
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతోనే ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి ఏ మాత్రం కోలుకోని సూచీలు చివరికి భారీ నష్టాలనుమూటగట్టుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 509 పాయింట్లు పతనమై 56598 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 16858 వద్ద ముగిసింది. దలాల్ స్ట్రీట్‌లో వరుసగా ఆరవ రోజు కొనసాగిన నష్టాలతో ట్రేడర్ల వేల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగి పోతోంది.
ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు భారీగా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యుస్టీల్, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ, రిలయన్స్ భారీగా నష్ట పోయాయి. ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, డా. రెడ్డీస్, ఐషర్ మోటార్స్, నెస్లే లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 44 పైసలు క్షీణించి 81.94 వద్ద రికార్డు కనిష్టానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment