
ఫ్లోరల్, మల్టీకలర్ ప్రింట్స్ ఏవైనా మనసుకు ఎప్పుడూ ఆహ్లాదాన్నిస్తాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా చూడముచ్చటగా ఉంటాయి. సీజన్‌తో పనిలేకుండా పార్టీ ఏదైనా ఇండోవెస్ట్రన్ లుక్‌తో టాప్ టు బాటమ్ ఎవర్‌గ్రీన్ లుక్‌తో ప్రింటెడ్ ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్ వేర్‌గానూ కలర్‌ఫుల్ అనిపిస్తాయి.అందుకే, డిజైనర్లు ప్రింట్ కాన్సెప్ట్‌ను ఎప్పుడూ వినూత్నంగా మన ముందుకు తీసుకు వస్తుంటారు. వాటిలో కొన్ని డిజైన్స్ ఇవి.
లెహంగా శారీ, లాంగ్ కోట్, ట్రౌజర్, శారీ గౌన్, కుర్తా పైజామా.. మల్టీ కలర్ ప్రింట్లతో టాప్ టు బాటమ్ ఒకే కలర్ కాంబినేషన్‌ను ఎంచుకుంటే ఈ థీమ్‌కు సరిగ్గా నప్పుతుంది. ఈ స్టయిల్‌కి ఇతర యాక్ససరీస్ కూడా అంతగా అవసరం ఉండదు. ప్రత్యేకంగా కనిపించే ఈ ప్రింటెడ్ డ్రెస్సులు ఎక్కడ ఉన్నా అంతే ప్రత్యేకతను చాటుతాయి.