 138 పాయింట్లు ఎగసి 13,466 వద్ద నిలిచింది. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా సోమవారం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే నేటి ట్రేడింగ్‌లోనూ తొలి రెండు సెషన్లలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. సెన్సెక్స్ 46,080- 45,112 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,492-13,193 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. (దిగివచ్చిన పసిడి, వెండి ధరలు) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఐటీ 3.4 శాతం ఎగసింది. 23,681 వద్ద ఐటీ ఇండెక్స్ సరికొత్త గరిష్టానికి చేరింది. ఈ బాటలో ఫార్మా, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 2.3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, గెయిల్,విప్రో, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, ఎల్అండ్టీ, నెస్లే, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివీస్, ఐషర్, ఏషియన్ పెయింట్స్ 5.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, ఆర్ఐఎల్, హిందాల్కో 1-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. (అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే!) కోఫోర్జ్ జోరు డెరివేటి స్టాక్స్‌లో కోఫోర్జ్, మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్, ఐజీఎల్, బంధన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సన్ టీవీ, ఇండిగో, వేదాంతా, టాటా పవర్, సెయిల్, క్యాడిలా, టాటా కెమ్ 7.5-3.4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, పీఎన్బీ, భారత్ ఫోర్జ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎస్కార్ట్స్, ఎల్ఐసీ హౌసింగ్, అపోలో టైర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,568 లాభపడగా.. 1,352 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల వెనకడుగు నగదు విభాగంలో ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్నవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం దాదాపు రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,425 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
చివర్లో అమ్మకాలు- ఐటీ ఇండెక్స్ రికార్డ్
ఆద్యంతం కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలా పడ్డాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు క్షీణించి 38,365 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 11,317 వద్ద నిలిచింది. తొలుత బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. అయితే చివరి అర్ధగంటలో అమ్మకాలు ఊపందుకోవడంతో చతికిలపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 38,746 గరిష్టాన్ని తాకగా.. 38,275 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. వెరసి 500 పాయింట్ల స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. ఈ బాటలో నిఫ్టీ 11,437- 11,290 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాలు, యూరోపియన్ మార్కెట్లలో అమ్మకాల కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూసినట్లు నిపుణులు తెలియజేశారు. ఐటీ మాత్రమే ఎన్ఎస్ఈలో ఐటీ 1.2 శాతం పుంజుకోగా మిగిలిన అన్ని రంగాలూ 3-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇంట్రాడేలో ఐటీ ఇండెక్స్ 18,672 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం! ఏప్రిల్ నుంచి ఈ రంగం 46 శాతం ర్యాలీ చేసింది. 26 రంగాలలో ఐటీ రంగం మాత్రమే కోవిడ్-19 సవాళ్లకు ఎదురు నిలవగలిగినట్లు కేవీ కామత్ కమిటీ తాజాగా పేర్కొనడం ఇందుకు దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇన్ఫ్రాటెల్ పతనం నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా 2.7-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్ఫ్రాటెల్ 8 శాతం పతనంకాగా.. జీ, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, యాక్సిస్, ఎయిర్టెల్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఎస్బీఐ, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌పీ లైఫ్ 4.7-1.7 శాతం మధ్య క్షీణించాయి. ఐడియా వీక్ డెరివేటివ్స్‌లో ఐడియా 8.5 శాతం కుప్పకూలగా.. పీవీఆర్, జిందాల్ స్టీల్, ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్, సెయిల్, అపోలో టైర్, జీఎంఆర్, ఎన్ఎండీసీ, నాల్కో, టాటా పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్ 6-4 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ ప్రు, గోద్రెజ్ సీపీ, పిరమల్, ఇండిగో, జూబిలెంట్ ఫుడ్, ఎస్బీఐ లైఫ్, సీఫోర్జ్ 4.3-0.7 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5-1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1717 నష్టపోగా.. 978 మాత్రమే లాభపడ్డాయి. అమ్మకాల బాట నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కేవలం రూ. 7 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,889 కోట్లు, డీఐఐలు రూ. 457 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే -
హెచ్-1బీ వీసా దెబ్బ: నష్టాల్లో మార్కెట్లు
