రూపాయి పతనం, పుత్తడి ధరలు ఢమాల్
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో మొదలుకాగా, దేశీయ కరెన్సీ, పసిడి బలహీనంగా మొదలైంది. దాదాపు15 పైసలు నష్టపోయి రెండు వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ మారకరంలో రుపీ రూ. 64.68 వద్ద కొనసాగుతోంది. అమెరికన్ ఆర్థిక డేటా అంచనాలను మించిన మోదు కావడంతో డాలర్ కు డిమాండ్ పుట్టింది. పై విదేశీ యూనిట్ను బలపరిచింది. దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడంతో విదేశీ కరెన్సీల నుంచి డాలర్కు లాభాల బాటలో నడిచింది. డాలర్ రెండువారాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. అటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంపునకే సంకేతాలివ్వడంతో దేశీయ కరెన్సీపై ఒత్తడి ప్రకటించింది. దీంతో గురువారం రూపాయి విలువ 23 పైసలు పడిపోయింది, రెండు వారాల కనిష్టం 64.53 డాలర్ల వద్ద ముగిసింది.
అటు బంగారం , వెండి ధరలు బలహీనంగా ఉన్నాయి. శుక్రవారం కూడా పతనం దిశగానే పయనిస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పుత్తడి ధర పది గ్రా. 268 నష్టపోయి రూ. 28,762 వద్ద ముగియగా ఈ రోజు స్వల్పంగా పుంజుకుని రూ.28,784వద్ద ఉంది.. డాలర్ బలం, ఆయిల్‌ధరల క్షీణత ప్రభావాన్ని చూపిస్తున్నట్టు ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.