
ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడవ సీజన్ విజేతలను ఈ రోజు సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ 'జితేంద్ర సింగ్' సమక్షంలో ప్రకటిస్తారు. ఇందులో అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు సిద్దమవుతాయి. ఈ రోజు ఏ విభాగంలో ఏ వాహనం విజేతగా నిలుస్తుందో అధికారికంగా తెలుస్తుంది.
ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్, డిజైన్ ఆఫ్ ది ఇయర్, ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్, లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్.. ఇలా అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు వస్తాయి. ఇప్పటికే కొన్ని వాహనాలు నామినేషన్‌కు సిద్ధమయ్యాయి. తుది ఫలితాలు, విజేతలు త్వరలో తెలుస్తాయి.
ఇదీ చదవండి: విలీనానికి మరో రెండు బ్యాంకులు - డేట్ ఫిక్స్
ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్ (Electric Two-Wheeler of the Year) అవార్డు నామినేషన్ జాబితాలో 'అల్ట్రా వయొలెట్ ఎఫ్ 77, ఏథర్ 450 ఎక్స్ జెన్3 (మూడవ తరం ఏథర్ 450 ఎక్స్), హీరో విడా వి1, టార్క్ క్రటోస్ ఆర్' ఉన్నాయి. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది ఈ రోజే తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment