తమిళసినిమా: దర్శకుడు బాలా మరోసారి కుట్రపరంపరై చిత్ర చర్చకు తెరలేపారు. ఈ సంచలన దర్శకుడి నుంచి సాదా సీదా చిత్రాలను ఎవరూ ఆశించరు. సేతు, పితామగన్, నందా,అవన్ ఇవన్, నాన్‌కడవుల్, పరదేశి ఇలా దేనికదే అసాధారణ కథాంశంతో రూపొందిన చిత్రమే. తాజాగా జ్యోతిక ప్రధాన పాత్రలో నాచ్చియార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణం దశలోనే వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. చిత్ర టీచర్‌లో పోలీస్‌అధికారిగా నటిస్తున్న జ్యోతిక మహిళలను కించపరచే విధంగా మాట్లాడిన సన్నివేశాలపై పలు సంఘాల వారు తీవ్రంగా ఆరోపించడం, ఆ వ్యవహారం కేసు, కోర్టు వరకూ వెళ్లడం తెలిసిన విషయమే. బాలా నాచ్చియార్ చిత్రం తరువాత తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఇందులో నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ కథానాయకుడిగా తెరంగేట్రం చేయనున్నారు. ఇదిలా ఉంటే చాలా కాలం క్రితం బాలా కట్రపరంపరై అనే యథార్థ సంఘటనల ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.
వేల్ రామమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందులో అరవిందస్వామి, విశాల్, ఆర్య,అధర్వ, రానా, అనుష్క నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ నవలను చిత్రపరంపరై పేరుతో చిత్రంగా రూపొందించడానికి తాను చాలా కాలంగా సన్నాహాలు చేస్తున్నానని సీనియర్ దర్శకుడు భారతీరాజా ప్రకటించడం, ఈ చిత్ర వ్యవహారంలో బాలాకు భారతీరాజా మధ్య చిన్న పాటి యుద్ధమే జరిగింది. భారతీరాజా కుట్రపరంపరై చిత్ర కథతో షూటింగ్‌ను కూడా ప్రారంభించారు.ఆ తరువాత అది ఆరంభ శూరత్వంగానే ఆగిపోయింది. దర్శకుడు బాలా కూడా అప్పుడు డ్రాప్ అయ్యారు. తాజాగా కుట్రపరంపరై చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వెల్లడించి మరోసారి సంచలనానికి తెరలేపారు. ఈసారి ఇందులో శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ చిత్ర పూర్తి వివరాలు వెలువడే వరకూ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment