దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 18పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో ప్రారంభ మయ్యాయి. అనంతరం కొద్దిగా తేరుకుని ప్రస్తుతం సెన్సెక్స్ 22 పాయింట్లు బలపడి 28,357వద్ద నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 8,775 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ రివ్యూకోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రకటనపై బ్యాంకింగ్ నిఫ్టీ మూవ్ ఆధారపడనుంది. అలాగే ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ పాజిటివ్‌గా గాను, ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్ ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ నెగిటివ్‌గా స్పందిస్తోంది. అటు సన్ టీవీ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ యాక్టివ్ గా ఉంది. టైటన్, సీబీజెడ్ లాంటి బంగారం షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి.