Breadcrumb
- HOME
UP Elections Live Updates: యూపీలో అయిదో దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్..
Published Sun, Feb 27 2022 6:55 AM | Last Updated on Sun, Feb 27 2022 12:06 PM
Live Updates
యూపీ: ముగిసిన ఐదో దశ పోలింగ్
యూపీ: ముగిసిన ఐదో దశ పోలింగ్.. 53.98 శాతం పోలింగ్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఇప్పటికే క్యూలైన్లలో ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
యూపీ: మధ్యాహ్నం 3గంటల వరకు 46.28 శాతం పోలింగ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంట వరకు 46.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
యూపీ: కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ ప్రయాగ్ రాజ్‌లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
యూపీ: మధ్యాహ్నం 1 గంట వరకు 34.83 శాతం పోలింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.83 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో నిల్చున్నారు.
బస్తీలో ర్యాలీకి హాజరైన ప్రధాని మోదీ
యూపీలోని బస్తీలో జరిగిన ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై ప్రసంగించారు.
Tremendous enthusiasm across Uttar Pradesh. Addressing a massive rally in Basti. https://t.co/6waFgoDcyg
— Narendra Modi (@narendramodi) February 27, 2022
ఎస్పీ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి
యూపీలోని కుందాలో తమ అభ్యర్థి గుల్షన్ యాదవ్ కాన్వాయ్‌పై దాడి జరిగిందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. అయితే పోలీసులు మాత్రం.. ప్రస్తుతం అక్కడ అంతా బాగానే ఉందని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
బీజేపీ ఓటమినే ప్రజలు కోరుకుంటున్నారు: కాంగ్రెస్ నేత పునియా
కాంగ్రెస్ నేత పీఎల్ పునియా ఆదివారం యూపీలోని బారాబంకిలో పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'బీజేపీ బలహీనపడి ఓడిపోతోందని భావిస్తోంది. అందుకే, ప్రధానమంత్రి నుంచి హోంమంత్రి, తమ జాతీయ అధ్యక్షుడిని అందరినీ ప్రచారానికి తీసుకొచ్చి గెలవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు బీజేపీని ఓడించాలని నిర్ణయించుకున్నారు' అని కాంగ్రెస్ నేత పూనియా అన్నారు.
యూపీలో 11 గంటల వరకు 21.39 శాతం ఓటింగ్
యూపీ ఐదో దశ పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 21.39 శాతం ఓటింగ్ నమోదైంది.
ఓటేసిన డిప్యూటీ సీఎం కేపీ మౌర్య
ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేయాలని, ఓటింగ్ శాతం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల్లో 300+ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం' అని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన సీరతు నుంచి పోటీ చేస్తున్నారు.
Uttar Pradesh Deputy CM Keshav Prasad Maurya casts his vote at a polling booth in Prayagraj. He is contesting from Sirathu.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 27, 2022
"I appeal to the people to vote in as many numbers as possible. We will secure 300+ seats and form govt." he says pic.twitter.com/NDU9qu5TAo
9 గంటల వరకు 8.02 శాతం ఓటింగ్
యూపీ ఐదో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు 8.02 శాతం ఓటింగ్ నమోదైంది.
ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన
ఐదో దశ యూపీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లందరినీ ప్రధాని మోదీ కోరారు. 'ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో ఐదవ దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాను' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
उत्तर प्रदेश में लोकतंत्र के उत्सव का आज पांचवां चरण है। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे अपने मताधिकार का प्रयोग करें और अपना कीमती वोट अवश्य दें।
— Narendra Modi (@narendramodi) February 27, 2022
ఓటేసిన బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి..
ప్రయాగరాజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి ఆదివారం జరిగిన యూపీ ఐదో దశ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'ఈ దశలో మాకు 70 శాతం ఓటర్ల మద్దతు ఉంది. మొత్తంగా 300 పైచిలుకు స్థానాలు గెలుచుకుని మరో అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఎంపీ రీటా బహుగుణ జోషి అన్నారు.
