ముంబై: బుధవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ట్రెండ్ పాజిటివ్ గా ఉండడంతో దాదాపు వంద పాయింట్ల లాభానికి చేరువలో ఉంది. సెన్పెక్స్ 2 పాయింట్ల లాభంతో 27,398 దగ్గర. నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 8,282 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ మద్దతుస్థాయిలకు పైన నిలబడి స్థిరంగా ట్రేడవుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఐటి ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ , బ్యాంకింగ్ షేర్లు లాభాల బాట పట్టాయి. , ఇన్సోఫిస్, టీసీఎస్ పాజిటివ్ గా ట్రేడవుతున్నాయి.
అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ తో పోలీస్తే రూపాయి 7 పైసల నష్టంతో 65.12 దగ్గర ఉంది.