సర్వోదయ నేత మురారీ లాల్‌ కన్నుమూత | Sarvodaya leader Murari Lal passes away | Sakshi
Sakshi News home page

సర్వోదయ నేత మురారీ లాల్‌ కన్నుమూత

Published Sun, Apr 14 2024 5:44 AM | Last Updated on Sun, Apr 14 2024 5:44 AM

Sarvodaya leader Murari Lal passes away - Sakshi

గోపేశ్వర్‌: సామాజిక కార్యకర్త, సర్వోదయ, చిప్కో ఉద్య మాల నేత మురారీ లాల్‌(91) కన్నుమూశారు. శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతో మూడు రోజుల క్రితం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మురారీ లాల్‌ తుదిశ్వాస విడిచారు. చమోలి జిల్లా గోపేశ్వర్‌కు సమీపంలోని పాప్డియానా గ్రామంలో 1933లో మురారీ లాల్‌ జన్మించారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు మురారీ లాల్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

మురారీ లాల్‌ తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. చమోలీ జిల్లా మద్య నిషేధం కోసం ఉద్యమించారు. 1975–76 కాలంలో భూమి లేని పేదలకు లీజుపై భూమి దక్కేలా చేశారు. శ్రమదానంతో స్వగ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement