Printed
-
అనంత్ ప్రేమంతా రాధిక గౌను మీదే..! వైరల్ ఫొటోలు
-
దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు
బెంగళూరు: భారత్‌లో తొలిసారి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని నగరంలో కేంద్ర మంత్రి అశ్విణీ వైష్ణవ్ నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జీ లే అవుట్లో ఈ పోస్టు ఆఫీస్‌ను నిర్మించారు. 1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు చెప్పారు. The spirit of Aatmanirbhar Bharat! 🇮🇳India’s first 3D printed Post Office. 📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023 మన సొంత టెక్నాలజీని ఉపయోగించి 3డీ పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో సాధ్యం కానీదాన్ని సుసాధ్యం చేసినట్లు వెల్లడించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా 4జీ, 5జీ టెక్నాలజీలను ఇండియా అభివృద్ధి చేసిందని అన్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
ప్రత్యేకంగా కనిపించే ప్రింటెడ్ డ్రెస్సులు.. స్టైలింగ్ అదిరిపోద్ది
ఫ్లోరల్, మల్టీకలర్ ప్రింట్స్ ఏవైనా మనసుకు ఎప్పుడూ ఆహ్లాదాన్నిస్తాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా చూడముచ్చటగా ఉంటాయి. సీజన్‌తో పనిలేకుండా పార్టీ ఏదైనా ఇండోవెస్ట్రన్ లుక్‌తో టాప్ టు బాటమ్ ఎవర్గ్రీన్ లుక్‌తో ప్రింటెడ్ ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్ వేర్‌గానూ కలర్‌ఫుల్ అనిపిస్తాయి.అందుకే, డిజైనర్లు ప్రింట్ కాన్సెప్ట్‌ను ఎప్పుడూ వినూత్నంగా మన ముందుకు తీసుకు వస్తుంటారు. వాటిలో కొన్ని డిజైన్స్ ఇవి. లెహంగా శారీ, లాంగ్ కోట్, ట్రౌజర్, శారీ గౌన్, కుర్తా పైజామా.. మల్టీ కలర్ ప్రింట్లతో టాప్ టు బాటమ్ ఒకే కలర్ కాంబినేషన్‌ను ఎంచుకుంటే ఈ థీమ్‌కు సరిగ్గా నప్పుతుంది. ఈ స్టయిల్‌కి ఇతర యాక్ససరీస్ కూడా అంతగా అవసరం ఉండదు. ప్రత్యేకంగా కనిపించే ఈ ప్రింటెడ్ డ్రెస్సులు ఎక్కడ ఉన్నా అంతే ప్రత్యేకతను చాటుతాయి. -
మ్యూజియంలో మైక్రోస్కోపిక్ మోనాలీసా
లండన్: ప్రపంచంలో అత్యంత ఖరీదైన... అందమైన పెయింటింగుల్లో మోనాలీసా ఒకటి. ఆమె.. ఇప్పుడు సాంకేతిక నిపుణుల చేతిలో కొత్త రూపం దాల్చింది. పారిస్ లౌన్రే మ్యూజియంలో అతి సూక్ష్మ రూపంలో దర్శనమిస్తోంది. నానో టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఆ వర్ణ చిత్రం ఓ పిక్సల్ కంటే తక్కువగా ఉండి, ఐఫోన్ రెటీనా డిస్ ప్లే లా నిజమైన మోనాలీసా కంటే సుమారు పదివేల రెట్లు తక్కువగా కనిపిస్తోంది. లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఇప్పుడు అద్భుతాలను సృష్టించగల్గుతున్నారు. ఏ చిత్రాన్నైనా భిన్నంగా చూపించగల్గుతున్నారు. సుమారు 127.000 (డాట్స్ పర్ ఇంచ్) డిపిఐ రిజల్యూషన్ తో చిత్రాలు రూపొందే అవకాశం ఉండటంతో పాటు...అధిక నాణ్యత ఉండే ఈ కొత్త టెక్నాలజీపైనే అంతా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా వార పత్రికలు వంటివి ప్రింట్ చేసేందుకు సుమారు మూడు వందల డిపిఐతో ఇది మంచి ఫలితాలనిస్తోంది. ఈ లేజర్ టెక్నాలజీతో ఓ కొత్త అప్లికేషన్ ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్లుగా డెబ్ మార్క్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధక బృందం చెప్తోంది. దీంట్లో డేటాను కనిపించకుండా ఉండేంత సూక్ష్మ రూపంలో దాచుకునేందుకు వీలౌతుంది. సీరియల్ నెంబర్లు, బార్ కోడ్ లు వంటి వాటితో పాటు... ఇతర డేటానూ భద్రపరచుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మోసాలకు పాల్పడేవారికి ముకుతాడు వేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా మోనాలీసా చిత్రానికి వినియోగించి అతి సూక్ష్మరూపంలో రూపొందించి ప్రత్యేకతను చాటారు. కుడ్య రూపాలు, చిత్రాలకే కాక... అలంకరణలు, మొబైల్ ఫోన్లు వంటి ఉత్పత్తుల కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కార్ల భాగాలు, వాయిద్య పరికరాల ప్యానెల్స్, బటన్స్ వంటి వస్తువుల తయారీ సులభతరం అవుతుండటంతో ఈ కొత్త విధానంపై విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. -
నకిలీ మహాత్ములు!
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్:మన కరెన్సీ నోట్లపై.. ముఖ్యంగా పెద్ద నోట్లపై గాంధీ మహాత్ముని చిత్రం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. మన దేశానికి దాస్యశృంఖాలల నుంచి విముక్తి కల్పించి జాతిపితగా నిలిచిన ఆ మహాత్ముడు మన కళ్ల ముందు కదలాడాలని.. నిత్యం ఆయన్ను స్మరించుకోవాలన్న సదుద్దేశంతో కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని ముద్రిస్తున్నారు. ఇప్పుడు ఆ బాపూజీనే అవమానపరిచే రీతిలో జర్నలిస్టు ముసుగులో నకిలీ నోట్లు చెలామణీ చేస్తూ మన ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తున్నాడు.. ఓ ఘరానా ‘మహాత్ముడు’. పట్టణంలోని ఓ యువజన నాయకుడు, మరో నాయకురాలి పుత్రరత్నం తెరవెనుక నుంచి అందిస్తున్న సహకారంతో మరికొందరితో ముఠా ఏర్పాటు చేసుకుని ఈ నకిలీ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. బ్యాంకులో పని చేసే ఓ ఉద్యోగిని, ఏటీఎం లలో నగదు పెట్టే ఓ ఏజెన్సీ ఉద్యోగుల అండదండలతో బ్యాంకుల్లోకీ నకిలీ నోట్లను చొప్పిస్తున్నారు. అసలు సూత్రధారి అతడే జిల్లాలో ఇటీవలి కాలంలో జోరుగా సాగుతున్న దొంగ నోట్ల దందాకు జర్నలిస్టు ముసుగు కప్పుకొన్న శ్రీకాకుళం మండల వీధికి నకిలీ మహాత్ముడే ప్రధాన సూత్రధారి అని ‘న్యూస్‌లైన్’ పరిశోధనలో తెలింది. ఇటీవలి కాలంలో నకిలీ నోట్ల చెలామణీ కేసులో పోలీసులు అరెస్టు చూపించిన ముగ్గురు వ్యక్తుల్లో ఓ వ్యక్తి ఒడిశా నుంచి దొంగ నోట్లను జిల్లాకు తరలిస్తుంటాడు. వీటిని సూత్రధారి ‘ప్రసాదం’లా జిల్లా అంతటికీ పంచేస్తున్నాడు. కొంత మంది వ్యక్తులను పావులుగా వాడుకుని ఈ దందా సాగిస్తున్నాడు. గత నెలలో అరెస్టు అయిన అనిల్ అనే వ్యక్తి కూడా ఈ సూత్రధారి చేతిలో పావేనని సమాచారం. నకిలీ నోట్ల చెలమణీతోపాటు అనేక రకాల సంఘవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాడని తెలిసింది. గతంలో ఈ సూత్రధారి పొన్నాడకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.లక్షకు కారు కొన్నాడు. దానికి సంబంధించిన పత్రాలు కారు యజమాని ఇవ్వకపోవడంతో కారు తిరిగి తీసుకొని రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఓ రోజు అర్ధరాత్రి సమయంలో కొంతమందిని తీసుకుని అతని ఇంటికి వెళ్లి సొమ్ము ఇవ్వకపోతే అతని భార్యను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. ‘రూ.లక్షకే కారు అమ్మాను కదా.. ఆ లక్ష ఇచ్చేస్తానని’ కారు యజమాని ఎంత నచ్చజెప్పినా వినలేదు. దాంతో చేసేది లేక ఇంట్లో ఉన్న బంగారు నగలు అమ్మి భార్య మూడు లక్షలు ముట్టజెప్పాడు. ఇలా అనేక మార్గాల్లో మన సూత్రధారి అడ్డగోలుగా సంపాదించేస్తున్నాడు. బ్యాంకుల్లో దొంగ నోట్ల చెలామణీ ఇలా.. ఈ ముఠా సూత్రధారి బ్యాంకులు, ఏటీఎంలలోకీ నకిలీ నోట్లను చొప్పిస్తున్నాడు. ఈయన మేనల్లుడి భార్య పట్టణ శివారులోని ఓ బ్యాంకులో పని చేస్తున్నారు. ఆమె ద్వారా ఈ పని చేయిస్తున్నారు. ఆమె క్యాష్ కౌంటర్లో ఉన్నప్పుడు దొంగ నోట్లను బ్యాంకు నగదులో కలిపించేస్తున్నారు. అక్కడ్నుంచి ఆ సొమ్ము విత్ డ్రా చేసే వారికో లేక ఏటీఏంలలోకో వెళుతోంది. పొందూరు మండలం తోలాపిలో ఓ బ్యాంకులో పనిచేసే వ్యక్తిని కూడాఇందుకు వినియోగించుకుంటున్నారు. అదే విధంగా ఏటీఏంలలో నగదు జమ చేసే ఓ ప్రైవేటు ఏజెన్సీకి చెందిన ఓ ఉద్యోగితో కుమ్మక్కై ఏటీఏంలలో దొంగనోట్లను చేర్చేవాడు. రాజకీయ ఒత్తిళ్లు దొంగ నోట్ల చెలమణీ జోరుగా సాగుతుండటంతో జిల్లా పోలీసు అధికారులు దీనిపై దృష్టి సారించారు. కేసు విచారణ బాధ్యతను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. అంతే కాకుండా ముగ్గురు సీఐలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు కేసు దర్యాప్తును ముందుకు సాగనీయడం లేదు. ఈ ముఠాకు ఓ యువజన నాయకుడు, మరో రాజకీయ నాయకురాలి పుత్రుడు తెరవెనుక నుంచి అండదండలందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తామేమీ చేయలేమని గుర్తించి పోలీసు సిబ్బంది వారిచ్చే ముడుపులకు లొంగిపోయి కేసును నీరుగార్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో ఈ ముఠా సభ్యులైన వజ్రపుకొత్తురు మండలానికి చెందిన మోహనరావు, పలాస మండలానికి చెందిన సంతోష్‌కుమార్, విశ్వనాధంలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని విచారించగా పలువురి పేర్లు బయటకు వచ్చాయి. దాంతో కొద్దిరోజుల కిందట మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో జర్నలిస్టు ముసుగు కప్పుకొన్న సూత్రధారి కూడా ఉన్నాడు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విడిచిపెట్టేశారు.