
‘జెర్సీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసి నాని ప్రమోషన్‌కు రెడీ అయ్యారు. అందులో భాగంగా సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను వేలంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రూపొందించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘జెర్సీ’.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మించింది. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారు. ‘‘అదేంటోగానీ ఉన్న పాటుగా’ అంటూ సాగే సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నాం. 14 నుంచి పాటలోని మ్యాజిక్‌ని ఫీల్ అవ్వండి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment