మీటూ కేసులో అర్జున్‌ అరెస్ట్‌ అవుతారా? | Arjun is Arrested Due To Metoo | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 28 2018 9:50 AM | Last Updated on Sun, Oct 28 2018 12:35 PM

Arjun is Arrested Due To Metoo - Sakshi

యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ అరెస్ట్‌ అవుతారా? ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్న విషయం ఇదే. మీటూ సినీ వర్గాల్లో భయం పుట్టిస్తోంది. దీని ఎఫెక్ట్‌ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. మీటూ కారణంగా కేంద్రమంత్రే పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో గాయనీ చిన్మయి ప్రముఖ గీతర చయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి మీటూతో బీటలు వేసిన విషయం తెలిసిందే.

ఆమెకు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. చిన్మయి ఆరోపణలు కొట్టిపారేసిన వైరముత్తు ఆమెపై కోర్టుకెళ్లతానని బెదిరించినా, అలాంటి ప్రయత్నానికి సాహసించలేదు. ఇక మరో మలయాళీ నటి శ్రుతీహరిహరన్‌ సీనియర్‌ నటుడు అర్జున్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను గుప్పించింది. ఆమె ధైర్యాన్ని పలువురు శభాష్‌ అంటూ అభినందించారు.

నటుడు ప్రకాశ్‌రాజ్‌ అయితే నటుడు అర్జున్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు కూడా. ఇక నటుడు అర్జున్‌ కూడా నటి శ్రుతీహరిహరన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అన్నట్టుగానే బెంగళూర్‌ సిటీ సివిల్‌ కోర్టులో శ్రుతిహరిహరన్‌పై రూ.5 కోట్లు నష్టపరిహారం కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక నటి శ్రుతీహరిహరన్‌ కూడా అర్జున్‌ను ఢీకొనడానికి సిద్ధమైంది.

బెంగళూర్‌లోని కబ్బన్‌పార్క్‌ పోలీసులకు అర్జున్‌పై ఫిర్యాదు చేసింది. అందులో నటుడు అర్జున్‌ 2015లో ఒక చిత్రంలో నటిస్తుండగా లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొంది. శ్రుతీహరిహరన్‌ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు నటుడు అర్జున్‌ను అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement