Naveen Polishetty Hilarious Video About His Movie Updates - Sakshi
Sakshi News home page

Naveen Polishetty: ఉన్నావా? చచ్చావా? ..నవ్వులు పూయిస్తోన్న ‘జాతిరత్నం’వీడియో

Published Sun, Jan 1 2023 11:15 AM | Last Updated on Sun, Jan 1 2023 11:28 AM

Naveen Polishetty Hilarious Video On Movie Updates - Sakshi

‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు యంగ్‌ హీరో నవీన్‌పొలిశెట్టి. 2021 మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. . ఈ మూవీ విడుదలై ఏడాదిన్నరకు పైనే అవుతున్నా హీరో  నవీన్ పొలిశెట్టి నుంచి ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ రావడం లేదు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో `అనగనగ ఒక రాజు` మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాలకు సంబంధించి ఇటీవల ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు. తాజాగా నవీన్‌ పొలిశెట్టి ఓ ఫన్నీ వీడియో ద్వారా తన సినిమాల అప్‌డేట్స్‌ని ఇచ్చాడు. 

నవీన్‌ పొలిశెట్టి స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతూ `అరేయ్ ఏం చెప్పమంటావురా `జాతిరత్నాలు` తరువాత ఫ్యాన్స్ లవ్వు అరే ఇంటి నుంచి బయట అడుగు పెట్టడానికి లేదు పరిస్థితి.. అనగానే ఫ్యాన్స్ అంటూ ఇద్దరు నవీన్ పొలిశెట్టి వద్దకు వచ్చారు. అందులో ఒకతను నవీన్ అన్నా ఉన్నావా? చచ్చావా? అనడంతో కంగుతిన్న నవీన్ `ఉన్నారా.. షూటింగ్ చేస్తున్నా.. అనడం.. అయితే నెక్స్ట్ మూవీ అప్ డేట్ ఏదీ అని మరో అభిమాని ప్రశ్నించడం..దానికి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్న కదా షూటింగ్ జరుగుతోంది.

చాలా బాగా వస్తున్నయ్ అని నవీన్ అనడం...ఆ వెంటనే అది అందరికి తెలిసిందే కదా.. అప్ డేట్ లు లేవు పదా అని ఫ్యాన్స్ వెళుతుండటం.. మరో అభిమాని కొడుకుతో కలిసి తనెవరో తెలుసా.. జాతిరత్నాలు టైమ్ లో ఎత్తుకుని సెల్ఫీ ఇచ్చారు. అప్పుడు వీడు థర్డ్ స్టాండర్డ్.. త్వరగా అప్ డేట్ ఇవ్వండి లేదంటూ వీడి కొడుకు థర్డ్ స్టాండర్డ్ కి వచ్చేలా ఉన్నాడని పంచ్ వేయడం నవ్వులు పూయిస్తోంది. వీడియో చివరల్లో న్యూ ఇయర్ లో న్యూ మూవీస్ అప్ డేట్ లని నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో అందించబోతున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 2022లో తనకున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకున్న నవీన్ పోలిశెట్టి ఈ కొత్త ఏడాదిలో వరుస రిలీజ్ లతో తెరపై సందడి చేయబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement