
ద్విచక్ర వాహనంతో కొండ దిగుతున్న ఏఎస్పీ దంపతులు
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలోని కొండపై ఉన్న చాపరాయి జంగిడిభద్ర గ్రామానికి పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గరుడ్ సతీసమేతంగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏఎస్పీ ద్విచక్రవాహనంతో వెళ్లారు. ఏజెన్సీలోని గిరిజనులకు ఓటు వినియోగం విషయంలో పలు సూచనలు చేసేందుకు మంగళవారం ఆయన పర్యటించారు. ఆయన వెంట ఎల్విన్‌పేట సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ వి.జ్ఞానప్రసాద్ ఉన్నారు.