యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. ఇంజనీరింగ్ కళాశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకుడు.
తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ఈ కథ మొత్తం కాలేజ్ చుట్టూనే తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, ప్రేమలు, కొట్లాటలు అన్నింటినీ ఇందులో చూపించారు. సుమారు నిమిషమున్నర ఉన్న ఈ మూవీ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో నిండిపోయింది. ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment