![Adi Seshagiri Rao Comments On Hero Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/7/ashok.jpg.webp?itok=Rh9qtPns)
‘‘సినిమాలో కంటెంట్ ఉంటే సంక్రాంతికి రెండు మూడు విడుదలయినా కూడా నిలబడతాయి. మంచి కథ ఉన్నందుకే ‘హీరో’ను సంక్రాంతికి తీసుకొస్తున్నాం’’ అని నిర్మాత జి. ఆదిశేషగిరి రావు అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘సూపర్ స్టార్ కృష్ణగారి ‘పచ్చని సంసారం’ చిత్రంలో అశోక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అప్పటి నుంచే నటనపై ఆసక్తి పుట్టినట్టుంది. స్టార్స్‌కు, మాస్ హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనకు ఉన్నాయి’’ అన్నారు.
‘‘హీరో’ని జనవరి 15న విడుదల చేయమని కృష్ణగారు చెప్పారు’’ అన్నారు ఎంపీ గల్లా జయదేవ్. ‘‘హీరో’ సినిమాలో అశోక్‌ను చూస్తుంటే నాన్నగారే (కృష్ణ) ఎక్కువగా గుర్తొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్‌లో మహేశ్‌బాబు కనిపించాడు’’ అన్నారు పద్మావతి గల్లా. ‘‘మా సినిమాను ఈ నెల 26న విడుదల చేద్దామనుకున్నాం కానీ కొన్ని సినిమాలు వాయిదా పడటంతో సంక్రాంతికి వస్తున్నాం’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ‘‘నా కల నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో కృష్ణగారు, మహేశ్‌బాబుగారు ఎలాంటి ప్రత్యేక పాత్రలో కనిపించరు’’ అన్నారు అశోక్ గల్లా.
Comments
Please login to add a commentAdd a comment