మాములుగా హీరోహీరోయిన్లకు ఫ్లాప్ వస్తే ఆఫర్స్ తగ్గిపోతాయి. స్టార్ హీరోలకు ఇందులో మినహాయింపు ఉంటుంది. వాళ్లకు ఫ్లాప్ వచ్చినా కొత్త సినిమాలకు కొదవ ఉండదు. కానీ హీరోయిన్ల పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. ఫ్లాప్ వస్తే పక్కన పెట్టేస్తుంటారు. కానీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )కి వరుస ఫ్లాపులు వచ్చినా..ఆఫర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. హిట్ 2తో హిట్ కొట్టింది.
ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ ఏడాది ఏకంగా ఆరు చిత్రాల్లో నటించింది. అయితే వాటిల్లో లక్కీ భాస్కర్ మినహా మిగతా చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటీవల వచ్చిన మట్కా, మెకానిక్ రాకీ చిత్రాలు భారీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో మీనాక్షి పని అయిపోయిందని అనుకున్నారు అంతా. ఇక ఆమె తెలుగు తెరకు దూరమైపోతుందని ఫ్యాన్స్ నిరాశ చెందారు.
కానీ టాలీవుడ్ మాత్రం ఇప్పటికీ మీనాక్షిని ‘లక్కీ’గానే చూస్తోంది. ఫ్లాపులను పట్టించుకోకుండా ఆమెకు అవకాశాలు అందిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో మీనాక్షి హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తొలుత శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే కారణం ఏంటో తెలియదు కానీ శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకున్నారు.
ఇక ఇప్పటికే ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. సంకాంత్రి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అనగనగా ఒక రాజుతో పాటు మరో రెండు సినిమాల్లో మీనాక్షి హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా మీనాక్షి మూడు, నాలుగు చిత్రాలతో అలరించబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment