శ్రద్ధా శ్రీనాథ్
యాక్టింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లకే బాలీవుడ్ గడప తొక్కారు కన్నడ కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్. కన్నడ ‘యూ టర్న్’ సినిమాతో ఫేమ్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోనూ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌కి వెళుతున్నారు. ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ ఫ్రాంచైజ్ దర్శకుడు తిగ్మాంషు థులీయా దర్శకత్వంలో రూపొందనున్న ఓ సినిమాలో కథానాయికగా ఎంపికయ్యారు శ్రద్ధా.
ఈ సినిమాలో అలీ ఫైజల్ హీరోగా నటించనున్నారు. ‘‘బాలీవుడ్ సినిమా చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. తిగ్మాంషుగారు ‘పాన్‌సింగ్ తోమర్’, ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ వంటి గుడ్ ఫిల్మ్స్‌ను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో నటించనుండటం ఆనందంగా ఉంది. ఫన్ లవ్‌స్టోరీగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఆలీ ఫైజల్ నా కో–స్టార్’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో లక్నోలో స్టార్ట్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment