మరోసారి ఆటో షో | Auto Show In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మరోసారి ఆటో షో

Published Sun, Mar 11 2018 12:26 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

Auto Show In Visakhapatnam - Sakshi

అమ్మకానికి సిద్ధంగా ద్విచక్రవాహనాలు

పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ఒకప్పుడు ద్విచక్రవాహనం కొనాలంటే సొమ్ము మొత్తం చేతిలో ఉంటేనే సాధ్యపడేది. ఇప్పుడు ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీల కారణంగా సులభ వాయిదాల రూపంలో కొత్త వాహనాలతో పాటుగా పాత వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఉగాదిని పురస్కరించుకుని సాక్షి దినపత్రిక–పద్మపూజిత ఆటోఫైనాన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో మరోసారి న్యూ, యూజ్డ్‌ వెహికల్స్‌ ఆటో షో జరగనుంది. పద్మపూజిత అనుబంధ సంస్థలు విశాఖ ఆటోఫైనాన్స్, సిరి ఆటోఫైనాన్స్, పవన్‌సాయి ఆటోఫైనాన్స్‌ సంస్థలు కూడా ఈ ఆటోషోలో పాల్గొంటాయి.

హీరోహోండా, బజాజ్, యమహా, హీరో, రాయల్‌ఎన్‌ఫీల్డ్, టీవీఎస్, సుజికీ తదితర ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన కొత్త, పాత ద్విచక్రవాహనాలు ఇక్కడ విక్రయిస్తారు. ఈనెల 12, 13, 14, 15 తేదీలలో నగరంలోని పాతజైలు రోడ్డులోని విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా గల విశాఖ సెంట్రల్‌పార్కు ఆవరణలో రోజూ ఉదయం 9 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు ఆటోషో జరుగుతుందని ని ర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సాక్షి దినపత్రిక మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. వీటీం ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. ఇవే తేదీలలో గాజువాక లం కా గ్రౌండ్స్‌లో, కాకినాడ నగరంలో ఆటో షో జరుగుతుంది. ఆయా కంపెనీలకు చెందిన లేటెస్ట్‌ మోడల్స్‌ బైకులు, స్కూటర్లు ఇక్కడ అందుబా టులో ఉంచుతారు.

వినియోగదారులకు అవగాహన
ఈ ఆటోషోలో పద్మపూజిత, పవన్‌సాయి, వి శాఖ, సిరి ఆటోఫైనాన్స్‌ ప్రతినిధులు వినియోగదారులకు వాహనాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. వారి వారి అవసరాలకు ఏ యే వాహనాలు వినియోగించాలో సూచి స్తారు. ఇక్కడ 100 సీసీ, 120సీసీ, 150సీసీ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఏ కంపెనీలో ఏ బ్రాండ్‌ వాహనం ఇంధనం ఆదా చేస్తుంది, మంచి రీసేల్‌ వేల్యూ ఇస్తుందన్న  స మాచారాన్ని ఇక్కడి ప్రతినిధులు వివరిస్తారు.

30 నిమిషాలలో ఆటో ఫైనాన్స్‌
ఇక్కడ కేవలం 30 నిమిషాలలో వాహనాలకు 70శాతం మేరకు ఫైనాన్స్‌ చేస్తారు. వినియోగదారులు 30 నుంచి 35శాతం మేరకు డౌన్‌ పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18 లేదా 24 లేదా 36 సులభ వాయిదాలలో చెల్లించాలి. బ్యాంకులు విధిస్తున్న సవాలక్ష నిబంధనల నేపథ్యంలో సులభంగా లభించే ఆటోఫైనాన్స్‌కు ఎంతగానో ఆదరణ లభిస్తుంది. సాధారణ వడ్డీలో 3శాతం తక్కువ వడ్డీకే వాహనాలు అందజేయడం ఈ ఆటోషో ప్రత్యేకత. వినియోగదారుడు, ఒక ష్యూరిటీ పై వాహనాలు తీసుకోవచ్చు. సదరు వ్యక్తులు ఆధార్‌ కార్డు జెరాక్స్‌ కాపీ అందజేస్తే సరిపోతుంది. ఇక్కడ రూ.50వేల నుంచి రూ.3లక్షల విలువైన వాహనాలకు ఫైనాన్స్‌ చేస్తారు. కొత్త వాహనాలకు 18శాతం, పాత వాహనాలకు 21శాతం వంతున వడ్డీ ఉంటుంది.

వినియోగదారుల నమ్మకమే నడిపిస్తోంది
వినియోగదారుల నమ్మకంతోనే గత 15 సంవత్సరాలుగా ఆటోఫైనాన్స్‌ రంగంలో ముందుకు సాగుతున్నాం. వారి నమ్మకమే మమ్మల్ని నడిపిస్తోంది. తమ సంస్థ 15 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరిలో మొదలయింది. కాలక్రమంలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు విస్తరించాం. ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాలలోనే ఏడు నుంచి 8 లక్షల వాహనాలు విక్రయించాం. తక్కువ వడ్డీకే అన్నిరకాల కంపెనీల ద్విచక్రవాహనాలకు ఫైనాన్స్‌ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలలో 135 బ్రాంచ్‌ల ద్వారా సేవలందిస్తున్నాం. వినియోగదారులకు గత 15 ఏళ్లుగా నమ్మకమైన సేవలందిస్తున్నాం. మూడు నుంచి నాలుగేళ్లలో రీసేల్‌వేల్యూ గల వాహనాలు విక్రయిస్తున్నాం.–ఆర్‌ఎస్‌వీపీ బసవరాజు, మేనేజింగ్‌డైరెక్టర్, పద్మ పూజిత ఆటో ఫైనాన్స్, దొండపర్తి, విశాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement