మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలనే వేగవంతం చేసిన చిత్ర బృందంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా దర్శక ధీరుడు రాజమౌళి హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ చేశాడు. కాగా నేడు జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు మరణించడంతో ఈవెంట్‌ను క్యాన్సల్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాజమౌళి చేతుల మీదుగా సోమవారం ట్రైలర్‌ను విడుదల చేయించింది మూవీ యూనిట్.
చదవండి: Khushbu Sundar: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి
ఇక ట్రైలర్ విషయానికోస్తే లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ అంశాలను ప్రధానంగా తీసుకుని మేకరస్ ట్రైలర్‌పై దృష్టి పెట్టారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్ సాంతం ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కోసం భారీగానే ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అశోక్ గల్లా జోడీగా నిధి అగర్వాల్ నటించింది. లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో విలక్షణ నటుడు జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక అజయ్, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీతో పాటు పలువురు నటీనటులు ఈ చిత్రంలో అలరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment