
శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి మొల్లేటి ప్రధాన తారాగణంగా నటించిన బహుభాషా చిత్రం ‘విట్ నెస్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ వెంకటేశ్ నిర్మించారు. ఈ సినిమాకు దీపక్ దర్శకత్వం వహించడంతో పాటు కెమెరామేన్ బాధ్యతలు నిర్వహించారు. మే డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘‘విట్ నెస్’ చిత్రంలో మంచి ఆశయం కోసం పోరాడే ఆర్కిటెక్ట్ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ కనిపిస్తారు. పారిశుద్ధ్య కార్మికుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: రమేష్ తమిళమణి.
With the world of conservancy workers at its center, the movie WITNESS presents a never-seen-before view of metropolitan cities and the invisible corridors of power lying underneath them.#WITNESS First Look pic.twitter.com/JxyBweGxam
— Shraddha Srinath (@ShraddhaSrinath) May 1, 2022
Comments
Please login to add a commentAdd a comment