![Hero Xpulse 200t 4v Launched, Price Features Specifications Check Here - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/22/byke.jpg.webp?itok=6Gvgwnv2)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా అదిరిపోయే లుక్‌తో ఓ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. తన ఎక్స్‌పల్స్ 200టీ మోడల్‌లో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ధర ముంబై ఎక్స్‌షోరూంలో రూ.1.25 లక్షలు. కొత్తగా మార్కెటలోకి తీసుకువచ్చిన ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లో బీఎస్ 6 200 సీసీ 4 వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు.
ఈ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పవర్ 19 హెచ్‌పీ, 17.3 ఎన్ఎం టార్క్‌తో రాబోతోంది. గోల్డ్, రెడ్, ఎల్లో మేట్ ఫంక్ వంటి కలర్స్ యాడ్ చేశారు. ఈ బైక్‌లో 37 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్స్, వెనక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ అమర్చారు.
ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకున్న వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి రూ. 2,500తో ఈ బైక్‌ను ప్రి బుకింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్‌తో ఫుల్ డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్, యూఎస్‌బీ చార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్లను జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment