పదిహేనేళ్ల తర్వాత ‘హీరో’ కోసం థియేటర్‌కు వెళ్లాను : జగపతిబాబు | Jagapathi Babu Talk About Hero Movie | Sakshi
Sakshi News home page

పదిహేనేళ్ల తర్వాత ‘హీరో’ కోసం థియేటర్‌కు వెళ్లాను : జగపతిబాబు

Published Tue, Jan 18 2022 7:59 AM | Last Updated on Tue, Jan 18 2022 9:00 AM

Jagapathi Babu Talk About Hero Movie - Sakshi

‘‘పదిహేనేళ్లుగా థియేటర్స్‌కు వెళ్లని నేను ‘హీరో’ సినిమా కోసం వెళ్లాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూస్తూ ఎంజాయ్‌ చేశాను. పెద్ద సినిమాల్లో నటించిన నాకు కొత్త దర్శకులతో చేయాలనిపించలేదు. అందుకే ‘హీరో’ చేసేటప్పుడు నా పాత్ర పండుతుందా? లేదా అనిపించింది. కానీ నా అంచనాలు తారుమారయ్యేలా చేశారు దర్శకుడు శ్రీరామ్‌. ఈ సినిమా చూశాక గతంలో నేను చేసిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం గుర్తొచ్చింది. అశోక్‌లో మంచి తపన కనిపించింది’’ అన్నారు జగపతిబాబు.

అశోక్‌ గల్లా, నిధీ అగర్వాల్‌ జంటగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజైంది. ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో అశోక్‌ మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల మధ్యలో సినిమా చూశాను. వారి పాజిటివ్‌ రెస్పాన్స్‌ తెలిసింది’’ అన్నారు. ‘‘అశోక్‌ పడిన కష్టం తెరపై తెలుస్తోంది. థియేటర్స్‌లో నిజమైన పండగ కనిపిస్తోంది’’ అన్నారు శ్రీరామ్‌. 
∙శ్రీరామ్‌ ఆదిత్య, నిధీ అగర్వాల్, గల్లా జయదేవ్, పద్మావతి, అశోక్, జగపతిబాబు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement