బెంగళూరు: భారత్‌లో తొలిసారి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని నగరంలో కేంద్ర మంత్రి అశ్విణీ వైష్ణవ్ నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు.
బెంగళూరులోని కేంబ్రిడ్జీ లే అవుట్‌లో ఈ పోస్టు ఆఫీస్‌ను నిర్మించారు. 1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు చెప్పారు.
The spirit of Aatmanirbhar Bharat!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023
🇮🇳India’s first 3D printed Post Office.
📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b
మన సొంత టెక్నాలజీని ఉపయోగించి 3డీ పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో సాధ్యం కానీదాన్ని సుసాధ్యం చేసినట్లు వెల్లడించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా 4జీ, 5జీ టెక్నాలజీలను ఇండియా అభివృద్ధి చేసిందని అన్నారు.
ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికులు వారే..
Comments
Please login to add a commentAdd a comment