asp
-
బిచ్చగాడు నుంచి ASPగా మారిన నిరుపేద..
-
వైద్యుడి నుంచి ఐపీఎస్‌గా..
భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తించి, ప్రస్తుతం జిల్లా ఎస్పీగా ఉన్న డాక్టర్ వినీత్ ఎంఎస్ ఆర్థోపెడిక్ వైద్యుడే. బెంగళూరులో మెడిసిన్ పూర్తి చేసుకుని, సంజయ్‌గాంధీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్‌కు ఆయన అర్హత సాధించారు. భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయాన దుమ్ముగుడెం పోలీసులు, పర్ణశాల పీహెచ్సీ ఆధ్వర్యాన ములకలపల్లిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీగా హాజరైన వినీత్.. వైద్యుడిగా మారిపోయి స్థానికులకు పరీక్షలు నిర్వహించడం విశేషం. ఇక్కడే కాదు ఏ శిబిరంలో సమయం లభించినా వైద్యుడిగా సేవలందించేందుకు వినీత్ ఇష్టపడతారు. -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. ఆదినారాయణపై కేసు నమోదు చేస్తాం: ఏఎస్పీ
సాక్షి, గుంటూరు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణపై కేసు నమోదు చేస్తామని ఏఎస్పీ అనిల్‌కుమార్ అన్నారు. ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. ‘‘బహుజన పరిరక్షణ కమిటీ సభ్యులు, సత్యకుమార్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు ఉండబట్టే సమస్య వెంటనే సద్దుమణిగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలకు సర్ది చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహించాం. సత్యకుమార్‌పై ఎలాంటి దాడి జరగలేదు’’ అని ఏఎస్పీ స్పష్టం చేశారు. కాగా, మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చదవండి: ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్ డైరీలో ఏముంది? -
తాగిన మత్తులో రెచ్చిపోయిన ఏఎస్పీ.. మహిళతో ఇలాగేనా ప్రవర్తించేది?
మద్యం మత్తులో ఓ జిల్లా పోలీసు ఉన్నతాధికారి రెచ్చిపోయాడు. బలవంతంగా యువతిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదేమిటని ప్రశ్నించిన మహిళలు, పాత్రికేయులపై దాడికి దిగాడు. అడ్డు చెప్పబోయిన సిబ్బందిపైనా లింగ వివక్షతో దూషణలకు దిగాడు. ఉదయమే అనారోగ్యంతో బాధ పడుతున్నానని మొసలి కన్నీరు కార్చుతూ ఆస్పత్రిలో చేరాడు. ఒడిషాలోని నవరంగపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల ప్రకారం.. బరగఢ్ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో కలిసి పపడాహండిలో రహస్యంగా జీవిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు.. అక్కడి ఏఎస్పీ జయకృష్ణ బెహరాను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆయన యువతి ఉన్న ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం కనుగొని, బలవంతంగా తన వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున ఆర్తనాదానాలు చేయడంతో సమీపంలో ఉన్న పాత్రకేయులు దృశ్యాలను రికార్డింగ్ చేయడం ప్రారంభించారు. గమనించిన ఏఎస్పీ.. ఆగ్రహంతో ఊగిపోయారు. లాఠీలతో పాత్రికేయులపై దాడి చేశారు. అడ్డుకొన్న సమీపంలోని మహిళలను కూడా చితకబాదారు. వారించిన సిబ్బందిని సైతం రాయలేని భాషలో దూషించారు. ఏఎస్పీ దగ్గర నుంచి మద్యం వాసన రావడంతో అడ్డుకోవడానికి వచ్చిన స్థానిక మహిళలు సైతం దూరంగా జరిగారు. అనంతరం బాధిత మహిళను రహస్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు. వెంటనే పాత్రికేయులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళనకు దిగారు. విషయం తెలుకున్న కలెక్టర్ భాస్కర్ రైతా ఘటనా స్థలానికి చేరుకుని, పాత్రికేయలతో చర్చలు జరిపారు. @GovernorOdisha @CMO_Odisha @DGPOdisha @odisha_police @MoSarkar5T @CIDOdisha @homeodisha @SecyChief @SpNabarangpur @DMnabarangpur @ministryofhome1 I strongly urge to throw out the Addl.SP Nabarangpur Cum Khaki Clad Goon Jaikrushna Behera immediatly for his heinous & hatred action pic.twitter.com/siDk3s7PXP — Bhajaman Biswal National Human Rights Defender (@Bhajaman_Biswal) September 15, 2022 దర్యాప్తుకు కొరాపుట్ ఎస్పీ ఆదేశాలు బాధిత యువతితో పాటు అడ్డుకోవాడనికి వెళ్లిన మహిళల శరీర భాగాలను తాకుతూ ఏఎస్పీ జయకృష్ణ బెహరా వీరంగం సృష్టించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నవరంగపూర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠీ గురువారం ఉదయం విలేకర్ల సమావేశం నిర్వహించారు. తక్షణమే ఏఎస్పీని విధుల నుంచి తొలగించి, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం పార్టీ జిలా అధ్యక్షురాలు షర్మిష్టా త్రిపాఠి మాట్లాడుతూ.. మహిళను అగౌరవంగా పరిచిన అధికారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. అనారోగ్యం కారణంతో ఏఎస్పీ జయకృష్ణ గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరడం గమనార్హం. బాధిత మహిళను పోలీసులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఎస్పీ సుశ్రీ సెలవులో ఉండటంతో కొరాపుట్ జిల్లా ఎస్పీ వరుణ్ గుంటువల్లి ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ప్రత్యేక అధికారిగా ఏఎస్పీ బ్రహ్మ దర్యప్తు ప్రారంభించారు. #ସାମ୍ବାଦିକଙ୍କୁ_ମାଡମାରିଲେ_ଅତିରିକ୍ତ_ଏସପି ନବରଙ୍ଗପୁର ଜିଲ୍ଲା ପାପଡାହାଣ୍ଡି ଥାନାରେ ଖବର ସଂଗ୍ରହ ପାଇଁ ଯାଇଥିବା ବେଳେ ସାମ୍ବାଦିକଙ୍କୁ ମାଡମରାଯାଇଛି । ଅତିରିକ୍ତ ଏସପି ସାମ୍ବାଦିକଙ୍କ ଉପରେ ଆକ୍ରମଣ କରିଥିଲେ । #Nabarangpur #Police #Attack #KanakNews pic.twitter.com/g769QBnkOJ — Kanak News (@kanak_news) September 15, 2022 -
Disha Bill: సత్వర పరిష్కార దిశ
ఆడపిల్ల పుడితే... అదృష్టం పుట్టిందని సంబరపడాలి. ఆడపిల్ల పెరుగుతుంటే... ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరియాలి. ఆడపిల్ల ఆ ఇంటికి సంతోషం... ఆ ఇంటి వేడుకల కల్పవల్లి. ఆ సంతోషం... ఆనందం... అదృశ్యమై ఆందోళన రాజ్యమేలుతుందా? ఆడపిల్ల అమ్మానాన్నల గుండె ఆందోళనతో కొట్టుకుంటే ఆ తప్పెవరిది? మొదట సమాజానిది... ఆ తర్వాత చట్టానిది... ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ ‘దిశ’ గా అప్రమత్తమైంది... నేరగాళ్ల మీద కొరడా ఝళిపిస్తోంది. అతడు 85 ఏళ్ల వృద్ధుడు, కోర్టు బోను ఎక్కడానికి కూడా దేహం సహకరించనట్లు ఆయాసపడుతున్నాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అతడి మీద నమోదైన కేసు గురించి తెలిసి పోలీసుల మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించారు. ఆ ఆధారాలను చూసిన న్యాయమూర్తి ఆగ్రహాన్ని అణచుకుంటూ తీర్పు రాశారు. ఆ తీర్పు పాఠం కోసం కోర్టు హాలు నిశ్శబ్దంగా చెవులు రిక్కించింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. సరైన తీర్పే వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారంతా. అపరాధి మాత్రం ‘మన న్యాయవ్యవస్థ ఇంత త్వరగా తీర్పులు చెప్పేస్తోందా, మన పోలీసులు ఇంత త్వరగా కేసులు దర్యాప్తు చేసేసి బలమైన ఆధారాలు సేకరించి శిక్ష పడేవరకు విశ్రమించడం లేదా! కేసు కోర్టుకు రావడానికి ఏ పుష్కరకాలమో పడుతుందనుకుంటే... వీళ్లకిదేం పోయేకాలం...’ అన్నట్లు అసహనంగా చూశాడు. బాధితురాలు మూడేళ్ల పాపాయి. తనకేం జరిగిందో తనకు తెలియదు. రోజూ తాను ఆడుకునే పక్కింటి తాతయ్య తన మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తెలియని పసితనం ఆ పాపాయిది. ఈ జ్ఞాపకాలేవీ తన బిడ్డకు గుర్తుండకూడదని కూతుర్ని తన వైపు తిప్పి గట్టిగా హత్తుకుంది. కోర్టు దృశ్యం పాపాయి మెదడులో నిక్షిప్తం కాకూడదని దేవుణ్ని ప్రార్థిస్తోంది పాపాయి తల్లి. సంఘటన జరిగిన ఆరు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేశారు ‘దిశ’ పోలీసులు. తొమ్మిది నెలల్లో నిందితుడికి శిక్ష పడింది. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు దిశ పోలీసులు చేస్తున్న యజ్ఞమిది. ∙∙∙ అది నేపాల్ నుంచి వచ్చి మన దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న కుటుంబం. వాళ్లకు నాలుగున్నరేళ్ల పాపాయి. ఆటపాటల్లో మునిగిపోయి ఆకలైనప్పుడు అమ్మ కోసం వెతుక్కునే వయసది. ఆ పరిసరాల్లో నివసించే ఓ వ్యక్తి కళ్లు ఆ పాపాయి మీద పడ్డాయి. ‘నీకు టీవీ చూపిస్తాను’ అని లోపలికి తీసుకువెళ్లాడు. కేసు వెలుగులోకి వచ్చింది. టీవీ చూపిస్తూ, చాక్లెట్లు ఇచ్చి ఎలా మాయచేశాడో చెప్పడానికి పాపాయి ప్రయత్నిస్తోంది. కానీ పాపాయికి, వాళ్ల తల్లిదండ్రులకు తెలుగు రాదు, ఇంగ్లిష్ రాదు. ఏం జరిగిందనేది పోలీసులకు అర్థమవుతోంది. కానీ పాపాయి చేత చెప్పించి కేసు రికార్డు చేయించక తప్పదు. నేపాలీ ట్యూటర్ని పిలిపించి కేసు రికార్డు చేశారు. ఎనిమిది రోజుల్లో చార్జిషీట్ వేయగలిగారు. మెడికల్ సర్టిఫికేట్లు కోర్టుకు సమర్పించడం వంటి ప్రక్రియ మొత్తం వేగంగా జరిగి పోయింది. ఏడు నెలల్లో నిందితుడికి జీవితఖైదు పడింది. అలాగే మరో పన్నెండేళ్ల అమ్మాయిని వ్యూహాత్మకంగా పడుపు వృత్తిలోకి దించిన ఉదంతంలో ఏకంగా 74 మందిని అరెస్టు చేశారు. వారిలో యూఎస్‌కి వెళ్లబోతున్న టీసీఎస్ ఉద్యోగి కూడా ఉన్నాడు. యూకేలో ఉన్న ఒక నిందితుడు, ఇండియాలోనే ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు దిశ పోలీసులు. ∙∙∙ ఆ బిల్లు దిశగా దర్యాప్తు గుంటూరు, దిశ పోలీస్ స్టేషన్ ఏఎస్పీ సుప్రజ పై కేసుల దర్యాప్తును వివరిస్తూ... ‘‘మేము దిశ బిల్లు స్ఫూర్తితో కేసులను సత్వరం పరిష్కరిస్తున్నాం. పై కేసుల్లో కూడా నేరగాళ్లకు శిక్ష పడితీరాలన్నంత ఆవేశంతో పని చేశాం. పసిబిడ్డల పట్ల ఆ దుర్మార్గులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. మరొకరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకూడదన్నంత సీరియెస్‌గా పని చేస్తున్నాం. నేరం జరిగిన విషయం నిజమే అయినప్పటికీ న్యాయపోరాటంలో కొన్నిసార్లు మేము దఖలు పరిచిన ఆధారాలు వీగిపోతుంటాయి. అందుకే కొన్ని ఆధారాలను అత్యంత గోప్యంగా ఉంచి నేరుగా కోర్టులో బయటపెట్టాను. ఎనభై ఐదేళ్ల వృద్ధుడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కోర్టులో అతడి నటన కూడా ఆస్కార్‌కు దీటుగా ఉండింది. దాంతో జడ్జిగారు మమ్మల్నే సందేహించారు కూడా. అప్పుడు నేను వీడియో బయటపెట్టడంతో కేసు నిలిచింది’’ అన్నారు సుప్రజ. దిశ బస్సులు పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహిళలకు వృత్తిపరమైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బందోబస్తు డ్యూటీకి వెళ్లినప్పుడు విఐపీ రావడానికి నాలుగు గంటల ముందే ఆ ప్రదేశంలో ఉండాలి. ప్రోగ్రామ్ పూర్తయి, అందరూ వెళ్లిపోయే వరకు డ్యూటీ ఉంటుంది. కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది. ఏ ఒకటి – రెండు చోట్లనో తప్ప బాత్రూమ్ వంటి సౌకర్యాలు ఉండవు. మహిళలకు అన్ని రోజులూ ఒకటిగా ఉండవు. కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వారి కష్టాలను అర్థం చేసుకుని సీయెం వారికి ‘దిశ బస్సు’ల రూపంలో మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించి మహిళాపోలీసుల కష్టాలను దూరం చేశారు. ‘ఈ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేమ’ని అంటున్నారు మహిళాపోలీసులు. దిశ కేసుల విషయంలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. బిల్లు ఇంకా చట్టం రూపం సంతరించుకోలేదు. దిశ పోలీస్స్టేషన్లు, దిశ పోలీసులు మాత్రం ఆ బిల్లును స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తున్నారు. న్యాయపోరాటంలో బాధితుల పక్షాన నిలుస్తున్నారు. కొన్నింటికి ఆధారాలుండవు! చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అనే కాదు... మొత్తంగా ఆడవాళ్ల మీద జరిగిన నేరాన్ని రుజువు చేయడం చాలా కష్టం. ముందు సమాజమే అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. పైన వృద్ధుడి విషయంలోలాగానే సమాజం పోలీసులనే సందేహిస్తుంది. మహిళల విషయంలో కూడా మొదట బాధితురాలినే తప్పు పడుతుంది. ఈ నెగిటివ్ ఆటిట్యూడ్ తొలగిపోవాలి. ప్రతి కేసుకీ వీడియోలు ఉండవు. కానీ నేరం జరిగి ఉంటుంది. మహిళను తేలికగా మాట్లాడే ముందు జరిగిన అన్యాయాన్ని కనీసంగా అర్థం చేసుకోవడానికి అయినా ప్రయత్నించాలి. – సుప్రజ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్చార్జ్, వెస్ట్ సబ్ డివిజన్, దిశ పోలీస్ స్టేషన్,గుంటూరు – వాకా మంజులారెడ్డి -
ఏఎస్పీ ‘ముని రామయ్య’ కేసులో మరో అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా (ఏఎస్పీ) పని చేస్తున్న ఎం.ముని రామయ్యపై హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన చీటింగ్ కేసుపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే మరో నిందితుడైన విశాఖపట్నం వాసి మణిధర్ వర్మను అరెస్టు చేయగలిగారు. బాధితుడిని మోసం చేయడానికి డీఎస్పీ అవతారమెత్తిన కడపకు చెందిన కేవీ రాజు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన వ్యవహారానికి సంబంధించిన ఈ కేసులో ముని రామయ్యకు నిందితుడిగా నోటీసులు జారీ చేయగా... ఈ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఏపీ పోలీసుల ఆయనపై చర్యలు తీసుకున్న విషయం విదితమే. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్‌కుమార్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈయన స్నేహితుడైన జయప్రతాప్.. చిత్తూరు జిల్లా ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే ఆయన వివిధ పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్ల తిరిగి ఇస్తాడని చెప్పాడు. చదవండి: రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక నిర్ణయం.. కబ్జాపై ‘ఎస్ఓటీ’ ఈ మాటలను సునీల్‌కుమార్ పట్టించుకోకపోవడంతో మరోసారి మునిరామయ్యను తీసుకుని హైదరాబాద్ వచ్చారు. హిమాయత్‌నగర్‌లోని సునీల్ కుమార్ కార్యాలయానికి వెళ్లి తాము చెప్పినట్లు చేస్తే కచ్చితంగా లాభం వస్తుందని, రూ.1.2 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ నమ్మబలికారు. అంతటితో ఆగని ముని రామయ్య టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ అంటూ కేవీ రాజు అనే వ్యక్తిని రంగంలోకి దింపాడు. ఈ వ్యవహారంలో మణిధర్ వర్మ మధ్యవర్తిత్వం వహించాడు. వీరందరు సునీల్ నుంచి 2019 నవంబర్‌లో రూ.1.2 కోట్లు వసూలు చేశారు. ఇది జరిగిన తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా ఎదురు చూసినా సునీల్‌కుమార్‌కు డబ్బు తిరిగి రాలేదు. ఆయన ఆరా తీయగా కేవీ రాజు అనే పేరుతో డీఎస్పీ లేరని, జరిగింది మోసమని గుర్తించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి దర్యాప్తు చేసి నేరం జరిగినట్లు నిర్థారించారు. ముని రామయ్యతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మణిధర్ వర్మను అరెస్టు చేశారు. సూడో డీఎస్పీ కేవీ రాజును పట్టుకుని విచారిస్తే ఈ కేసులో కీలక విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోసం నగరంతో పాటు ఏపీలోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. -
వంద సీట్లిచ్చినా ఎస్పీతో పొత్తు పెట్టుకోం: ఆజాద్
నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లిస్తామని చెప్పినా... సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) అధినేత చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో పొత్తుకు సిద్ధమేనన్న ఆజాద్, బీజేపీని ఓడించడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా అఖిలేష్ యాదవ్‌ను కలిసింది నిజమేనని, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వంద సీట్లిచ్చినా ఎస్పీతో పొత్తు కుదుర్చుకోబోమన్నారు. అది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. తమకు మద్దతిస్తామని చెబుతూనే ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏఎస్పీకి కేవలం రెండు సీట్లు ఆఫర్ చేశారని, ఆయన ఎగతాళి చేస్తున్నాడో, మద్దతు ఇస్తున్నాడో న్యాయ విద్యార్థి అయిన తనకు అర్థమవుతోందని అన్నారు. చదవండి: (కాక రేపుతున్న యూపీ ఎన్నికలు.. బీజేపీ ఎమ్మెల్యేకు అఖిలేష్ బంపర్ ఆఫర్) -
ఏఎస్పీకి నాలుగు వారాల జైలుశిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడమే కాకుండా కోర్టు ధిక్కార కేసులో కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించినందుకు గతంలో విజయవాడ ఏసీపీగా పని చేసిన (ప్రస్తుత శ్రీకాకుళం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ) కె.శ్రీనివాసరావుకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ ఆదేశాల అమలును వారం రోజుల పాటు నిలిపేయాలని శ్రీనివాసరావు తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి అభ్యర్థించగా.. తీర్పు అమలును వారం నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. లెక్చరర్ ఫిర్యాదుతో.. గుంటూరుకు చెందిన బి.ఝాన్సీలక్ష్మి అనే లెక్చరర్ 2015లో కె.కోటేశ్వరరావు, ఎ.రమాదేవి అనే ఇద్దరు లెక్చరర్లపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడం లేదని, చార్జిషీట్ దాఖలు చేయడం లేదంటూ ఆమె 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు విచారణ వేగంగా పూర్తి చేసి సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయాలని అప్పటి సౌత్ జోన్ ఏసీపీని ఆదేశించింది. ఆ ఆదేశాలను ఏసీపీ శ్రీనివాసరావు అమలు చేయడం లేదంటూ ఝాన్సీలక్ష్మి 2017లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయగా.. సాక్ష్యాధారాలు లేనందున కేసు మూసివేశామని, సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశామని 2017లో హైకోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే, పోలీసులు దాఖలు చేసిన తుది నివేదిక సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలంటూ ఝాన్సీలక్ష్మి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారు. తుది నివేదిక దాఖలు చేయలేదని కోర్టు వర్గాలు ఆ దరఖాస్తును తోసిపుచ్చాయి. తుది నివేదిక దాఖలు చేయకుండా దాఖలు చేసినట్టు చెప్పి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మూసివేయించారంటూ ఏసీపీ శ్రీనివాసరావుపై ఝాన్సీలక్ష్మీ 2018లో మరో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పైవిధంగా తీర్పునిచ్చారు. -
మద్యం మత్తులో ఏఎస్పీ హల్చల్
కోవూరు(నెల్లూరు జిల్లా): మద్యం మత్తులో పలువురిని దూషించడంతో పాటు చేయి చేసుకున్న ఏఎస్పీ శ్రీధర్, అతని స్నేహితులపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. నెల్లూరు జిల్లా కోవూరు శాంతినగర్‌కు చెందిన పంతంగి దేవేంద్ర తన స్నేహితుడు సూర్యవర్ధన్తో కలిసి ఆదివారం రాత్రి కోవూరు హైవే పై ఉన్న ఓ హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో ఏఎస్పీ(వీఆర్) శ్రీధర్, అతని స్నేహితులు మద్యం సేవించి కారులో హోటల్ వద్దకు వచ్చారు. మాస్కులెందుకు వేసుకోలేదంటూ దేవేంద్ర, సూర్యవర్ధన్లను తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు చేయి చేసుకున్నారు. కారులో ఉన్న శ్రీధర్ స్నేహితులిద్దరూ హోటల్ వద్దనున్న మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో బాధితులు కోవూరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కె.రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సీహెచ్ కృష్ణారెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ఏఎస్పీని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ్నుంచి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు మేరకు ఏఎస్పీ శ్రీధర్, అతని స్నేహితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కోవూరు ఎస్ఐ తెలిపారు. చదవండి: స్నేహితురాలిని రహస్యంగా తీసుకెళ్లి.. చివరకు ఇలా.. ఆరోగ్యశ్రీ.. నా బిడ్డకు మళ్లీ మాటలిచ్చింది -
ఇది జరగకూడని సంఘటన: గౌతమ్ సవాంగ్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్ధనా మందిరాల భద్రత చర్యను పరిశీలించాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన శనివారం అంతర్వేది ఆలయంపై పత్రిక ప్రకటన వెలువరించారు. అంతర్వేది ఆలయంలో ఏళ్ల నాటి చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతవ్వడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది జరగకూడని సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజల మనోభవాలతో ముడిపడిన సున్నితమైన అంశంగా డీజీపీ పేర్కొన్నారు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అటువంటి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించకూడదని, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం 2013 ప్రకారం పూర్తి స్థాయిలో దేవాలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు అమర్చి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తమన్నారు. అంతేగాక అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, దేవాలయాలకు ఫైర్ & ఎలక్ట్రిసిటీ ఆడిట్ నిర్వహించడం, నిరంతరం రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షణ చర్యలు చేపట్టే విధంగా అవగాహన కల్పించడంతోపాటు పెట్రోలింగ్‌ను పటిష్టపరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే సోషల్ మీడియా పుకార్లపై నిఘా, మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతి భద్రతలకు సహకరించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా ఉండే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఎస్పీలను డీజీపీ అప్రమత్తం చేశారు. -
వచ్చే జాతరకు ఉంటామో, లేదో !?: ఏఎస్పీ
సాక్షి, వరంగల్: కరోనా మహమ్మారి మరో పోలీసు ఉన్నతాధికారిని బలిగొంది. జగిత్యాల ఏఎస్పీ కుంబాల దక్షిణామూర్తి(58) వైరస్ బారిన పడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ వరకు వివిధ స్థాయిల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసిన ఆయన జగిత్యాల ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ మరణించారు. వారం క్రితం ఆయన వైరస్ బారిన పడగా, కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. (చదవండి: కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి) మొదట రెవెన్యూశాఖలో... కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అల్గునూర్‌కు దక్షిణామూర్తి చిన్ననాటి నుంచే పోలీసు ఉద్యోగంలో చేరాలనే లక్ష్యంతో చదువులో ప్రతిభ కనబరిచేవారు. 1986లో మొదట రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన ఆయన కోరుట్ల, మెట్‌పల్లిల్లో విధులు నిర్వర్తించాక 16–01–1989లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లాలో మొదటి పోస్టింగ్ దక్కించుకున్న ఆయన సీఐగా, డీఎస్పీగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో చేశాక తెలంగాణ ఆవిర్భావం అనంతరం పదోన్నతిపై నిర్మల్ ఏఎస్పీగా విధుల్లో చేరాడు. అక్కడి నుంచి గత ఏడాది నవంబర్ 1న జగిత్యాల ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భేష్ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనే దక్షిణామూర్తి సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఏటూరునాగారం, కేయూసీ, మట్టెవాడ, మిల్స్‌కాలనీ, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో సీఐగా పనిచేశారు. 2011లో డీఎస్పీగా పదోన్నతి పొందాక కొద్దిరోజులు కాజీపేట రైల్వే డీఎస్పీగానే కాకుండా ములుగు డీఎస్పీగా, హన్మకొండ ఏసీపీగా కూడా విధులు నిర్వర్తించారు. భూపాలపల్లి డీఎస్పీగా విధులు నిర్వరిస్తున్న సమయంలో నిర్మల్ ఏఎస్పీగా వెళ్లారు. వరంగల్ జిల్లాలో పనిచేసిన సమయంలో యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్, 2007లో చిన్నారి మనీషా కిడ్నాప్, హత్య కేసుతో పాటు పలు కిడ్నాప్ కేసుల పరిశోధనల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. మేడారం జాతరలో అన్నీ తానై... ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర భద్రత ఏర్పాట్లలో దక్షిణామూర్తే అన్నీతానై పర్యవేక్షించి ఉన్నతాధికారులతో మెప్పు పొందేవారు. ఈ ఏడాది ఫిభ్రవరిలో జరిగిన జాతర సందర్భంగా ‘18 జాతరలు చూశాను.. అమ్మవార్ల సేవలో తరించే అవకాశం వచ్చింది... వచ్చే జాతరకు ఉంటామో, లేదో.. నా రిటైర్మెంట్ కూడా ఉంది.. ఈసారి ఇంకా బాగా చేశాం.. నా జన్మ ధన్యమైంది’ అంటూ మీడియా ప్రతినిధులతో ఆయన తన మనోభావాలు పంచుకున్నారు. కాగా, కరోనా బారిన పడిన పోలీసు సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపిన ఆయనే కరోనా కాటుకు బలి కావడం గమనార్హం. ఇక ఈనెల 31న ఏఎస్పీ దక్షిణామూర్తి ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఇంతలోనే కరోనా ఆయనను బలిగొంది. ఆయన ఉద్యోగ విరమణ రోజు ఘనంగా సన్మానించేందుకు పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తుండగానే మృతి చెందడంతో వారు దిగ్బ్రాంతికి లోనయ్యారు. -
ఎమ్మెల్యే భవాని ఇచ్చిన ఫిర్యాదు రాజకీయ ఉద్ధేశమే: లతమాధురి
-
ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్పీలకు పోస్టింగ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ(అప్పా) ఏఎస్పీగా టి.శోభా మంజరి, నెల్లూరు క్రైమ్ ఏఎస్పీగా పి.మనోహర రావు, అనంతపురం అడ్మిన్ ఏఎస్పీగా జి. రామంజనాయులు, సీఐడీ ఏఎస్పీగా ఎన్. వెంకటేశ్వరరావు, గుంటూరు అర్బన్ క్రైమ్ ఏఎస్పీగా ఎం.శ్రీనివాస్, ప్రకాశం జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా బి.శరత్ బాబును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
కర్నూలు ఏఎస్పీగా దీపిక పాటిల్
సాక్షి, కర్నూలు : జిల్లా అడిషనల్ ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక పాటిల్, నంద్యాల ఓఎస్డీగా ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఇక్కడ ఏఎస్పీగా ఉన్న ఆంజనేయులును నంద్యాల ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. ఈ స్థానంలో తిరుపతి ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న దీపిక పాటిల్‌ను నియమించింది. ఇద్దరూ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఆంజనేయులు ఈ ఏడాది మార్చి 8న విధుల్లో చేరారు. ఐదు నెలల పాటు అడిషనల్ ఎస్పీగా పనిచేసి.. నూతనంగా నియమితులైన దీపిక పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈమె 2014లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయిన తర్వాత కొంత కాలం గ్రేహౌండ్స్, మరికొంతకాలం పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు. తిరుపతి ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేసిన తర్వాత ఐదు నెలల పాటు సెలవులో వెళ్లారు. ఆ తర్వాత బదిలీపై కర్నూలుకు వచ్చారు. ఈమె భర్త విక్రాంత్‌పాటిల్ గుంతకల్ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్నారు. దీపికపాటిల్ తండ్రి వెంకటేశ్వరరావుది కృష్ణా జిల్లా ఆముదాల లంక. ఆయన సీఆర్పీఎఫ్లో ప్రస్తుతం ఐజీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. సాంకేతిక సేవలను విస్తృతం చేస్తాం జిల్లా పోలీసు శాఖలో సాంకేతిక సేవలను మరింత విస్తృతం చేసి.. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని దీపికపాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప సహకారంతో పోలీసు సిబ్బందికి సంబంధించి పెండింగ్ ఫైళ్లను వేగంగా పరిష్కరిస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తినా తగిన చర్యలు చేపడతామన్నారు. అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ , డీఎస్పీలు వెంకటాద్రి, ఇలియాజ్ బాషా, ఏఓ సురేష్‌బాబు, ఆర్ఐలు జార్జ్, రామకృష్ణ, రవి, రంగస్వామి తదితరులు ఏఎస్పీ దీపికపాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. దీపికపాటిల్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్పీ ఫక్కీరప్ప, డీఐజీ వెంకట్రామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. -
లాఠీ పట్టిన చేయితో నాగలి పట్టిన ఏఎస్పీ
-
ప్రజల కోసం 24/7
సాక్షి, ఏలూరు టౌన్ (పశ్చిమ గోదావరి): ప్రజలకు మెరుగైన ఉత్తమ సేవలు అందించేందుకు 24గంటలూ అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా బాధితులు తన వద్దకు రావచ్చని, తలుపులు తెరిచే ఉంటాయని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు చేరుకున్న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శాంతిభద్రతల పరిరక్షణకే పెద్దపీట ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకే పెద్దపీట వేస్తామని, ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇక తన ప్రాధాన్య అంశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీల్లో భాగంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలుపై దృష్టి సారిస్తామని చెప్పారు. పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. జిల్లాలోని ఆయా సమస్యలపై సబ్ డివిజినల్ అధికారులతో సమీక్షించి, ముందుగా ఒక అవగాహన తెచ్చుకోవాలని, అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదు దారులతో స్నేహపూర్వకంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. మంచి వాతావరణంలో పోలీసులు, ప్రజలకు మధ్య సంబంధాలు ఉండేలా చూస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై ఎప్పుడైనా తనవద్దకు రావచ్చని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రతి సోమవారం ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తామని, సబ్ డివిజన్ పరిధిలోనూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నవదీప్‌సింగ్ చెప్పారు. జిల్లాలో నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజా జీవనానికి అవాంతరాలు కల్పిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. అధికారుల శుభాకాంక్షలు ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌ను జిల్లాలోని డీఎస్పీలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్బీ డీఎస్పీ నున్న మురళీకృష్ణ, మహిళా స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ పీ.భాస్కరరావు, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సుబ్రహ్మణ్యం, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ, కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం డీఎస్పీ రవికుమార్, నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు జిల్లా ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్రైం రేట్ పెరిగితే సహించను: ఎస్పీ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని, విధుల్లో జవాబుదారీతనం ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, క్రైం రేట్ పెరిగితే సహించేదిలేదని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ అధికారులను హెచ్చరించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన జిల్లాలోని సబ్ డివిజనల్ ఆఫీసర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా జిల్లాకు రావటంతో ఇక్కడ పరిస్థితులపై అవగాహన తెచ్చుకోవటంతోపాటు, నేరాలపైనా ఆరా తీశారు. పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే విధుల్లో అలసత్వాన్ని ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల విషయంలోనూ అత్యంత కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే అటువంటివారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఈ నేరసమీక్షలో జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ నున్న మురళీకృష్ణ, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సుబ్రహ్మణ్యం, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ, కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం డీఎస్పీ రవికుమార్, నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు తదితరులు ఉన్నారు. -
ద్విచక్ర వాహనంపై ఏఎస్పీ పర్యటన
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలోని కొండపై ఉన్న చాపరాయి జంగిడిభద్ర గ్రామానికి పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గరుడ్ సతీసమేతంగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏఎస్పీ ద్విచక్రవాహనంతో వెళ్లారు. ఏజెన్సీలోని గిరిజనులకు ఓటు వినియోగం విషయంలో పలు సూచనలు చేసేందుకు మంగళవారం ఆయన పర్యటించారు. ఆయన వెంట ఎల్విన్‌పేట సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్ఐ వి.జ్ఞానప్రసాద్ ఉన్నారు. -
దొంగనోట్ల చలామనీపై అప్రమత్తం : ఏఎస్పీ
రామభద్రపురం: సాలూరు పరిధిలో దొంగనోట్లు చలామనీ అవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం డివిజన్ ఏఎస్పీ దీపికాపాటిల్ సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్లో గురువారం ఆమె మాట్లాడారు. ఇటీవల సాలూరు ప్రాంతంలో దొంగనోట్లు చలామనీ చేసిన ముఠాను పట్టుకొన్నామని, వారి నుంచి కొంత మొత్తాన్ని రికవరీ చేశామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దొంగనోట్లలో వాటర్ మార్క్ కనిపించదని, అటువంటి నోట్లు ప్రజలు గమనించి తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఉన్న అన్ని ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రామభద్రపురం, సాలూరు, పి.కోనవలస వద్ద ఘాట్ రోడ్డు, పార్వతీపురం, తోటపల్లి ప్రాజెక్టు, కొత్తవలస రైల్వేగేట్ తదితర ప్రాంతాల వద్ద ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ఈ సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రామభద్రపురంలో రహదారి విస్తరణపై ఎస్పీకి లేఖ రావామని, రోడ్లు భద్రతా కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నందున నిధులు సమకూర్చుతామని తెలిపినట్టు పేర్కొన్నారు. ఆమె వెంట ఎస్ఐ డీడీ నాయుడు ఉన్నారు. -
అడ్డంకులెదురైనా పోరాడి గెలిచా
సమాజంలో స్త్రీల పట్లవివక్ష చూశాను. చదువుకోవడానికి కూడా ఆటంకాలు ఉన్నాయి.వేటికీ వెరవకూడదు. పోరాడితే మహిళలుఅనుకున్నది సాధిస్తారు.ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. కుటుంబ వ్యవస్థలో కూడా మార్పు రావలసి ఉంది. ఆడపిల్లలుఅబలలు కాదని,సబలలని నిరూపించే సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏలూరు టౌన్: ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో పోటీపడుతున్నా... అదేస్థాయిలో వివక్ష, దాడులు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి... మహిళగా అనేక ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించి విజయాలు అందుకోవటం అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఎర్రచందనం మాఫియా భరతం పట్టినప్పుడు గానీ.. మహిళల అక్రమరవాణా ముఠాపై దాడులు చేసి కేసులు పెట్టిన పరిస్థితుల్లోనూ బెదిరింపులు, ఒత్తిళ్ళు ఎదురైనా చట్టం.. మనస్సాక్షితో పనిచేస్తూ ఆరాచక శక్తుల ఆటకట్టించాను. స్త్రీ ఎంత ఎదిగినా అనాదిగా సమాజంలో వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. నేను ఈ స్థాయికి చేరేందుకు బాల్యం నుంచీ వెన్నుతట్టి ప్రోత్సహించిన.. నా తల్లీదండ్రే నా మార్గదర్శకులు. నా రోల్‌మోడల్ అంటోంది జిల్లా అదనపు ఏఎస్పీ వెలిశెల రత్న. ఇంకా అనేక విషయాలు ఆమె మాటల్లోనే.. నేను చదువుకునే రోజుల్లో మహిళల చదువు పట్ల చిన్నచూపు ఉండేది. మా తండ్రి నా సోదరులతో సమానంగా చదివించటం కారణంగానే ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. చదువుకోవాలనే ఆశ ఉన్నా కొందరికి ఆ అవకాశమే ఉండేది కాదు. ఆడపిల్లకు చదువెందుకు అనేవారు. ఆడపిల్ల ధైర్యంగా బయటకు వస్తే నిందలు వేసే నీచమైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాడితేనే విజయం సాధించగలమనే నమ్మకం రావాలి. భవిష్యత్తులో సైబర్ క్రైం పెద్ద సవాల్‌గా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. టెక్నాలజీ పెరగటం అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టిరాగల పరిస్థితులు ఉన్నాయి. పరిజ్ఞానం ఎంత పెరిగిందో నేరాలు అంతేస్థాయిలో అధికం అయ్యాయి. స్త్రీ ఎంత ఎదిగినా సమాజంలో వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నా...ఆయా రంగాల్లో నేటికీ దారుణ పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నారు. సామాజిక, ఆర్థిక, జీవన విధానంలో మార్పులు మహిళలపై దాడులు పెరిగేందుకు కారణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే మహిళలు అభివృద్ధి సాధించటం సాధ్యం కాదనే చెప్పాలి. కుటుంబ వ్యవస్థలో మార్పులు ఒంటరి మహిళల సంఖ్యను పెంచింది. ఈ పరిస్థితుల్లో మహిళలపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలు నేరస్తులుగా ఉన్న సంఖ్య స్వల్పమే కానీ.. బాధితులుగా వేలల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయం ఇలా అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తూ పట్టుదలతో పోరాడితేనే మహిళా సాధికారిత, స్వావలంబన సాధ్యమవుతుంది. మా తండ్రి నాగేంద్రరావు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి వీఎంజే పిన్నమ్మ గృహిణి. మా నాన్న ఆర్మీలో పనిచేయటంతో దేశభక్తికి కొదవలేదు. నా తల్లీతండ్రిని చూస్తూ పెరగటంతో బాల్యం నుంచీ ప్రజలకు సేవ చేయాలనే కాంక్ష అధికంగానే ఉండేది. నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. నాకు ఒక కుమారుడు, భర్త బిజినెస్ చేస్తారు. మాది కృష్ణాజిల్లా పెనుమలూరు మండలం తాడిగడప గ్రామం. పెనుమలూరులోనే టెన్త్ వరకూ చదివాను. విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసి, రాజమహేంద్రవరంలో బీఎడ్ చదివాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్ చేశాను. ఇక 2002లో జవహర్ నవోదయ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి ఏసీటీఓగా 2005లో పనిచేశా. సామాజిక సేవ పట్ల ఉన్న ఆసక్తి కారణంగా గ్రూప్–1 పరీక్షలు రాసి డీఎస్పీగా 2007 బ్యాచ్‌లో ఉద్యోగంలో చేరాను. పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి దశాబ్దకాలం పూర్తయింది. మొదట పోస్టింగ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి, రెండో పోస్టింగ్ గుంటూరు అర్బన్ డీఎస్పీగా పనిచేశాను. మూడో పోస్టింగ్ గుంటూరు అర్బన్ ఓఎస్డీగా పనిచేశా. చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పనిచేయటం మంచి గుర్తింపునిచ్చింది. 2016 డిసెంబర్ 5న పశ్చిమ అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించా. ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు తీసుకున్నాను. సత్తుపల్లి, గుంటూరు, చిత్తూరులో పోలీస్ అధికారిగా పనిచేస్తోన్న కాలంలో అనేక కేసులు ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించాను. మహిళల అక్రమ రవాణా చేస్తోన్న ముఠాల ఆటకట్టించి, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయించా. ఒత్తిళ్ళకు లొంగిపోకుండా చట్టం, మనస్సాక్షి ఆధారంగా దోషులకు శిక్షలు పడేలా చేయటం ఆనందాన్ని ఇచ్చింది. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బడా నేతల కనుసన్నల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కాపాడాను. గుంటూరులో పనిచేస్తోన్న సమయంలో ఘోరరోడ్డు ప్రమాదంలో 12మంది చనిపోయారు. వారిలో నిండు గర్భిణి కూడా ప్రాణాలు కోల్పోవటం బాధించింది. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపటంతో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. -
ఓ వ్యక్తి నిప్పంటించుకుని.. ఆపై యువతిని..!
సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో గురువారం భయంకర సంఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్ ఒక వ్యక్తి తనకు తాను శరీరానికి నిప్పంటించుకున్నాడు. అంతేకాక హోటల్లో ఉన్న యువతిని కూడా తనతో పాటు అగ్నికి ఆహుతి చేయడానికి ప్రయత్నించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవి కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనిపై ఏఎస్పీ నీరజ్ సోని మాట్లాడుతూ.. ఆ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని, ఆపై మహిలను చంపడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన గ్రీన్ ప్యారడైజ్ అనే హోటల్లో చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఏఎస్పీ తెలిపారు. అతను ఆ యువతిపై కక్షసాధింపుతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఏఎస్పీ చెప్పారు. గతంలో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందన్నారు. దీనికి కారణం వాట్సాప్‌లో ఎడిట్ చేసిన ఫొటోలే ఈ ప్రమాదానికి దారితీశాయన్నారు. అతనిపై ఆత్మహత్య యత్నం కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఏఎస్పీ చెప్పారు. -
మెసేజ్‌లో పెళ్లి ప్రపోజల్..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం కేసులో అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ మంగళ వారం ఆదేశాలు వెలువడ్డాయి. సీఐ మల్లికార్జున్ రెడ్డిని వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేయగా, ఏఎస్పీ సునీతారెడ్డిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారని పోలీస్ శాఖ తెలిపింది. వీరిద్దరి వ్యవహారంపై సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి మంగళవారం డీజీపీని కలసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన తెలిపారు. విచారణ ముమ్మరం చేసిన పోలీసులు మరోవైపు ఇరువురి అక్రమ సంబంధం విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఏఎస్పీ భర్త సురేందర్‌రెడ్డి, తల్లి ప్రమీలమ్మ, పెద్దమ్మ సునంద, సురేందర్‌రెడ్డి స్నేహితుడు సురేష్ కుమార్‌లను పోలీసులు విచారించి ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలు నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజిలు, ఇరువురి ఫోన్ కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. మల్లికార్జున్‌రెడ్డి తమ కుటుంబంలో నిప్పులు పోశాడని, ఏవేవో ఆశలు చూపి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడని ఏఎస్పీ తల్లి, పెద్దమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురి కుటుంబాలు రోడ్డున పడొద్దని తాము ఎంతగానో ఓపికపట్టి వివాదం లేకుండా సర్దిచెప్పినా వినిపించుకోలేదని పోలీసులకు తెలిపారు. నా కుటుంబాన్ని నాశనం చేయవద్దని అభ్యర్థించినా సీఐ తీరు మార్చుకోకపోగా తమనే చంపుతానంటూ హెచ్చరించడంతో బట్టబయలు చేయాల్సి వచ్చిందని భర్త సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 2016లోనే దొరికినా తీరు మారలేదు ఏఎస్పీకి, సీఐకి నడుమ సాగుతున్న అక్రమ సంబంధం విషయాన్ని 2016 జూలైలోనే భర్త సురేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు కనిపెట్టి వారిని ప్రశ్నించారు. తమ మధ్య ఎలాంటి సంబంధాల్లేవని బుకాయించడంతో పాటు అనుమానించవద్దని ఇరువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తతో పాటు కుటుంబసభ్యులు గట్టిగా నిలదీయడంతో మరోమారు ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి ఇరువురు క్షమాపణ చెప్పారు. ఇకపై ఎలాంటి సంబంధాలను కలిగి ఉండనని చెప్పడంతో భార్య మాటలను నమ్మిన సురేందర్‌రెడ్డి కాపురం సాగించాడు. ఇటువంటి చర్యలను ఉపేక్షించబోం: నాయిని పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఏఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో పోలీస్ శాఖలో ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి స్థాయి అధికారులనైనా ఉపేక్షించ బోమని ఆయన స్పష్టం చేశారు. మెసేజ్‌లో పెళ్లి ప్రపోజల్.. కొన్ని రోజుల తర్వాత మల్లికార్జున్‌రెడ్డి నుంచి సునీత ఫోన్‌కు మెసేజ్‌లు రావడం, తనకంటే ఉన్నతస్థాయిలో ఉన్న అధికారిణి పట్ల గౌరవం లేకుండా ఏక వాక్యంగా మెసేజ్‌లు పంపడం చూసిన సురేందర్‌రెడ్డికి అనుమానం మొదలైంది. మల్లికార్జున్‌రెడ్డి ఏఎస్పీ సెల్‌కు పంపిన మెసేజ్‌లో వివాహం చేసుకుందామని ప్రతిపాదించడం చూసిన ఆయన ఇరువురు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని నిర్ధారణకు వచ్చాడు. ఈ క్రమంలో మల్లికార్జున్‌రెడ్డి తనను చంపేస్తానని బెదిరించడంతో మనోవేదనకు గురైన ఆయన భార్య తరఫు కుటుంబీకుల మద్దతు తీసుకుని ఇరువురి బండారం బట్టబయలు చేయాలని నిర్ణయించు కున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి ఇరువురు తన నివాసానికి 11.30 సమయంలో వచ్చి సుమారు రెండున్నర గంటల పాటు కలసి ఉన్న విషయాన్ని బట్టబయలు చేశాడు. -
మహిళా ఏఎస్పీ, ఇన్స్పెక్టర్ మధ్య వివాహేతర సంబంధం
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) ఏఎస్పీగా పని చేస్తున్న ఓ మహిళా అధికారి, కల్వకుర్తి సీఐగా పని చేస్తున్న మల్లికార్జున్‌రెడ్డి మధ్య కొన్నాళ్ళుగా సాగుతున్న వివాహేతర సంబంధం ఆదివారం అర్ధరాత్రి బట్టబయలైంది. ఏఎస్పీ భర్త, అతని బంధువులు ఇన్స్పెక్టర్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారిణి భర్త సురేందర్‌రెడ్డి ఫిర్యా దు మేరకు ఇన్స్పెక్టర్పై కేపీహెచ్‌బీ ఠాణాలో సోమ వారం కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే.. మల్లికార్జున్‌రెడ్డి సైతం గతంలో ఏసీబీలో పని చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన, ‘ఓటుకు కోట్లు’ కేసును దర్యాప్తు చేసిన బృందంలో అప్పట్లో డీఎస్పీ çహోదాలో ఉన్న మహిళా అధికారిణి తో అతను కలిసి పనిచేశాడు. అలా వీరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం అమెరికాలో ఉంటున్న సదరు అధికారిణి భర్తకు తెలియడంతో అతను, ఆయన కుటుంబీకులు ఏడాది క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇరువురినీ మందలించడంతో పాటు మల్లికార్జున్‌రెడ్డిని ఏసీబీ నుంచి తప్పిస్తూ.. పోలీసు విభాగానికి పంపారు. ప్రస్తుతం అతడు కల్వకుర్తి సీఐగా పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్ళుగా మళ్లీ మహిళా అధికారి, మల్లిఖార్జున్ రెడ్డి తమ పరిచయం కొనసాగిస్తున్నారు. అతను తరచూ కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అధికారిణి ఇంటికి రాకపోకల సాగిస్తున్నాడు. ఎక్కువగా రాత్రి వేళల్లో ఈ వ్యవహారం సాగుతుండటాన్ని గుర్తించిన సురేందర్‌రెడ్డి కుటుంబీకులు విషయాన్ని అమెరికాలో ఉన్న అతడికి సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం రహస్యంగా అమెరికా నుంచి వచ్చిన సురేందర్‌రెడ్డి భార్య వ్యవహారం బట్టబయలు చేసేందుకు కాపుకాశాడు. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత మల్లికార్జున్‌రెడ్డి సదరు అధికారిణి ఇంటికి వచ్చినట్లు గుర్తించిన ఆయన తన తల్లి, బంధువులతో కలిసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సురేందర్‌రెడ్డి బంధువులు మల్లికార్జున్‌రెడ్డిని చెప్పుతో కొడుతూ అక్కడి నుంచి తరిమారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్‌రెడ్డి వారిని తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఈ మొత్తం వ్యవహారం మీడియా కెమెరాలకు చిక్కింది. తన భార్యను మల్లిఖార్జున్ రెడ్డి ట్రాప్ చేశాడని, దాదాపు రెండేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుందని సురేందర్‌రెడ్డి ఆరోపించాడు. తన భార్య వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. సోమవారం మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. శాఖాపరమైన విచారణ అనంతరం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఏఎస్పీతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని చెప్పిన మల్లికార్జున్‌రెడ్డి... ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, మంజూరైన తర్వాత వివాహం చేసుకోనున్నామని మీడియాతో పేర్కొన్నాడు ఆదివారం రాత్రి ఆమెను దించేందుకే వారింటికి వెళ్ళానని చెబుతుండగా, ఈ వాదనను సురేందర్‌రెడ్డి ఖండిస్తున్నాడు. సోమవారం మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్‌ను కలిసి తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన మల్లికార్జున్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.పోలీసులు మల్లికార్జున్‌రెడ్డిపై ఐపీసీలోని 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నాగర్‌కర్నూల్ ఎస్పీతో పాటు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. -
నాన్నను చూసే లాఠీ పట్టా...
సాక్షి ప్రతినిధి, విజయనగరం : వారిది పోలీస్ కుటుంబం... తండ్రి ఉన్నతాధికారి కావడంతో చిరు ప్రాయం నుంచి ఖాకీ దుస్తుల మధ్య పెరిగారు... లాఠీలతో ఆడుకున్నారు... పెరిగి పెద్దయ్యాక ఇటు సోదరుడు... అటు భర్త కూడా అదే శాఖలో ఉన్నత స్థానాల్లో ఉండటంతో సమాజంలో ఆ విభాగానికి ఉన్న గుర్తింపు ఏమిటో తెలుసుకున్నారు. దాని ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేయగలమని గుర్తించారు. అదే ఆమెలో పోలీస్ అధికారి కావాలన్న కోరికకు ప్రేరణగా నిలిచాయి. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. అసాధారణమైన గ్రేహౌండ్స్ కమాండంట్‌గా రాటుదేలారు. ఇప్పుడు పార్వతీపురం ఏఎస్పీగా కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆమే దీపికా ఎం పాటిల్. ఆంధ్రాలో పుట్టి ఝార్ఖండ్‌లో స్థిరపడిన తెలుగు పోలీస్ కుటుంబానికి చెందిన ఆమెతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి: దీపిక ఎం పాటిల్. మీ పేరులోనే వైవిధ్యం కనిపిస్తోంది? దీపిక: మా నాన్న మండవ విష్ణు వర్ధన్.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సమీపంలోని కృష్ణా జి ల్లా ఆమదాలలంక గ్రామంలో పుట్టారు. నాన్నవాళ్లది వ్యవసాయ కుటుంబం. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌ల మీదే ఆధారపడి చదువుకుని ఐపీఎస్ సాధించారు. నా భర్త విక్రాంత్ పాటిల్ 2012 తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం విజయనగరం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. మాది ప్రేమ వివాహం. నాన్న ఇచ్చిన ఇంటిపేరును అలానేఉంచేసి దాని పక్కన నా భర్త ఇంటిపేరుని చేర్చుకున్నాను. అందుకే దీపిక ఎం పాటిల్‌గా స్థిరపడ్డాను. సాక్షి: బాల్యం, విద్య, కుటుంబ విశేషాలు? దీపిక: మాది పోలీసు కుటుంబం. నాన్న ఆంధ్రాలో పుట్టినప్పటికీ వృత్తిరీత్యా ఝార్ఖండ్‌లో స్థిరపడటంతో అక్కడే నా బాల్యం ప్రారంభమయ్యింది. నాన్నకు ఏటా బదిలీ అవుతుండటంతో తరచూ మేము కూడా ఆయనతో పాటు అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఝార్ఖండ్‌లో ప్రారంభమైన విద్యాభ్యాసం నాన్న బదిలీ ప్రాంతాల్లో కొనసాగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు 13 స్కూళ్లు మారాల్సివచ్చింది. రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. సాక్షి: ఆంధ్రాలో గ్రేహౌండ్స్ కమాండర్‌గా ఎలా మారారు? దీపిక: మా అమ్మానాన్న నన్ను ఎంతో క్రమ శిక్షణతో పెంచారు. నాన్న ఉద్యోగ విధుల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ అమ్మ పోస్టు గ్రాడ్యూయేట్ కావడంతో నన్ను బాగా చదివించేది. ఆడపిల్లలంటే కేవలం పెళ్లి వస్తువుగా నేటి సమాజం చూస్తోంది. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని భావించేవాళ్లే ఎక్కువ. కానీ మా ఇంట్లో ఆ పరిస్థితి లేదు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే భావనతో నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. 2013లో సివిల్స్ రాశాను. మొదటి ప్రయత్నంలోనే 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యాను. గ్రేçహౌండ్స్ కమాండర్‌గా మొదటి సారిగా పనిచేసే అవకాశం లభిం చింది. నాన్న, అన్నయ్య, భర్త ఐపీఎస్‌లే కాబట్టి పోలీసుల విధులు ఏ విధంగా ఉంటాయి, సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారో దగ్గరగా చూసేదాన్ని కాబట్టి గ్రేహౌండ్స్ కమాండర్‌గా పెద్ద కష్టమేమీ అనిపించలేదు. నాన్న ఆంధ్రాలో జన్మించారు కాబట్టి ఆంధ్రాలో పనిచేయాలనుకునేవారు. ఆయన కోరిక నా ద్వారా తీరింది. సాక్షి: చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారు? దీపిక: నేటి యువత శక్తివంతమైనది. యువత సాధించలేనిది ఏదీ లేదు. క్షణికావేశంలో తప్పటడుగులు వేస్తూ తప్పుడు నిర్ణయాలతో తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారే తప్ప భావిభారతావనికి అవసరమైన పౌరులుగా తయారు కావడం లేదు. దేశం మనకేమిచ్చింది అనే కంటే దేశం కోసం మనం ఏం చేశామని ఆలోచించే వారు చాలా తక్కువ. దేశం గర్వించదగ్గ పౌరులుగా యువత తయారు కావాలి. సాక్షి: ఐపీఎస్‌ను ఏరికోరి పెళ్లిచేసుకోవడానికి కారణం? దీపిక: అన్నయ్య హర్షవర్ధన్, విక్రాంత్ పాటిల్ మంచి స్నేహితులు. తరచూ అన్నయ్యతో కలసి ఆయన రావడంతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇరువురి ఇష్టాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు మా వివాహం జరిపించారు. సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలకు సేవచేసే భాగ్యంతో పాటు వ్యవస్థను అదుపులో ఉంచే అధికారం కూడా మనకు ఉంటుందని నాన్న తరచూ చెబుతుండేవారు. నాన్న చెప్పిన మంచి మాటలు, ప్రజలకు పోలీసు వ్యవస్థ ద్వారా ఆయన చేస్తున్న సేవలు చూసి ఐపీఎస్ అంటే ఇష్టం ఏర్పడింది. సాక్షి: సరదాలు, సంతోషాలు? దీపిక: చిన్నప్పుడు అమ్మా, నాన్న ఆట విడుపుకోసం గుర్రపు స్వారీకి నన్ను తీసుకెళ్లేవారు. అది అలవాటుగా మారింది. గుర్రపు స్వారీ చేయడం ఎంతో ఇష్టం. స్విమ్మింగ్, టెన్నిస్ ఆడడం కూడా ఇష్టం. అలాగే పెయింటింగ్స్ వేయడం, మంచి పుస్తకాలను చదవడం అలవాటు. జంక్ఫుడ్స్, పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీం వంటివి ఎక్కువగా తింటుంటాను. చాక్లైట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం. పింక్ కలర్ ఇష్టం. ఆ రంగు దుస్తులు మహిళలకు ఎక్కువ అందాన్నిస్తాయి. చిన్నతనంలో సినిమాలు చూసేదాన్ని, కానీ సినిమాల్లో ప్రజలకు ఉపయోగకరమైన అంశాలకంటే అనవసరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని చూసి యువత చెడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఒకటి , రెండు తప్ప మిగతా సినిమాలన్నీ కామెడీ, ద్వంద్వ అర్థాలతో ఉన్న సినిమాలే కాబట్టి చూడాలనిపించడం లేదు. -
ఏఎస్పి ఎట్ ఎల్బ్రస్!
ఆమె లక్ష్యం ముందు ‘ఆడదానివి నువ్వేం చేస్తావ్’ అంటూ చిన్నబుచ్చే మాటలు చిన్నబోయాయ్. ‘ఆడపిల్లవి... నీకు పర్వతారోహణలెందుకు లేమ్మా... చక్కగా ఉద్యోగం చేసుకో’’ అనే తరహా మాటలు ఆమె పట్టుదల ఎదుట తడారిపోయాయ్. ఆమే చిత్తూరు జిల్లా ఏఎస్పీ జీఆర్ రాధిక. వృత్తి జీవితమైనా, వ్యక్తిగతమైనా వందశాతం శక్తియుక్తులని వెచ్చించడమే ఆమె విజయరహస్యం. లక్ష్యం చేరుకోవడం ఆలస్యం కావొచ్చు... ప్రయత్నమంటూ చేస్తూ ఉంటేనే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని చెబుతారు చిత్తూరు ఏఎస్పీ రాధిక. ఆమెది కడప. తండ్రి కాలేజీ అధ్యాపకుడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకే. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే. స్నేహితులతో కలిసి చిన్నప్పుడు సెలవుల్లో చుట్టుపక్కల కొండల్నీ గుట్టల్నీ ఎక్కడం ఆమెకు ఇష్టం. ఇదే ఇప్పుడు అభిరుచి అయింది. ‘రాళ్లూ రప్పల్లో ఏముంటాయ్ నీ పిచ్చిగానీ..’ అనే వాళ్లు చుట్టుపక్కల వాళ్లు. చిన్నగా నవ్వి వాటిని వదిలేసేదాన్ని’’ అని చెబుతారు ఏఎస్పీ రాధిక. ఇంగ్లిష్‌లో పీజీ పూర్తిచేసి కొంతకాలం అధ్యాపకురాలిగా పని చేశారు. అప్పట్లోనే అనంతపురానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డితో పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. భర్త వ్యాపారరీత్యా అనంతపురంలో ఉంటారు. అప్పుడే ఆమెకు ఐపీఎస్‌పై ఆసక్తి పెరిగింది. విజయం తృటిలో చేజారింది. నిరాశ చెందలేదు. పట్టువీడలేదు. పోలీసుశాఖలోకి వెళ్లే ఇతర అవకాశాలపై దృష్టిసారించారు. గ్రూప్‌వన్ పరీక్ష రాసి 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. గ్రేహౌండ్స్‌లో కొన్నాళ్లు పనిచేశారు. తరువాత నెల్లూరు పట్టణ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్‌తోపాటు హైదరాబాద్‌లోని అప్పాలో సేవలందించారు. అనంతరం పదోన్నతిపై ఆదిలాబాద్ ఏఎస్పీగా, తరువాత చిత్తూరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. పోలీసులకు పర్వతారోహణ... కెరీర్తోపాటూ ఆమె పర్వతారోహణ ఆసక్తీ అంతకంతకూ పెరుగుతోంది. ఐదేళ్ల కిందట మానససరోవర్ యాత్రకు వెళ్లారు. అక్కడ రాధికతోపాటు వచ్చిన వారందరూ గుర్రాలెక్కినా ఈమె మాత్రం కాలినడకతోనే 5100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆమెతోపాటు పెరుగుతూ వచ్చిన పర్వతారోహణ ఆసక్తికి తగ్గట్టు అప్పుడే ఓ గొప్ప అవకాశం దొరికింది. ఆమెతోపాటు నడుచుకుంటూ వచ్చిన ముంబైకి చెందిన దీప్తి పర్వతారోహణ గురించి.. దానికి ఇచ్చే ట్రైనింగ్ గురించి వివరించింది. దీంతోపాటు నాటి అడిషనల్ డీజీపీ పోలీసు అధికారుల కోసం ప్రత్యేక పర్వతారోహణ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపారు రాధిక. ఆమె ప్రతిభను డీజీపీ రాజీవ్ త్రివేది ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ వింటర్ స్పోర్ట్స్ సంస్థలో శిక్షణకు పంపారు. శిక్షణ అందుకున్నాక తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. హిమాలయాల్లోని జన్స్కార్ రేంజ్లో ఉన్న 5380 అడుగులున్న గోలెస్కాగ్రి పర్వతాన్ని వారంరోజుల్లో అధిరోహించారు. ‘ఆ పర్వతారోహణే నాపై నాకు నమ్మకం కుదిర్చింది’ అంటారు రాధిక. కున్ సైతం తలవంచింది. అదే ఉత్సాహంతో 7077 మీటర్ల ఎత్తున్న కున్ పర్వతారోహణకు వెళ్లాలనుకున్నారు. ‘ఎంత పోలీసైనా ఇద్దరు పిల్లలున్న ఆడవాళ్లకు సాధ్యమా’ అన్నారు చుట్టుపక్కలవారంతా. ఎప్పటిలాగే ఓ చిరునవ్వు విసిరి, పట్టించుకోకుండా వదిలేశారు. పట్టువిడవకుండా అధిరోహణకు కావాల్సిన వ్యాయామాలు చేయడం మొదలు పెట్టారు. విపరీతమైన గాలులు, సున్నాకంటే తక్కువ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, మామూలు కంటే సగం పడిపోయిన ప్రాణవాయువు.. సహచరులందరూ మధ్యలోనే చేతులెత్తేస్తున్నారు.. ఇవేమీ ఆమె పట్టుదలను ఆపలేకపోయాయి. కనీసం సవాల్ విసరలేకపోయాయి. ఆమె మాత్రం శిఖరాగ్రానికి చేరుకున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి ఆ ఘనతను అందుకున్న తొలిమహిళగా రికార్డును నెలకొల్పారు. ప్రపంచంలోని అన్ని పర్వతాలను ఎక్కాలనుంది.. ఎవరెస్ట్ ముగిసింది.. వాట్ నెక్ట్స్ అనే కొశ్చన్. తరువాత యూరప్, రష్యాలోని అతిపెద్ద శిఖరమైన ఎల్బ్రస్. లక్ష్యం అదే. దాని కోసం మరింత కష్టపడింది. మొత్తం 15 మంది సిబ్బందితో ప్రయాణం మొదలు. మొదట రష్యా చేరుకుంది. శిఖరం ఉత్తరం వైపు నుంచి అనుమతి లేదంది ప్రభుత్వం. దక్షిణం వైపు నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా పర్వతాన్ని అధిరోహించలేదని చాలామంది చెప్పారామెకు. కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయినా ఆమె తల వంచలేదు. అనుకున్నది సాధించింది. ఈ సెప్టెంబర్ 8న ఎల్బ్రస్పై భారత పతాకం రెపరెపలాడించింది. ఆమె ధైర్యానికి ఎవరెస్ట్ దాసోహమంది! కున్ పర్వతారోహణ తరువాత ఎవరెస్టే తన లక్ష్యంగా పెట్టుకున్నారు రాధిక. మొదట్లో సొంత ఖర్చులతో పర్వతారోహణకు వెళ్లేవారు రాధిక. తరువాత ఆమె పట్టుదల, కృషి చూసి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఆ సాయంతోనే ఎవరెస్ట్ ప్రయాణం మొదలు పెట్టారామె. తొలుత నేపాల్ రాజధాని కాఠ్మాండూకు వెళ్లారు. అక్కడ భూకంపం రావడంతో పర్వతారోహణకు రెండు రోజుల పాటు అనుమతించలేదు. ఆ తరువాత టిబెట్‌లోని లాసా మీదుగా చైనాలోని తొలి బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అక్కడ చైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎలాగోలా అనుమతి సాధించుకున్నాక 8850 అడుగుల ఎవరెస్ట్‌ను గత సంవత్సరం మే 20న అధిరోహించారు. సుమారు 36 రోజులు పట్టింది ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకునేందుకు. యాత్రలో అడుగడుగునా ప్రతికూల వాతావరణం. రోజుల తరబడి మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చేది. అడుగడుగునా తీవ్రగాలులతో పోరాడాల్సి వచ్చేది. - గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు -
సాహసికులకు సన్మానం
దొరికిన కిడ్నాపర్లు .. ప్రజల సహకారంతో పట్టివేత రూ.50 లక్షల కోసం వివాహిత కిడ్నాప్ కాకినాడ క్రైం : రూ.50 లక్షల కోసం వివాహితను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నిందితులను విజువల్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజా సహకారంతో పట్టుకున్నట్టు జిల్లా ఏఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్ష¯ŒSలో మంగళవారం పోలీస్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్‌కి పాల్పడిన నిందితుల వివరాలను వెల్లడించారు. కాకినాడ వెంకటరత్నపురానికి చెందిన భార్యభర్తలు కాలే వీరవెంకట సత్యనారాయణసాయి, కాలే ధరలక్ష్మి యాక్ట్ ఫార్వార్డర్స్ షిప్పింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. దీనికి సీఈఓగా ఉన్న ధనలక్ష్మి.. రంగయ్యనాయుడు వీధిలో ఉన్న ఆఫీసు కెళ్లేందుకు సోమవారం సాయంత్రం 5 గంటలకు మహేంద్ర వెరిటో కారులో డ్రైవర్ ఆరుగుల సుబ్బారావు (దయ)తో బయలుదేరారు. కారు కల్పనా థియేటర్ వద్దకొచ్చేసరికి డ్రైవర్ కారు ఆపడంతో పెండ్యాల బాబూరావు, విశ్వనాథరాజు కారులోకి జొరబడ్డారు. ధనలక్ష్మి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, అరిస్తే చంపేస్తామంటూ కత్తులతో బెదిరించారు. విషయాన్ని గమనించిన... దేవి మల్టీఫెక్స్ థియేటర్ సమీపాన చిలుకూరి టవర్స్‌లో ఉంటున్న కాటూరి విజయ్‌కుమార్ ఈ విషయాన్ని గమనించాడు. కారు పోర్టు మీదుగా బీచ్ గుండా ఉప్పాడ వైపు వెళ్లడంతో వెంబడించాడు. కిడ్నాప్ సమాచారాన్ని 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కిడ్నాప్‌పై అలర్ట్ అయిన పోలీసులు తిమ్మాపురం, ఉప్పాడ కొత్తపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు ఉప్పాడ సెంటర్‌కి చేరుకోగానే విజువల్ పోలీస్ వ్యవస్థ డ్యూటీలో ఉన్న కొత్తపల్లి స్టేష¯ŒS ఏఎస్సై లోవరాజు ఆపడానికి యత్నించగా కారును వేగంగా పోనిచ్చారు. ఈ విషయాన్ని కోనపాపపేట గ్రామస్తులకు తెలియజేయడంతో వారు బీచ్‌రోడ్డులో రోడ్డుకి అడ్డంగా లారీని పెట్టడంతో కిడ్నాపర్లు దొరికిపోయారు. కారు డ్రైవర్ దయ పరార్ కాగా, ఇద్దరు నిందితులను వారు పోలీసులకు అప్పగించినట్టు ఏఎస్పీ దామోదర్ తెలిపారు.