
ప్రమాద స్థలంలో ప్రేమ్‌కుమార్ మృతదేహం
కూసుమంచి : మండలంలోని జక్కేపల్లి, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం చనుపల్లి గ్రామాల మధ్యనున్న పాలేరు వంతెనపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో జక్కేపల్లి గ్రామస్తుడు కొదమగుండ్ల ప్రేమ్ కుమార్(30) మృతిచెందాడు. చనుపల్లికి చెందిన ట్రాక్టర్, చెరకు లోడుతో రాజేశ్వరపురంలోని ఫ్యాక్టరీకి వస్తోంది. ప్రేమ్‌కుమార్, తన కుమారుడు అభిరామ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై చనుపల్లి సమీపంలోగల శివాలయానికి ఉదయం ఆరు గంటల సమయంలో వెళుతున్నాడు. వంతెన పైకి రాగానే, ఎదురుగా వస్తున్న చెరకు ట్రాక్టర్ తగిలింది. ఇద్దరూ కింద పడ్డారు. తలకు తీవ్ర గాయాలతో ప్రేమ్‌కుఆర్ అక్కడిక్కడే మృతిచెందాడు. అతని కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వారి కుటుంబీకులు, బందువులు వచ్చారు, భోరున విలపించారు.
తమ కుటుంబాన్ని ట్రాక్టర్ యజమాని ఆదుకోవాలన్న డిమాండుతో మృతదేహంతో వంతెన పైనే ఆందోళనకు దిగారు. కూసుమంచి ఏఎస్‌ఐ రవూఫ్ వచ్చారు. ఆ ఆందోళనకారులతో మాట్లాడారు. తమకు యజమాని న్యాయం చేసేంతవరకు మృతదేహాన్ని తొలగించేది లేదంటూ అక్కడే టెంట్ వేసుకుని ఆందోళనను ఉధృతం చేశారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. శివరాత్రి విధుల్లో ఉన్న ఎస్‌ఐ రఘు, జక్కేపల్లి చేరుకున్నారు. మృతుని కుటుంబీకులతో, ట్రాక్టర్ యజమానితో చర్చించారు మృతుని కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు ట్రాక్టర్ యజమాని అంగీకరించటంతో పరిస్థితి సద్దుమణిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వంతెనపై ఆందోళన చేస్తున్న కుటుంబీకులు, బంధువులు
Comments
Please login to add a commentAdd a comment