ఆయనతో చేస్తా! | GauthamKarthik, Shraddha Srinath's film, Ivan Thindran Audio was recently released. | Sakshi
Sakshi News home page

ఆయనతో చేస్తా!

Published Wed, Jun 28 2017 3:20 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

ఆయనతో చేస్తా!

ఆయనతో చేస్తా!

ఆయనతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తానంటోంది నటి శ్రద్ధా శ్రీకాంత్‌. శాండిల్‌వుడ్‌లో యూటర్న్‌ చిత్రం ద్వారా చాలా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రంలో అతిథిరావుకు స్నేహితురాలుగా కొన్ని సీన్స్‌లో మెరిసింది.

తమిళసినిమా: ఆయనతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తానంటోంది నటి శ్రద్ధా శ్రీకాంత్‌. శాండిల్‌వుడ్‌లో యూటర్న్‌ చిత్రం ద్వారా చాలా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రంలో అతిథిరావుకు స్నేహితురాలుగా కొన్ని సీన్స్‌లో మెరిసింది. తాజాగా రెండు తమిళ చిత్రాల్లో కథానాయకిగా నటించే అవకాశాలను కొట్టేసింది. వాటిలో ఒకటి ఇవన్‌ తందిరన్‌. గౌతమ్‌కార్తీక్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం æఆడియో ఇటీవలే విడుదలైంది.


చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్‌ను పలకరించగా చాలా కబుర్లే చెప్పుకొచ్చింది. ఇవన్‌ తందిరన్‌ కోలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకు తొలి చిత్రం అని పేర్కొంది. తనని చూసిన వారందరూ యూ టర్న్‌ చిత్రం నాయకిరా అంటున్నారని, ఇకపై అలాంటి ముద్ర పడకుండా కోలీవుడ్‌లో తనకుంటూ ఒక స్థానాన్ని అందిపుచ్చుకుంటానని చాలా నమ్మకంగా అంది. ఇవన్‌ తందిరన్‌ చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా పెద్ద పెద్ద డైలాగ్స్‌ను ఎలాంటి తడబాటు లేకుండా చెప్పేశానని చెప్పింది. కఠినంగా శ్రమించి ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక మిడిల్‌ క్లాస్‌ యువతిగా నటించానని తెలిపింది.

అయితే ఇక్కడ విద్యావ్యవస్థలు, రాజకీయాల కారణంగా ఎలా బాధింపునకు గురైయానన్న ఇతివృత్తంతో కూడిన చిత్రం ఇవన్‌ తందిరన్‌ అని చెప్పింది. ఈ చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్‌ చాలా మంచి కోస్టార్‌ అని కితాబిచ్చింది. తను చాలా నెమ్మదస్తుడని,మంచి వ్యక్తిత్వం కలిగిన వాడని చెప్పింది. సాధారణంగా ఎవరితోనూ సన్నిహితంగా ఉండడని, సన్నిహితంగా ఉంటే మాత్రం నిజమైన స్నేíßహితుడిగా మారిపోతాడని అంది.అంతే కాదు చాలా కేరింగ్‌ తీసుకుంటాడని చెప్పింది. చాలెంజింగ్‌ సన్నివేశాల్లో నటించిన తనను గౌతమ్‌కార్తీక్‌ అభినందిస్తూ ప్రోత్సహించాడని చెప్పింది. ఈ చిత్రంతో పాటు శ్రద్ధా శ్రీనా«థ్‌ విక్రమ్‌ వేదా అనే మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది.వీటితో పాటు మాలీవుడ్, శాండిల్‌వుడ్‌ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement