
నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లిస్తామని చెప్పినా... సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) అధినేత చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో పొత్తుకు సిద్ధమేనన్న ఆజాద్, బీజేపీని ఓడించడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా అఖిలేష్ యాదవ్‌ను కలిసింది నిజమేనని, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వంద సీట్లిచ్చినా ఎస్పీతో పొత్తు కుదుర్చుకోబోమన్నారు. అది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.
తమకు మద్దతిస్తామని చెబుతూనే ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏఎస్పీకి కేవలం రెండు సీట్లు ఆఫర్ చేశారని, ఆయన ఎగతాళి చేస్తున్నాడో, మద్దతు ఇస్తున్నాడో న్యాయ విద్యార్థి అయిన తనకు అర్థమవుతోందని అన్నారు.
చదవండి: (కాక రేపుతున్న యూపీ ఎన్నికలు.. బీజేపీ ఎమ్మెల్యేకు అఖిలేష్ బంపర్ ఆఫర్)