NBK109: పదునైన గొడ్డలికి కళ్ల జోడు.. పోస్టర్‌ అదిరింది | NBK109: Nandamuri Balakrishna, Bobby Kolli Movie Shooting Starts | Sakshi
Sakshi News home page

NBK109: పదునైన గొడ్డలికి కళ్ల జోడు.. పోస్టర్‌ అదిరింది

Published Wed, Nov 8 2023 12:05 PM | Last Updated on Wed, Nov 8 2023 12:28 PM

NBK109:Nandamuri Balakrishna, Bobby Kolli Movie Shooting Starts - Sakshi

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. భగవంత్‌ కేసరితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. తాజాగా తన కొత్త సినిమా షూటింగ్‌ని ప్రారంభించాడు. వాల్తేరు వీరయ్యతో భారీ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న డైరెక్టర్‌ బాబీ.. బాలయ్య 109వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ యాక్షన్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమైంది. నేడు (నవంబర్‌ 8) 'NBK109'వ చిత్రం ప్రారంభం అయిందని తెలియజేస్తూ.. ఓ పోస్టర్‌ని వదిలారు మేకర్స్‌.

 ఆ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై  నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు. 

ఇప్పటికే బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా విడుదలైన సృజనాత్మక పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. బాలయ్యను ఒకవైపు ఊరమాస్‌ లుక్‌లో చూపిస్తూనే.. స్టైలీష్‌గా కూడా ప్రజెంట్‌ చేయబోతున్నట్లు పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement