నగరంలోని అల్వాల్ లో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారులో వెళ్తున్న యువకులు ఎదురుగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని, మద్యం మత్తులో కారును నడపటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.