దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలహీనంగా ప్రారంభమైనాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలహీనంగా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 162 పాయింట్ల నష్టంతో 26397 వద్ద, నిఫ్టీ 56 నష్టంతో 8136వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో నిఫ్టీ కీలక మద్దతుస్తాయి 8150 కిందికి దిగజారింది. బ్యాంక్ నిప్టీ కూడా నష్టాలతోనే ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఐటీ ఎఫ్ ఎంసీజీ, ఆటో రంగం నష్టపోతోంది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాల్లోఉన్నాయి. గురువారం నగదు విభాగంలో ఎఫ్‌ఐఐలు దాదాపు రూ. 403 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, దేశీ ఫండ్స్ మాత్రం యథావిధిగా రూ. 238 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
అటు డాలర్ మారకపు విలువలో రూపాయి రెండు పైసల లాభంతో రూ. 68.37 వద్ద వద్ద ఉంది.