టెక్నాలజీ స్టాక్స్‌లో నెలకొన్న ఆందోళనలు, లాభాల స్వీకరణ మార్కెట్లకు దెబ్బకొట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 119.01 పాయింట్లు పడిపోయి 26759.23 వద్ద ముగియగా.. 30 పాయింట్లు పడిపోయి నిఫ్టీ 8243.80 పాయింట్ల వద్ద సరిపెట్టుకుంది. హెచ్-1బీ వీసాల్లో నెలకొన్న ఆందోళనతో ఐటీ షేర్లు ఢమాల్ మనిపించాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహింద్రా, మైండ్‌ట్రీ, ఎంపాసిస్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హెచ్1బి వీసాల్లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన ‘అమెరికా ఉద్యోగాల పరిరక్షణ, పెంపు చట్టం (ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్)’ బిల్లును కాంగ్రెస్‌లో మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో ఐటీ సబ్-ఇండెక్స్ కనీసం 3 శాతం పడిపోయింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహింద్రాలు దాదాపు 4.5 శాతం మేర పడిపోయాయి. మరోవైపు బ్యాంకింగ్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. కొటక్ మహింద్రా బ్యాంకు, యస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలనార్జించడంతో బ్యాంకు నిఫ్టీ 0.82 శాతం పెరిగింది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర పెంపుకు కళ్లెం పడి 34 రూపాయలు నష్టపోయింది. 10 గ్రాముల బంగారం ధర 27,914గా నమోదైంది. -
4 రోజుల లాభాలకు బ్రేక్
తొలుత +140, తుదకు -110 - 25,474 వద్ద ముగిసిన సెన్సెక్స్ - తొలిసారి 7,700ను తాకిన నిఫ్టీ - రియల్టీ, మెటల్, విద్యుత్, ఆయిల్ డీలా - 2%పైగా లాభపడ్డ ఐటీ ఇండెక్స్ నాలుగు రోజుల వరుస లాభాల తరువాత మార్కెట్ నీరసించింది. లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయింది. 25,474 వద్ద ముగిసింది. అయితే తొలుత 140 పాయింట్ల వరకూ లాభపడింది. ఉదయం సెషన్లో 25,736 వద్ద కొత్త గరిష్టాన్ని చేరింది. ఆ స్థాయిలో అమ్మకాలు పెరగడంతో మిడ్ సెషన్‌కల్లా లాభాలు కోల్పోవడమేకాకుండా 184 పాయింట్ల వరకూ నష్టపోయింది. 25,366 వద్ద కనిష్ట స్థాయిని చవిచూసింది. ఇక నిఫ్టీ కూడా మార్కెట్ చరిత్రలో తొలిసారి 7,700 పాయింట్లను తాకడం విశేషం. ఆపై ఒడిదుడుకులకులోనై చివరికి 30 పాయింట్ల నష్టంతో 7,627 వద్ద నిలిచింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 778 పాయింట్లు పుంజుకున్న విషయం విదితమే. ఎఫ్ఐఐల అమ్మకాలు ప్రధానంగా రియల్టీ ఇండెక్స్ 4.2% పతనంకాగా, మెటల్, విద్యుత్, ఆయిల్ రంగాలు 3-2% మధ్య నష్టపోయాయి. రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్, యూనిటెక్, డీఎల్ఎఫ్, ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ 8-3% మధ్య దిగజారాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, హిందాల్కో, కోల్ ఇండియా, భెల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్, సెసాస్టెరిలైట్, భారతీ, టాటా మోటార్స్, ఆర్ఐఎల్, ఐటీసీ, ఎల్అండ్టీ 5-1.5% మధ్య తిరోగమించాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, హీరోమోటో 3.5-1.5% మధ్య లాభపడ్డాయి. కాగా, ఎఫ్ఐఐలు రూ. 313 కోట్లు, దేశీ సంస్థలు రూ. 404 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో తిరోగమించాయి. అయితే ట్రేడైన షేర్లలో 1,647 లాభపడితే, 1,487 నష్టపోయాయి. -
మూడు వారాల కనిష్టం
- 185 పాయింట్లు డౌన్ - 22,324కు దిగిన సెన్సెక్స్ - ఆరు వారాల కనిష్టానికి నిఫ్టీ - ఐటీ ఇండెక్స్ 2.6% పతనం ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు తగిన మెజారిటీ రాకపోవచ్చునన్న అంచనాలు మరోసారి స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దీనికితోడు విదేశీ మార్కెట్ల నష్టాలు కూడా సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. వెరసి సెన్సెక్స్ నష్టాలతో మొదలైంది. ఒక దశలో 222 పాయింట్లు పతనమై 22,300 దిగువకు చేరింది. చివరికి 185 పాయింట్లు పోగొట్టుకుని 22,324 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల కనిష్టంకాగా నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 6,653 వద్ద నిలిచింది. ఇది ఆరు వారాల కనిష్టం కావడం గమనార్హం. ఇంతక్రితం మార్చి 27న ఈ స్థాయిలో ముగిసింది. సాఫ్ట్వేర్ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎంఫసిస్, ఒరాకిల్, విప్రో, టీసీఎస్ 4.5-1.5% మధ్య నష్టపోవడంతో ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 2.6% నష్టపోయింది. ప్రధానంగా టార్గెట్ ధరను 32%మేర తగ్గిస్తూ ఇన్ఫోసిస్ షేరును యూబీఎస్ డౌన్‌గ్రేడ్ చేయడం ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు తెలిపారు. రియల్టీ డీలా ఎఫ్ఐఐలు రూ. 119 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్ రూ. 259 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. కాగా, సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, ఎస్బీఐ, సన్ ఫార్మా మాత్రమే (1%) లాభపడ్డాయి. ఇక హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, సిప్లా, బజాజ్ ఆటో, మారుతీ, భారతీ 3-1.5% మధ్య తిరోగమించాయి. ట్రేడైన షేర్లలో 1,493 నష్టపోగా, 1,234 లాభపడ్డాయి. రియల్టీ షేర్లు డీబీ, హెచ్‌డీఐఎల్, యూనిటెక్, మహీంద్రా లైఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 4-2% మధ్య నీరసించగా, మిడ్ క్యాప్స్‌లో అలహాబాద్, సిండికేట్, యునెటైడ్ బ్యాంక్‌లతోపాటు, రెయిన్ ఇండస్ట్రీస్, దీపక్ ఫెర్టిలైజర్స్, పిపావవ్ డిఫెన్స్, డెల్టా కార్ప్, సోలార్ ఇండస్ట్రీస్, గ్రీన్ప్లై 9-4% మధ్య పతనమయ్యాయి.