యూపీ అయిదో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అయిదో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రామ జన్మభూమి అయోధ్య సహా 61 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరుగుతూ ఉండడంతో భారతీయ జనతా పార్టీ హిందుత్వ కార్డుపైనే ఆశలు పెట్టుకుంది. ఈ దశలోనే 2.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
దళితులు, ముస్లింలే నిర్ణయాత్మక శక్తి
మరోవైపు ఈ సారి ఎన్నికలు జరిగే జిల్లాలైన అమేథి, రాయ్‌బరేలి, సుల్తాన్పూర్, చిత్రకూట్, ప్రతాప్‌గఢ్, కౌశంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, అయోధ్య, బహరిచ్, స్రవస్తి, గోండా నియోజకవర్గాల్లో బీజేపీ తీవ్రమైన అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దానిని తమకి అనుకూలంగా మలచుకోవడానికి ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు ప్రయత్నిస్తున్నాయి. మాయావతికి చెందిన బీఎస్పీ పెద్దగా ప్రచారం చేయనప్పటికీ ఒకప్పుడు దళితులు, ముస్లింలే నిర్ణయాత్మక శక్తిగా మారడంతో ఎవరి విజయావకాశాలనైనా ఆ పార్టీ దెబ్బ కొట్టే అవకాశాలున్నాయి. మొత్తం 88 మంది ముస్లిం అభ్యర్థుల్ని బీఎస్పీ రంగంలోకి దింపడంతో ఓట్లు చీలిపోయి చివరికి తమకే లాభం చేకూరుతోందని బీజేపీ నమ్ముతోంది.
సిరాథూ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు మంత్రులు సిద్ధార్థ్ నాథ్ సింగ్, నందగోపాల్ గుప్తా, రామపతి శాస్త్రిలు ఎన్నికల బరిలో ఉన్నారు. పశ్చిమ యూపీలో రైతు ఆందోళనలు బీజేపీని ఇరకాటంలో నెట్టేస్తే, అయిదో దశలో పశువులు ఇష్టారాజ్యంగా పొలాల్లోకి వచ్చి పంటల్ని నాశనం చేయడం అధికార పార్టీకి వ్యతిరేకంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ విస్తృతంగా ప్రచారం చేశాయి.
అన్ని పార్టీలకూ కీలకమే
ఈ దఫా ఎన్నికలు పూర్వాంచల్ ప్రాంతంలో జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీలకూ కీలకంగా మారింది. పోలింగ్ జరగనున్న 12 జిల్లాల్లో అమేథి, రాయ్‌బరేలి కూడా ఉండడంతో కాంగ్రెస్‌కి కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్‌లో కాస్తయినా పట్టు సాధించాలంటే ఈ జిల్లాల్లో తిరిగి గెలవడం ఆ పార్టీకి అత్యంత అవసరం. ఒకప్పడు కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో క్రమంగా ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పునర్వైభవం సాధించడానికి ఈ సారి ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లోనూ గణనీయమైన పురోగతి ప్రదర్శించాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది.
అధికార వ్యతిరేకతను పోగొట్టుకోవడానికే..
గత ఏడాదిగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరచూ అయోధ్య పర్యటనకు వెళుతూ స్వయంగా రామ మందిర నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. దీపావళి రోజు అట్టహాసంగా దీపోత్సవ్ నిర్వహించి హిందు ఓటర్లను ఆకర్షించారు. ప్రభుత్వంపై ఉన్న అధికార వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి రామమందిర నిర్మాణాన్ని ప్రధాన అస్త్రంగా మలచుకుంది.
అయోధ్య రాముడిపైనే బీజేపీ ఆశలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అభివృద్ధి ఎజెండాతో అధికార భారతీయ జనతా పార్టీ అయిదో దశ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తే , సమాజ్‌వాదీ పార్టీ పౌరహక్కులు, మెరుగైన రహదారులు, ఉచిత విద్యుత్ వంటి అంశాలతో పోటీగా ప్రచారం నిర్వహించింది. గత కొద్ది నెలలుగా బీజేపీ ఈ దఫా ఎన్నికల ప్రచారాన్ని అయోధ్యలోనే కేంద్రీకృతం చేసింది. 2020లో రామ మందిర నిర్మాణాన్ని మొదలు పెట్టినప్పట్నుంచి ఆరెస్సెస్ కూడా ప్రచార బరిలోకి దిగింది. క్షేత్రస్థాయిలో ఆరెస్సెస్ సభ్యులు బీజేపీకి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు.
యూపీ అయిదో దశ ఎన్నికలకు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అయిదో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రామ జన్మభూమి అయోధ్య సహా 61 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరుగుతూ ఉండడంతో భారతీయ జనతా పార్టీ హిందుత్వ కార్డుపైనే ఆశలు పెట్టుకుంది. ఈ దశలోనే 2.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Related News By Category
Related News By Tags
-
Live Blog: ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్
-
Assembly Election 2022: ముగిసిన యూపీ మూడో దశ పోలింగ్
-
ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ ఎన్నికల పోలింగ్
-
కులం, మతం పేరుతో ఇంకెన్ని రోజులు రెచ్చగొడతారు.. ప్రియాంక ఫైర్
లక్నో: యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్...
-
బీజేపీకి అగ్ని పరీక్ష.. ఆ రెండు దశల్లో ఎస్పీ కూటమికే స్వల్ప ఆధిక్యం
లక్నో (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు కంచర్ల యాదగిరి రెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటకలో ...
Comments
Please login to add a commentAdd a comment