
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ తాజాగా ’క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్‌డీఎల్ జూన్ 2028 ఇండెక్స్ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జనవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్.. క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్‌డీఎల్ జూన్ 2028 సూచీలోని డెట్ సాధనాల్లో 95–100 శాతం ఇన్వెస్ట్ చేస్తుంది. మిగతాది డెట్, మనీ మార్కెట్ సాధనాలు (ఏడాది వ్యవధిలోనే మెచ్యూర్ అయ్యే ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో) పెట్టుబడులు పెడుతుంది.
తదనుగుణంగా మెరుగైన రాబడులు అందించేలా ఇది పనిచేస్తుంది. ఇందులో లాకిన్ వ్యవధిలాంటివి ఉండవు కాబట్టి లిక్విడిటీకి సమస్య ఉండదు. తక్కువ డిఫాల్ట్ రిస్కులతో అత్యంత నాణ్యమైన పోర్ట్‌ఫోలియోను కోరుకునే వారికి, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఇది అనువుగా ఉంటుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ చంద్రేశ్ నిగమ్ తెలిపారు.
చదవండి: రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే!
Comments
Please login to add a commentAdd a comment