
చాలామంది ఒంటిపై పచ్చబొట్టు చూస్తూనే ఉంటాం. దీన్ని ఇప్పటి జనరేషన్ స్టైల్‌గా టాటూ అంటున్నారు. అయితే ఒక్కో టాటూ వెనుక ఒక్కో స్టోరీ ఉంటుంది. దాన్ని సదరు వ్యక్తులు బయటపెడితే గానీ తెలియదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇందులో మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు కూడా ఓ యంగ్ హీరోయిన్.. అలా తన ఎదపై ఉన్న పచ్చబొట్టు మీనింగ్, అసలు ఇది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?)
శ్రద్ధా శ్రీనాథ్.. స్వతహాగా కన్నడ బ్యూటీ. 2015లో ఓ మలయాళ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో తెలుగులో నాని 'జెర్సీ'లో హీరోయిన్‌గా చేసి మన ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ క్రేజ్ పెంచుకున్న ఈ భామ.. వెంకటేశ్ 'సైంధవ్'లో యాక్ట్ చేసింది. ఇది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.
తాజాగా 'సైంధవ్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న శ్రద్ధా శ్రీనాథ్.. మిగతా విషయాలతో పాటు తన ఎదపై ఉన్న టాటూ సీక్రెట్ కూడా చెప్పింది. 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి అంటే తనకు క్రష్ ఉండేదని, అతడి ద్వారా తనకు బీటల్స్ బ్యాండ్ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. లవ్ అని అర్థమొచ్చేలా ఉన్న ఈ టాటూని అప్పట్లోనే క్రష్ కోసం వేసుకున్నానని అసలు సంగతి చెప్పింది. అయితే ఆ అబ్బాయి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. సో శ్రద్ధా శ్రీనాథ్ టాటూ సీక్రెట్ అదనమాట.
(ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment