హీరో బైక్స్ ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్‌ల ధరలను పెంచేసింది. సంస్థకు చెందిన వివిధ మోడళ్ల ద్విచక్ర వాహనాల ధరలను రూ .500 నుంచి రూ .2,200 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చలు పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో పేర్కొంది. పెంచిన ధరలు మే 1వ తేదీనుంచి అమలవుతాయని తెలిపింది.
ఎంట్రీ లెవల్ మోడల్స్ దగ్గర్నుంచి, హై ఎండ్ మోడల్ వాహనాలపై ఈ భారం పడనుంది. వివిధ బైకుల ధరలు రూ .500 నుంచి రూ .2,200 వరకు పెరగనున్నాయి ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడల్ హెచ్‌ఎఫ్ డాన్ నుంచి టాప్ ఎండ్ మోడల్ కరిష్మా జెడ్‌ఎంఆర్ మోడల్స్ పాపులర్. వీటి ధరలు రూ.40వేల నుంచి లక్షరూపాయలకు వున్నాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశంలో టూవీలర్స్ ధరలను పెంచేందుకు కంపెనీ నిర్ణయించింది. అలాగే మే నెలలో బలమైన రిటైల్ అమ్మకాలు కొనసాగించాలని కంపెనీ భావిస్తోందని తెలిపింది.
కాగా గతనెలలో అమ్మకాలు బాగా క్షీణించి 5,91306 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలు 6,12,739 యూనిట్లతో పోలిస్తే 3.49శాతం తక్కువ.