
కొండచిలువను బంధిస్తున్న స్థానికులు
కర్ణాటక ,క్రిష్ణగిరి: సూళగిరి సమీపంలోని అటవీ ప్రాంత గ్రామంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్రవాహనంపైకి పాకుతున్న 10 అడుగుల కొండ చిలువను స్థానికులు బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సూళగిరి సమీపంలోని డ్యాం ఎబ్బళం గ్రామం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామంలోకి తరచూ సర్పాలు వస్తుంటాయి. సోమవారం ఉదయం రోడ్డుపక్కన నిలిపిన ఓ బైక్ మీదికి పెద్ద కొండచిలువ పాకుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు దానిని కట్టెతో అడ్డుకుని బంధించారు. అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. అటవీ ప్రాంతం నుండి విషపురుగులు గ్రామంలోకి చొరబడక అటవీశాఖాధికార్లు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment