జాతీయ అవార్డు విజేతతో రానా | Rana Daggubati Movie with rana | Sakshi
Sakshi News home page

జాతీయ అవార్డు విజేతతో రానా

Published Fri, Dec 29 2017 1:58 PM | Last Updated on Fri, Dec 29 2017 2:00 PM

Rana Daggubati Movie with rana - Sakshi

బాహుబలి విజయం తరువాత భల్లాలదేవ రానా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో ఇతర భాషా దర్శకులు కూడా రానాతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సోలో హీరోగా ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాల విజయం కూడా రానాకు కలిసొచ్చింది.

ప్రస్తుతం 1945 అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్న రానా, త్వరలో తమిళ దర్శకుడు ప్రభు సాల్మోన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. హతీ మేరీ సాథీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పీరియాడిక్ జానర్ లోనే తెరకెక్కనుంది. ఈ రెండు సినిమా ల తరువాత ఓ జాతీయ అవార్డ్ విజేత దర్శకత్వంలో నటించనున్నాడు రానా.

దక్షిణాదిలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాలా దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయబోతున్నాడట. తన ప్రతీ సినిమాను రియలిస్టిక్ గా రూపొందించే బాల ప్రస్తుతం విక్రమ్ తనయుడు ధృవ్ ను హీరోగా పరిచయం చేస్తూ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత 2018 ద్వితీయార్థంలో రానా హీరోగా సినిమాను ప్రారంభించనున్నాడట. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement