బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌: ఇద్దరికి గాయాలు | two injured, Tractor hits bike | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌: ఇద్దరికి గాయాలు

Jun 12 2016 8:10 PM | Updated on Sep 3 2019 9:06 PM

కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కన్నాల పాత పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

బసంత్‌నగర్: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కన్నాల పాత పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెద్దపల్లి మండలానికి చెందిన యాట పోచమల్లు (35), ఆయన భార్య మల్లేశ్వరి(30)తో కలసి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ జిల్లా శ్రీరామ్‌పూర్ వెళుతున్నారు.

కన్నాల పాత పెట్రోల్ బంక్ సమీపంలో వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో పోచమల్లు, మల్లేశ్వరి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. టోల్‌గేట్‌కు చెందిన వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement