
నోడౌట్ ఘోరంగా ఢీ కొంటాయి. ఎవరూ బతకరు అనుకునేలోపే...
ఇంతవరకు ఎన్నో ఘోర ప్రమాదాలు చూసి ఉంటాం. చచ్చిపోతారు నోడౌట్ అనేంత దారుణమైన ప్రమాదాల బారినపడినవారు సైతం బతికిన ఉదంతాలు చూశాం. ఇవన్నీ ఒకత్తైతే ఇక్కడ జరిగిన ప్రమాదం చూస్తో వామ్మో అని బిగిసుకుపోతాం. ఎందుకంటే కచ్చితంగా బయటపడే ఛాన్స్‌లేదు అనేంత దారుణమైన ప్రమాదం.
వివరాల్లోకెళ్తే...ఒక టూవీలర్ వాహనదారుడు రాత్రిపూటా రద్దీ లేకపోవడంతో రోడ్డును క్రాస్ చేస్తున్నాడు. ఇంతలో సడెన్‌గా ట్రక్కు వచ్చింది. ఐతే రెండు కూడా చాలా వేగంగానే వస్తున్నాయి. ఇద్దరూ ఓ రేంజ్ స్పీడ్‌లో వచ్చారు. కచ్చితం దారుణం ఢీ కొట్టారు. ఎవ్వరూ బతికే అవకాశం లేదనిపించేలా గగ్గుర్పాటుకు గురి చేసే ఘటన. అలాంటిది ఊహించని విధంగా ప్రమాదం జరగదు. చివర్లో భలే గమత్తుగా బైకర్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు.
అసలు అదేలా సాధ్యం అనిపిస్తుంది. మిరాకిల్ ఘటన అంటే ఇదేనేమో అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. బహుశా వారిద్దరికీ భూమ్మీద నూకలు ఉండబట్టి..ప్రమాదం నుంచి సునాయాసంగా బయటపడ్డారు అని అనాలో అర్థంకాదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఊపిరాగిపోతుందేమో అన్నంత రేంజ్‌లో ఉంటుంది ఆ ఘటన.
ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय,
— Dipanshu Kabra (@ipskabra) January 5, 2023
औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD
(చదవండి: నువ్వు తోపు సామీ.. పాలు అమ్మేందుకు హార్లే డేవిడ్‌సన్ బైక్‌తో.. )