![Arjun Sarja to file for defamation against Sruthi Hariharan over Me Too - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/22/shraddhasrinath.jpg.webp?itok=vgZ2nDzo)
శ్రద్ధా శ్రీనాథ్
నటుడు అర్జున్‌పై కన్నడ నటి శ్రుతీ హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రుతికి మద్దతు ఇస్తున్నట్లు ట్వీట్టర్ ద్వారా తెలిపారు మరో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్. ‘‘2016 నవంబర్‌లో ఓ టాక్ షో టైమ్‌లో శ్రుతీ నాకు ఈ సంఘటన చెప్పింది. కాకపోతే అప్పుడు పేరు చెప్పలేదు. ఏం జరిగిందో ఇప్పుడు బయటకు చెప్పింది’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని షేర్ చేశారు శ్రద్ధా. ‘‘ఓసారి బెంగళూరు నుంచి కొచ్చిన్‌కి బస్‌లో వెళుతున్నాను. ఓ వ్యక్తి చేయి నన్ను అసభ్యంగా తాకడంతో నిద్ర నుంచి మేల్కొన్నాను. అందుకు నా దగ్గర ఏటువంటి ఆధారం లేదు.
ఆ చేదు అనుభవం మాత్రం మిగిలింది. ఈ సంఘటన జరిగినప్పుడు అతనితో పాటు, ఆ చేయితో కూడా ఓ సెల్ఫీ తీసుకొని ఉంటే అది సాక్ష్యంగా ఉండేదేమో?’’ అని పేర్కొన్నారామె. మరోవైపు శ్రుతీ హరిహరన్‌కు నటుడు ప్రకాష్‌రాజ్ మద్దతు తెలిపారు. ‘‘నా వృత్తిపరమైన కారణాల వల్ల నా పేరును చెప్పదలచుకోలేదు. శ్రుతీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. అర్జున్‌తో ఓ సందర్భంలో ఇబ్బంది పడ్డాను. ముందు అతడిని ‘జెంటిల్‌మెన్’ అని పిలవడం ఆపండి’’అంటూ మరో మహిళ అర్జున్‌ను ఆరోపించినట్లుగా, ట్వీటర్‌లో పోస్ట్ చేశారు శ్రుతీ హరిహరన్. ఇదిలా ఉంటే అర్జున్ పరిపూర్ణమైన ‘జెంటిల్‌మెన్’ అంటూ ఆయనతో ‘కాంట్రాక్ట్’ సినిమాలో కలిసి యాక్ట్ చేసిన హీరోయిన్ సోనీ చరిష్టా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment