Fifth Phase polling
-
Odisha Assembly Elections 2024: బీజేపీకి సవాల్
ఒడిశాలో రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుండగా నాలుగింటికి 13న పోలింగ్ ముగిసింది. ఈ నెల 20న రెండో విడతలో ఐదు లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఐదు లోక్‌సభ స్థానాల్లో మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లే కావడం విశేషం. ఆ పారీ్టకి గట్టి మద్దతున్న ఈ స్థానాల్లో అధికార బీజేడీ నుంచి సవాలు ఎదురవుతోంది... బోలంగీర్ రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొన్న స్థానమిది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, రాజ వంశీకురాలు సంగీతా సింగ్‌దేవ్ బరిలో ఉన్నారు. బీజేడీ గత అభ్యర్థి కల్కేశ్ నారాయణ్ సింగ్‌దేవ్ స్థానంలో సురేంద్ర సింగ్ భోయ్‌ని పోటీకి దింపింది. కాంగ్రెస్ నుంచి మనోజ్ మిశ్రా పోటీలో ఉన్నారు. ఇక్కడ సంగీత నాలుగుసార్లు గెలిచారు. ఆమె భర్త కనకవర్ధన్ సింగ్‌దేవ్ పాటా్నగఢ్–బోలంగీర్ మహరాజు రాజ్రాజ్ సింగ్‌దేవ్ కుమారుడు. ఒడిశా బీజేపీ చీఫ్‌గా, రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. కరువు బాధిత జిల్లా అయిన బోలంగీర్ నుంచి ఏటా 30 వేల మందికి పైగా ఉపాధి కోసం వలస పోతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేడీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ రెండు చోట్ల, బీజేపీ ఒక్క స్థానంలో గెలిచాయి.సుందర్‌గఢ్ ఒడిశాలో కీలక లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ బీజేపీదే హవా. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ జుయల్ ఓరం మళ్లీ బరిలో ఉన్నారు. 1998 నుంచి ఇక్కడ ఆయన ఐదుసార్లు గెలవడం విశేషం. 2009 ఎన్నికల్లో మాత్రం ఓరంపై కాంగ్రెస్ నేత హేమానంద బిశ్వాస్ విజయం సాధించారు. అధికార బీజేడీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు! రాష్ట్రంలో ఆ పార్టీ ఇప్పటిదాకా నెగ్గని ఏకైక స్థానమిది. గత మూడుసార్లుగా అభ్యర్థులను మారుస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఈసారి భారత హాకీ జట్టు మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీని బీజేడీ మరోసారి బరిలో దింపింది. 2014లో ఆయన 18 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఈ గిరిజన ప్రాబల్య నియోజకవర్గంలో బీజేపీని ఓడించడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం ఏర్పాటు, టిర్కీ ఆదరణ కలిసొచ్చి ఈసారి గట్టెక్కుతామని బీజేడీ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ దెహూరీ పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మూడు బీజేపీ చేతిలో ఉన్నాయి. రెండింట బీజేడీ, కాంగ్రెస్, సీపీఎం చెరో చోట గెలిచాయి.కందమాల్ ఈ స్థానం బీజేడీ కంచుకోట. కందమాల్, బౌద్ జిల్లాలు మొత్తం దీని పరిధిలోకే వస్తాయి. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ విద్యావేత్త అచ్యుతానంద సామంత బరిలో ఉన్నారు. బీజేపీ ప్రతిసారీ కొత్త అభ్యరి్థని నిలుపుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈసారి సుకాంత కుమార్ పాణిగ్రాహికి టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అమీర్‌చంద్ నాయక్ పోటీలో ఉన్నా పోటీ బీజేపీ, బీజేడీ మధ్యే ఉంది. సామంతకు విద్యా, దాతృత్వ కార్యక్రమాలు గట్టి దన్ను. కాగా తాగు, సాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి తదితర అంశాలను పాణిగ్రాహి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేశారు.బార్గఢ్ 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో విజయం పారీ్టల చేతులు మారుతూ వస్తోంది. 2009లో కాంగ్రెస్ నేత సంయజ్ భోయ్ గెలవగా, 2014లో బీజేడీకి చెందిన డాక్టర్ ప్రవాస్ కుమార్ సింగ్ విజయం సాధించారు. 2019లో బీజేపీని విజయం వరించింది. బీజేడీ సీనియర్ నేత ప్రసన్న ఆచార్యను బీజేపీ నేత సురేశ్ పూజారి ఓడించారు. ఈసారి ఆయనకు బదులు ప్రదీప్ పురోహిత్‌కు బీజేపీ టికెటిచి్చంది. పూజారిని అసెంబ్లీ ఎన్నికల్లో మోహరించింది. బీజేడీ కూడా పరిణీత మిశ్రాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సంజయ్ భోయ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేడీ ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా గళం వినిపించే ప్రదీప్‌కు స్థానికంగా మంచి పేరుంది. మోదీ సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.అస్కా బీజేడీకి కంచుకోట. సీఎం నవీన్ పటా్నయక్‌కు ప్రతిష్టాత్మక లోక్‌సభ స్థానం. ఆయన పోటీ చేస్తున్న హింజిలి అసెంబ్లీ స్థానం దీని పరిధిలోనే ఉంది. తండ్రి బిజూ పటా్నయక్ మరణానంతరం 1997 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అస్కా నుంచే నవీన్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998, 1999 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేశారు. ఇక్కడ ఏ అభ్యర్థినీ రెండోసారి నవీన్ కొనసాగించకపోవడం గమనార్హం. బీజేడీ నుంచి 2019లో ప్రమీలా బిసోయ్ గెలిచారు. ఈసారి ఆమెను కాదని 33 ఏళ్ల రంజితా సాహుకు బీజేడీ టికెట్ దక్కింది. ఆమె వలస కారి్మకుల కోసం ‘కొడాల యూత్ ఫోరం’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. సామాన్యుల్లో ఆమెకున్న గుర్తింపు చూసే సీఎం టికెటిచ్చారు. బీజేపీ నుంచి మరోసారి అనితా శుభదర్శిని పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి రామకృష్ణ పటా్నయక్ మాజీ మంత్రి. బిజూ, నవీన్ పట్నాయక్‌లకు అత్యంత సన్నిహితుడు. గంజాం జిల్లాలో ఆయనకు మంచి పేరుంది.ముగ్గురిలో ఒకరిపై కేసు ఒడిశాలో రెండో విడతలో పోలింగ్ జరిగే ఐదు లోక్‌సభ స్థానాల్లో 40 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 13 మంది కోటీశ్వరులే. సంగీతా కుమారి రూ.67.3 కోట్లతో జాబితాలో టాప్‌లో ఉన్నారు. 12 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 8 మంది తీవ్ర నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 21 మంది గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యావంతులని ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
యూపీలో అయిదో దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
ముగిసిన ఐదో దశ పోలింగ్
-
‘ఐదో విడత’లోనూ హింస
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం హింసాత్మకంగా ముగిసింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పోలింగ్ కేంద్రం లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరగా, పశ్చిమబెంగాల్లో అధికారణ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.5 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. 8.75 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని వెల్లడించింది. ఐదో విడత పోలింగ్‌లో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో నిలవగా, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. ఈ జాబితాలో జమ్మూకశ్మీర్ చిట్టచివరి స్థానంలో నిలిచినట్లు ఈసీ చెప్పింది. తృణమూల్ నేతపై బలగాల దాడి.. ఐదో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో సోమవారం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బర్రాక్పోర్ సీటు నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు యత్నించగా, కేంద్ర బలగాలను ఆయన్ను అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అర్జున్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలను స్వేచ్ఛగా ఓటేయనివ్వడం లేదని ఆరోపించారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను పోలీసులు అడ్డుకోవడం లేదని విమర్శించారు. బర్రాక్‌పోర్‌లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బన్గావ్ నియోజకవర్గంలో టీఎంసీ, బీజేపీ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు బాంబులు విసురుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బలిటికురి లోక్‌సభ స్థానంలో టీఎంసీ అభ్యర్థి, భారత ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు ప్రసూన్ బందోపాధ్యాయ పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించేందుకు యత్నించడంతో సాయుధ సిబ్బంది ఆయనపై చేయిచేసుకున్నారు. ప్రజల ఓట్లను బలవంతంగా వేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో ఓ ప్రిసైడింగ్ అధికారిని ఈసీ విధులనుంచి తప్పించింది. పోలింగ్ కేంద్రం పేల్చివేత.. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ సీటుకు ఎన్నికల సందర్భంగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలోని రహ్మూ పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ విసిరారు. అలాగే త్రాల్‌లోని మరో పోలింగ్ కేంద్రాన్ని పేల్చివేశారు. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనీ, ఎవ్వరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఎన్నికల్లో లడఖ్ నియోజకవర్గంలో 71.10 శాతం పోలింగ్ నమోదుకాగా, ఎన్నికలను బహిష్కరించాలని ఉగ్రవాదులు, వేర్పాటువాదులు హెచ్చరించిన నేపథ్యంలో అనంతనాగ్‌లోని పుల్వామా, షోపియాన్ ప్రాంతాల్లో పోలింగ్ 3 శాతాన్ని దాటలేదు. దీంతో అనంతనాగ్‌లో మూడుదశల్లో కలిపి పోలింగ్ 8.76 శాతానికే పరిమితమయింది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ గ్రామం షరీఫాబాద్లో ఎవ్వరూ ఓటేయలేదు. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలికొన్న ఆత్మాహుతి బాంబర్ ఆదిల్‌దార్ గ్రామమైన గుండీబాగ్లో 350 మంది ప్రజలుండగా కేవలం 15 మందే ఓటేశారు. ఉగ్రవాదులు జకీర్ ముసా గ్రామమైన నూరాబాద్, రియాజ్ నైకూ స్వగ్రామం బైగ్పొరా, ‘పుల్వామా’ సూత్రధారి ముదస్సీర్ ఖాన్ ఊరు షేక్‌పొరాలో సున్నా పోలింగ్ నమోదైంది. మరోవైపు ప్రాణభయంతో కశ్మీర్‌ను విడిచిపెట్టి పారిపోయిన పలువురు కశ్మీరీ పండిట్లు సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాహుల్ బూత్ క్యాప్చరింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడేలా పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా అమేథీకి చెందిన ఓ వృద్ధురాలు ‘నేను కమలం(బీజేపీ) గుర్తుకు ఓటేయబోతే, బలవంతంగా హస్తం(కాంగ్రెస్) గుర్తుకు వేయించారు’ అని చెబుతున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల ప్రధానాధికారి.. ‘ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపాం. ఆ వృద్ధురాలు చేసిన ఆరోపణలు నిరాధారమని తేలింది’ అని స్పష్టం చేశారు. రాహుల్ యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమేథీలో 53 శాతం పోలింగ్ నమోదుకాగా, రాయ్‌బరేలీలో 53.68 శాతం పోలింగ్ నమోదయిందని ఈసీ తెలిపింది. అలాగే లక్నోలో 53% పోలింగ్ నమోదయిందని పేర్కొంది. బిహార్‌లో ఈవీఎం ధ్వంసం బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. బిహార్‌లోని సరన్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. సరన్‌లోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో, మధుబనీలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమయింది. సీతామర్హి, ముజఫర్‌పూర్ నియోజకవర్గాల్లో కూడా ఇదే సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఐదో విడత ఎన్నికలు ముగియడంతో మొత్తం 542 లోక్‌సభ స్థానాలకు గానూ 424 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఐదు విడతల్లో ఇదే అత్యల్ప పోలింగ్ కావడం గమనార్హం. తొలి విడతలో 69.50 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో 69.44 శాతం, మూడో విడతలో 68.40 శాతం, నాలుగో విడతలో 65.51 శాతం పోలింగ్ నమోదైంది. బిహార్ హాజీపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు -
పోలింగ్ స్కోర్.. 425/543
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా సోమవారం నాటికి ఐదు దశల పోలింగ్ పూర్తయింది. మొత్తం 543 నియోజకవర్గాలకు గాను 424 చోట్ల ఎన్నికలు ముగిశాయి. ఇంకా రెండు దశల్లో 118 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఇంతవరకు 21 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. 5 రాష్ట్రాల్లో పాక్షికంగా పూర్తయింది. నాలుగో దశలో సగటున 67% పోలింగ్, 5వ దశలో 62.56% ఓట్లు పోలయ్యాయి. ఐదు దశల్లో జరిగిన పోలింగ్ గణంకాలను పరిశీలిస్తే.. -
ఈసారి మహిళా అభ్యర్థులు ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, బిహార్ ప్రాంతాల్లోని 51 లోక్‌సభ సీట్లకు ఐదవ విడత పోలింగ్ జోరుగా సాగుతుంది. మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 12 శాతం మంది మహిళలు ఉండడం విశేషం. మొత్తం ఏడు విడతల్లో అతి తక్కువ సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతుండగా, ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతలకన్నా ఈ విడత పోలింగ్‌లో మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉండడం విశేషమని ఎన్నికల కమిషన్ వివరాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్ 11న జరిగిన తొలి విడత పోలింగ్‌లో 69 శాతం పోలింగ్, ఏప్రిల్ 18వ తేదీన జరిగిన రెండో విడత పోలింగ్‌లో 68 శాతం, ఏప్రిల్ 23న జరిగిన మూడో విడత పోలింగ్‌లో 66.04 శాతం, నాలుగో విడత పోలింగ్‌లో 64 శాతం పోలింగ్ నమోదయింది. బిహార్ సీతమరాహి, మధుబని, ముజఫర్‌పూర్, శరణ్, ఆజిపూర్ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఐదు సీట్లను ఎన్డీయేనే కైవసం చేసుకుంది. ఈ సారి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ, హిందుస్థానీ హవామ్ మోర్చా సెక్యులర్, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీలతో కూడిన మహా కూటమి పోటీ చేస్తోంది. జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తవగా, ఈ రోజు మూడవ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున గులామ్ అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున హస్నైన్ మసూది, బీజేపీ తరఫున సోఫి మొహమ్మద్ యూసఫ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మెహబూబా ముఫ్తీ విజయం సాధించారు. జార్ఖండ్ కోడెర్మా, రాంచి, కుంతీ, హజారీబాగ్–నాలుగు సీట్లకు ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ నాలుగు సీట్లకు బీజేపీయే ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒక్క హజారీబాగ్‌లో తప్పించి మూడు సీట్లలో బీజేపీ కొత్తవారినే పోటీకి దింపింది. మధ్యప్రదేశ్ బోతుల్, దమోహ్, హోషంగబాద్, ఖజూరహో, రేవా, సాత్నా, తికాంగఢ్ స్థానాలకు ఈ రోజు పోలింగ్. వీటిల్లో రేవా నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ ముగ్గురు ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ జనార్దన్ మిశ్రా, కాంగ్రెస్ తరఫున సిద్ధార్థ్ తివారీ, సీపీఎం తరఫున్ గిరిజేష్ సింగ్ సెంగార్ పోటీ పడుతున్నారు. రాజస్థాన్ అల్వార్, దౌసా ముఖ్యస్థానాలతోసహా 12స్థానాలకు ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. మూక హత్యలు, గోరక్షక దాడులతో అల్వార్ ప్రాంతం వార్తల్లోకి ఎక్కింది. ఈ సీటుకు బీజేపీ మత ప్రచారకుడు బాలక్‌నాథ్‌ను రంగంలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి జతేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది. ఇక దౌసా నియోజకవర్గం నుంచి ప్రధానంగా ఇద్దరు మహిళలు పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున జస్ కౌర్ మీనా, కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మురారీ లాల్ మీనా భార్య సవితా మీనా పోటీ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ మొత్తం 80 సీట్లకుగాను ఈ రోజు 14 సీట్లకు పోలింగ్ కొనసాగుతోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో వీటిల్లో 12 సీట్లను బీజేపీయే కైవసం చేసుకొంది. వీటిల్లోని అమేథీ, రాయబరేలి సీట్లను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు గెలుచుకున్నారు. అమేథిలో ఈసారి రాహుల్ గాంధీపై బీజేపీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తుండగా, సోనియా గాంధీపై బీజేపీ అభ్యర్థిగా మాజీ కాంగ్రెస్ నాయకుడు దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ శ్రీరాంపూర్, హూగ్లీ, ఆరమ్బాగ్, హౌరా, బారక్పూర్, ఉల్బేరియా, బాంగావ్ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. అంతకుముందు పోలింగ్ జరిగిన నియోజక వర్గాల్లో హింసాకాండ చెలరేగడంతో ఈసారి ఎన్నికల కమిషన్ ఈ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. -
‘యువ ఓటర్లు పోటెత్తాలి’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌లో పెద్దసంఖ్యలో యువత ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. దేశ భవిష్యత్‌ను నిర్ధేశించేందుకు, ప్రజాస్వామ్య పరిపుష్టికి ఓటు దీటైన ఆయుధమని ప్రధాని సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. యువ ఓటర్లు రికార్డు సంఖ్యలో ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరారు. నేడు జరుగుతున్న ఐదో విడత పోలింగ్‌లో ప్రజలంతా పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. కాగా,ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. బిహార్, జమ్ము కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. -
ఏపీలో ప్రారంభమైన రీ పోలింగ్
-
ఏపీలో ముగిసిన రీ పోలింగ్
సాక్షి, అమరావతి : ఏపీలో అయిదు చోట్ల సోమవారం నిర్వహించిన రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 81.48 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం సాయంత్రం 6 గంటలకు ప్రకటించింది. గుంటూరు జిల్లా నరసారావు పేట నియోజకవర్గం కేశానుపల్లిలో 89.23 శాతం, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ నల్లచెరువులో 75.43 శాతం పోలింగ్ నమోదైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 247 పోలింగ్ స్టేషన్ కలనుతలలో 87.01 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్లోని 41 పోలింగ్ స్టేషన్ ఇసుకపల్లిపాలెంలో 75.55 శాతం, సూళ్లూరు పేట అసెంబ్లీ సెగ్మెంట్ 197 పోలింగ్ స్టేషన్ అటకానితిప్పలో 84.23 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ గుంటూరు జిల్లా కేశానుపల్లిలో 87.34 శాతం, నల్లచెరువులో 69.56 శాతం పోలింగ్ నమోదు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కలనుతలలో 75.61 శాతం పోలింగ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్లోని ఇసుకపల్లిపాలెంలో 70.20 శాతం సూళ్లూరు పేట అసెంబ్లీ సెగ్మెంట్ 197 పోలింగ్ స్టేషన్ అటకానితిప్పలో (నెల్లూరు)లో 83.15 శాతం మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 94వ పోలింగ్ స్టేషన్ కేశానుపల్లిలో 80.13 శాతం పోలింగ్ నమోదు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ నల్లచెరువులో 56.09 శాతం పోలింగ్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 247 పోలింగ్ స్టేషన్ కలనుతలలో 60.28 శాతం పోలింగ్ నమోదు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్లోని 41 పోలింగ్ స్టేషన్ ఇసుకపల్లిపాలెంలో 57.01 శాతం సూళ్లూరు పేట అసెంబ్లీ సెగ్మెంట్ 197 పోలింగ్ స్టేషన్ అటకానితిప్పలో (నెల్లూరు)లో 73.84 శాతం పసుపు కండువాతోనే పోలింగ్ బూత్‌లోకి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని నల్లచెరువు బూత్ నంబర్ 244లో జరుగుతున్న రీ పోలింగ్ సరళిని పరిశీలించడానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సోమవారం వచ్చారు. అయితే ఆయన పసుపు కండువా వేసుకుని రావడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా పసుపు కండువాతోనే గల్లా జయదేవ్‌ను అక్కడ అధికారులు పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. ఉదయం 9గంటల వరకూ నమోదైన పోలింగ్ గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 94వ పోలింగ్ స్టేషన్ కేశానుపల్లిలో 18.87 శాతం పోలింగ్ నమోదు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ నల్లచెరువులో 13.32 శాతం పోలింగ్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 247 పోలింగ్ స్టేషన్ కలనుతలలో 9.53 శాతం పోలింగ్ నమోదు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్లోని 41 పోలింగ్ స్టేషన్ ఇసుకపల్లిపాలెంలో 13.28 శాతం సూళ్లూరు పేట అసెంబ్లీ సెగ్మెంట్ 197 పోలింగ్ స్టేషన్ అటకానితిప్పలో (నెల్లూరు)లో 30.47 శాతం (కేశానుపల్లి – 956 మంది ఓటర్లు) (నల్లచెరువు – 1,376 మంది ఓటర్లు) (కలనూతల 1,070 మంది ఓటర్లు) (ఇసుకపాలెం 1,084 మంది ఓటర్లు) (అటకానితిప్ప 578 మంది ఓటర్లు) పోలింగ్ సరళిని పరిశీలించిన గోపిరెడ్డి గుంటూరు కేసానుపల్లిలో రీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ 25 శాతం పోలింగ్ నమోదు అయింది. మరోవైపు జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు పరిస్థితిని సమీక్షంచారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయులు ...పోలింగ్ సరళిని పరిశీలించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్ కోన శశిధర్ గుంటూరు జిల్లాలో రీ పోలింగ్ జరుగుతున్న రెండు కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఓటర్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 244లో ఇప్పటివరకూ 129 ఓట్లు పోలయ్యాయి. నరసరావుపేట మండలం కేసానుపల్లిలో 80 ఓట్లు పోల్ అయ్యాయి. కలనూతలలో ప్రశాంతంగా రీ పోలింగ్ ప్రకాశం జిలా ఎర్రగొండపాలెం పరిధిలోని కలనూతలలో రీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో కలనూతలలో రాత్రి పన్నెండు తరువాత కూడా క్యూ లో ఓటర్లు వున్నారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఓటు వేయలేకపోయారు. దీంతో రాజకీయ పార్టీలు, ఓటర్లు విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం రీ పోలింగ్ నిర్వహిస్తోంది. కలనూతల 247 పోలింగ్ బూత్‌లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ఇసుకపాలెంలో రీ పోలింగ్ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఓటు వేసేందుకు ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం రాష్ట్రంలో అయిదు పోలింగ్ స్టేషన్లలో నిర్ణీత సమయానికి మాక్ పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది సోమవారం ఉదయం తెలిపారు. సరిగ్గా అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైందని ఆయన చెప్పారు. మీడియాను అనుమతించని పోలీసులు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని నల్లచెరువులో బూత్ నెంబర్ 244 రీపోలింగ్ సందర్భంగా అర్బన్ పోలీసులు మీడియాను అనుమతించలేదు. మీడియా అయినా సరే 100 మీటర్ల దూరంలోనే ఉండాలని పోలీసులు ఆదేశించారు. ఈసీ ఇచ్చిన పాస్ చూపించినా అనుమతించకపోవడంతో పోలీసులతో మీడియా ప్రతినిధులు వాగ్వివాదానికి దిగారు. ఈసీ పాస్ ఇస్తే వారినే అడగాలంటూ పోలీసులు పేర్కొనడం గమనార్హం. అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్ ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో సోమవారం రీ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 5.30 గంటలకే అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో 7 గంటలకు రీ పోలింగ్ మొదలైంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు . -
లోక్‌సభ ఎన్నికలు: ముగిసిన పోలింగ్
జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్ మినహా ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లా అనంతనాగ్ పోలింగ్ కేంద్రంపై ఓ ఉగ్రవాది గ్రనేడ్ విసిరాడు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పశ్చిమ బెంగాల్లో వివిధ చోట్ల చెదురుమదురు ఘర్షనలు జరిగాయి. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో ఎన్నిక జరగ్గా, మొత్తం 674 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ 51 నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా దాదాపు 9 కోట్ల మంది ఓటర్లున్నారు. ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 59.20 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక రాష్ట్రాల వారిగా జమ్మూకాశ్మీర్ 17.07శాతం, బీహార్ 52.86 శాతం, మధ్య ప్రదేశ్ 61.03 శాతం, రాజస్తాన్ 58.04 శాతం, ఉత్తరప్రదేశ్ 52.03 శాతం, పశ్చిమ బెంగాల్73.46 శాతం, జార్ఖండ్ 58.24శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 49,50ల వద్ద స్పల్ప ఘర్షణ చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నేత, హౌరా ఎంపీ ప్రసాన్ బెనర్జీని పోలింగ్ బూత్‌లోకి అనుమతించకపోవడంతో ఎంపీకి, భద్రతా సిబ్బంది మధ్య చిన్న తోపులాట చోటు చేసుంది. రెండు చేతులు లేకపోయినా ఎవరి సహాయం తీసుకోకుండా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసి ఓటు విలువను చాటారో దివ్యాంగురాలు. మధ్యప్రదేశ్‌కు చెందిన నిధి అనే దివ్యాంగురాలు నర్సింగపూర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు చేతులు లేకపోవడంతో కాలితో ఓటు వేశారు. చిన్న చిన్న ఘర్షనలు మినహా ఐదో దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తంగా 48.38 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక రాష్ట్రాల వారిగా జమ్మూకాశ్మీర్ 12.86 శాతం, బీహార్ 44. 08 శాతం, మధ్య ప్రదేశ్ 48.76 శాతం, రాజస్తాన్ 49.50శాతం, ఉత్తరప్రదేశ్ 43.07 శాతం, పశ్చిమ బెంగాల్ 61.01 శాతం, జార్ఖండ్ 51.07 శాతం పోలింగ్ నమోదైంది. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్ఖాండ్ రాష్ట్రంలోని రాంచీలో ఏర్పాటు చేసిన జవహార విద్యా మందిర్ పోలింగ్ బూత్‌లో ధోని ఓటు వేశారు. మధ్యాహ్నం 1గంట వరకు జమ్మూకాశ్మీర్ 6.54శాతం, బీహార్ 24.49శాతం, మధ్య ప్రదేశ్ 31.46శాతం, రాజస్తాన్ 33.82శాతం, ఉత్తరప్రదేశ్ 26.53శాతం, పశ్చిమ బెంగాల్ 39.55శాతం, జార్ఖండ్ 37.24 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ హింసాత్మకం కావటంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. తారకేశ్వర్ అనే పోలింగ్ అధికారిపై ఈసీ వేటు వేసింది. బహుభాషా నటుడు ఆశుతోష్ రాణా మధ్యప్రదేశ్ నార్సింగ్‌పూర్ గదర్వారాలోని పోలింగ్ బూత్ నెంబర్ 105లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగులో వెంకీ, బంగారం తదితర సినిమాలలో ఆయన నటించారు. రాయ్‌బరేలీలోని బూత్ నెంబర్ 348, 349, 350లలో బీజేపీ పోలింగ్ ఏజెంటు, గ్రామాధికారి బీజేపీకి ఓటు వేసేలా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రెండు పోలింగ్ కేంద్రాలలోకి గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ప్రవేశించారు. ఏ పార్టీకి చెందిన వారని ప్రశ్నించగా నీళ్లు నమిలారు. వారి వద్ద ఎటువంటి గుర్తింపుకార్డులు లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. లోక్‌సభ ఐదో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజస్తాన్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద పొడవు మీసాల వ్యక్తి సందడి చేశాడు. దాదాపు 4అడుగులు కలిగిన అతడి మీసాలను చూసి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న జనాలు ఆశ్చర్యపోయారు. తన నామినేషన్‌ను తిరష్కరించిన కారణంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఓ బీఎస్ఎఫ్ జవాను. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తేజ్ బహుదూర్ యాదవ్ అనే బీఎస్ఎఫ్ జవాను సమాజ్ వాది పార్టీ తరుపున ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా వారణాసినుంచి నామినేషన్ వేశాడు. కానీ ఎన్నికల అధికారులు అతడి నామినేషన్‌ను తిరష్కరించారు. తేజ్ బహుదూర్ సమర్పించిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలలో వ్యత్యాసాలు ఉన్న కారణంగా అతడి నామినేషన్ తిరష్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. తేజ్ బహుదూర్ కేసును ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ వాదించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛాటర్‌పూర్‌లో ఓ వ్యక్తి శ్మశానం నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఉదయం తండ్రి అంత్యక్రియలు ముగించిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా ఓటు వేశాడు. ఉదయం 10 గంటల వరకు జమ్మూకాశ్మీర్ 1.36శాతం, బీహార్ 11.51శాతం, మధ్య ప్రదేశ్ 13.18శాతం, రాజస్తాన్ 14శాతం, ఉత్తరప్రదేశ్ 9.85శాతం, పశ్చిమ బెంగాల్ 16.56శాతం, జార్ఖండ్ 13.46 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో జాతీయ భద్రతా దళాలు తాగి ఉన్నాయని బరక్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్జున్ సింగ్ ఆరోపించారు. ఉదయం 9గంటల వరకు జమ్మూకాశ్మీర్ 0.80 శాతం, బీహార్ 11.51శాతం, మధ్య ప్రదేశ్ 11.43శాతం, రాజస్తాన్ 13.24శాతం, ఉత్తరప్రదేశ్ 9.82శాతం, పశ్చిమ బెంగాల్ 12.97శాతం, జార్ఖండ్ 13.46 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్‌లోని చప్రాలో రంజిత్ పాశ్వాన్ అనే వ్యక్తిని ఈవీఎం మిసన్‌ను ధ్వంసం చేసిన కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమేథి బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ.. ప్రియాంక గాంధీపై మండిపడ్డారు. ఐదేళ్ల క్రితం ప్రియాంకకు తన పేరు తెలియదని, కానీ కొద్దిరోజులుగా తన పేరును జపిస్తోందన్నారు. ఆమె భర్త రాబర్ట్ పేరు కంటే తన పేరే ఎక్కువ వాడుతోందంటూ ఎద్దేవా చేశారు. రాహుల్, ప్రియాంకాలు రాజకీయాలను సొంత లాభం కోసం వాడుతున్నారని, మనషుల ప్రాణాలంటే కూడా వారికి లెక్కలేదన్నారు. అమేథిలో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ట్రస్టీగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స చేయనందున ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడని తెలిపారు. జమ్మూకాశ్మీర్ పుల్వామాలో ఓ ఉగ్రవాది పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ విసిరాడు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ బరక్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్జున్ సింగ్ ఆరోపించారు. వారి దాడిలో తాను గాయపడినట్లు తెలిపారు. టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి లక్నోలోని మాంటీసోరి ఇంటర్ కాలేజీ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ ఓటు వేసే హక్కు ఉందని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి, లక్నో బీజేపీ ఎంపీ అభ్యర్థి రాజ్‌నాథ్ సింగ్.. లక్నోలోని స్కాలర్స్ హోమ్ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ గెలవటం ఖాయమని, నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవ్వబోతున్నారని జోష్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్స్, ఈవీఎంలు పనిచేయకపోవటంతో పోలింగ్ ఇంకా ప్రారంభంకాలేదు. జుమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వృద్ధులు, వికలాంగులు సైతం ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ ఆయన సతీమణి గాయత్రి రాథోర్ జైపూర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా దంపతులు హజరీబాగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. యశ్వంత్ కుమారుడు, కేంద్రమంత్రి జయంత్ సిన్హా జార్ఖండ్‌నుంచి లోకసభ స్థానానికి పోటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్టు చేశారు. కొన్ని పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు అందంగా ముస్తాబు చేశారు. తమ సమస్యలను పరిష్కరించని కారణంగా కొన్ని గ్రామాల్లో ప్రజలు ఎన్నికల బహిష్కరించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మరికాసేపట్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో ఎన్నిక జరగనుండగా, మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 51 నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా దాదాపు 9 కోట్ల మంది ఓటర్లున్నారు. ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. గత ఎన్నికల్లో ఈ 51 నియోజకవర్గాల్లోని 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు దక్కగా, మిగిలిన స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ వంటి ఇతర పార్టీల వశమయ్యాయి. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో 14, రాజస్తాన్‌లో 12, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌ల్లో చెరో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్ నియోజకవర్గంతోపాటు అనంత్‌నాగ్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుల్వామా, షోపియాన్ జిల్లాల్లోనూ పోలింగ్ జరగనుంది. మొత్తం 96 వేల పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఐదో దశ పోలింగ్ ముగిస్తే మొత్తంగా దేశంలో 424 స్థానాలకు పోలింగ్ అయిపోయినట్లే. మిగిలిన 118 స్థానాలకు ఆరో (మే 12), ఏడో (మే 19) దశల్లో పోలింగ్ జరుగుతుంది. -
ఒడిదుడుకుల ప్రయాణం..!
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ నేడు జరగనుంది. లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. నేడు జరిగే పోలింగ్... ఎన్నికల చివరి అంకానికి మరింత దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారు? ఎన్ డీఏనే కొనసాగితే.. మెజారిటీ ఎంత ఉండనుందనే ఉత్కంఠ మార్కెట్లో రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు మార్కెట్లో ఒడిదుడుకులు కూడా అధికస్థాయిలోనే పెరుగుతాయి. ఇదే సమయంలో పలు దిగ్గజ కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నాయి’ అని అన్నారయన. మిశ్రమ కార్పొరేట్ ఫలితాలు, సాధారణ ఎన్నికల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజ ఫలితాల వెల్లడి ప్రైవేట్ రంగ దిగ్గజమైన ఐసీఐసీఐ బ్యాంక్ మే 6న (సోమవారం) మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ బ్యాంక్ నికర లాభం రూ.2,162.8 కోట్లుగా ఉండవచ్చని బ్రోకరేజీ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ఏడాది ప్రాతిపదికన 112 శాతం, క్వార్టర్ ఆ¯Œ క్వార్టర్ వృద్ధి 34.8 శాతం వృద్ధిని అంచనావేసిన ఈ సంస్థ.. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.6% వృద్ధి చెంది రూ.6,839.3 కోట్లుగా ఉండనుంది విశ్లేషించింది. ఈ ఆదాయం త్రైమాసిక పరంగా స్వల్పంగా 0.5% క్షీణత ఉండనుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ క్యూ4 ఫలితాలు ఈనెల 10న (శుక్రవారం) వెల్లడికానుండగా.. ఇదే రోజున కెనరా బ్యాంక్ ఫలితాలురానున్నాయి. ధనలక్ష్మీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఇతర దిగ్గజ కంపెనీల్లో వేదాంత (మంగళవారం).. టైటాన్, శ్రీ రేణుకా షుగర్స్, టాటా కమ్యూనికేషన్స (బుధవారం), ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అపోలో టైర్స్ (గురువారం).. లార్సెన్ అండ్ టుబ్రో, వోల్టాస్ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల ఆధారంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేష¯Œ్స, మిశ్రమ ఫలితాల నేపథ్యంలో నిఫ్టీ 11,800 వద్ద బలమైన రెసిస్టెన్‌సను ఎదుర్కొంటోంది. ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను కొనసాగిస్తుండగా.. డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు’ అని క్యాపిటల్‌ఎయిమ్ రీసెర్చ్ హెడ్ మనీష్ యాదవ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–చైనాల మధ్య బీజింగ్‌లో తాజా విడత వాణిజ్య చర్చలు బుధవారం రోజున పూర్తయ్యాయి. అంతక్రితం సమావేశాలతో పోల్చితే తాజా విడత చర్చల్లో కొంత పురోగతి ఉన్నట్లు ఇరు దేశాల వాణిజ్య అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక వాషింగ్టన్ లో మరో దఫా చర్చలకు ఇరు పక్షాలు అంగీకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాల పరంగా ఈవారంలో మార్కెట్లకు ఇది కీలకంగా ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏమాత్రం పురోగతి కనిపించినా మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని అంచనావేస్తున్నాయి. దేశీ ఆర్థిక గణాంకాలపరంగా.. ఏప్రిల్ నికాయ్ ఇండియా సేవల పీఎంఐ సోమవారం.. పారిశ్రామికోత్పత్తి, తయారీ ఉత్పత్తిని ప్రభుత్వం శుక్రవారం వెల్లడించనుంది. వెనక్కు తగ్గిన ఎఫ్ఐఐలు గడిచిన రెండు సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.1,255 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. మే నెల 2, 3 తేదీల్లో వీరు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.367 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.888 కోట్లను వెనక్కితీసుకున్నారు. అయితే.. ఏప్రిల్ నెల్లో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈమధ్యకాలంలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల డేటా ఆధారంగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా మారారని ఒక తుది అంచనాకు రాలేమని జియోజిత్ ఫైనాన్షియల్ విశ్లేషకులు జి.విజయ్ కుమార్ అన్నారు. -
నేడే ఐదో దశ పోలింగ్
న్యూఢిల్లీ: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సోమవారమే పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో ఎన్నిక జరగనుండగా, మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 51 నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా దాదాపు 9 కోట్ల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఈ 51 నియోజకవర్గాల్లోని 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు దక్కగా, మిగిలిన స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ వంటి ఇతర పార్టీల వశమయ్యాయి. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో 14, రాజస్తాన్‌లో 12, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌ల్లో చెరో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్ నియోజకవర్గంతోపాటు అనంత్‌నాగ్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుల్వామా, షోపియాన్ జిల్లాల్లోనూ పోలింగ్ జరగనుంది. మొత్తం 96 వేల పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఐదో దశ పోలింగ్ ముగిస్తే మొత్తంగా దేశంలో 424 స్థానాలకు పోలింగ్ అయిపోయినట్లే. మిగిలిన 118 స్థానాలకు ఆరో (మే 12), ఏడో (మే 19) దశల్లో పోలింగ్ జరుగుతుంది. బరిలోని ప్రముఖులు వీరే.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో రాహుల్ గాంధీతో స్మృతీ ఇరానీ పోటీపడుతున్నారు. సోనియా గాంధీ రాయ్‌బరేలీలో, రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, మరో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ జైపూర్ (గ్రామీణం) నుంచి పోటీలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌ల మధ్య చతుర్ముఖ పోరు నడుస్తోంది. జార్ఖండ్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. -
ముగిసిన ఐదో దశ ప్రచారం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఐదో దశ ఎన్నికలకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో 14 సీట్లు, రాజస్తాన్‌లో 12, పశ్చిమబెంగాల్లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, కశ్మీర్‌లోని 2 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 51 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 6వ తేదీన జరగనున్న పోలింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే వారిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్, స్మృతి ఇరానీ, జయంత్ సిన్హా, అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ తదితరులున్నారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారంపై ఫొని తుపాను ప్రభావం పడింది. వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని పొరుగునే ఉన్న ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇలా ఉండగా, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భూమిపై హక్కు కోసం వీరోచితంగా పోరాడిన, గిరిజనులు దైవంగా భావించే బిర్సా ముండా జన్మించిన జార్ఖండ్‌లో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్ర రాజధాని రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలోని మావోయిస్టుల ప్రభావిత ఖుంతి జిల్లాలో 100కు పైగా గిరిజన గ్రామ పంచాయతీల ప్రజలు ఈ లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తామే పాలకులమనీ, తమ గ్రామాల్లోకి ఎవరినీ అనుమతించబోమంటూ తీర్మానించారు. తమను గురించి కనీసం పట్టించుకోని నేతలతో పని లేదని వీరు వాదిస్తున్నారు. -
మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా?
ఐదో దశ లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పోలింగ్ జరిగే 51 నియోజకవర్గాల్లో బీజేపీ 2014 ఎన్నికల్లో 39 స్థానాలను కైవసం చేసుకుంది. అత్యధిక సీట్లలో కాషాయపక్షం మళ్లీ విజయం సాధిస్తేనే కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్ బలం లోక్‌సభలో వంద దాటాలంటే ఐదో దశలోని మెజారిటీ సీట్లను గెలుచుకోక తప్పదు. రెండు ప్రధాన జాతీయ పక్షాలకూ ఈ దశ కీలకంగా మారింది. పదిహేడో లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరుగుతుంది. ఏడు రాష్ట్రాల్లోని 51 సీట్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం 543 సీట్లలో 373 స్థానాలకు మొదటి నాలుగు దశల్లో పోలింగ్ జరిగింది. పార్లమెంటు సీట్ల సంఖ్య రీత్యా దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్(14), రాజస్తాన్(12), పశ్చిమ బెంగాల్(7), మధ్యప్రదేశ్(7), బిహార్(5), జార్ఖండ్(4), జమ్మూకశ్మీర్(2)లోని 51 లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి నాలుగు దశల్లో హింసాత్మక ఘటనలు జరిగిన పశ్చిమ బెంగాల్లో ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నూరు శాతం కేంద్ర పారామిలిటరీ దళాలనే వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 11, 18, 23, 29న జరిగిన మొదటి నాలుగు దశల ఎన్నికల్లో 69 శాతం సీట్లకు 67 శాతం పోలింగ్ జరిగింది. ఈ నెల 6, 12, 19న జరిగే చివరి దశల్లో మిగిలిన 170 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మండు వేసవి మే నెలలో జరిగే చివరి మూడు దశల పోలింగ్ తర్వాత 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బిహార్‌లో నువ్వా నేనా... బిహార్‌లోని మొత్తం 40 స్థానాల్లో ఐదో దశలో ఐదు నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ‘సొంత’ నియోజకవర్గం సారణ్‌లో ఆయన వియ్యంకుడు, మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ కుమారుడు చంద్రికారాయ్ ఆర్జేడీ టికెట్‌పై తొలిసారి లోక్‌సభకు పోటీచేస్తున్నారు. ఆయనపై బీజేపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ మరోసారి రంగంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో లాలూ భార్య, మాజీ సీఎం రాబ్రీదేవిని రూడీ 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బిహార్ పాలక సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న జేడీయూ కూడా ఎన్డీఏ భాగస్వామి కావడంతో రూడీ గెలుపు ఖాయమని బీజేపీ భావిస్తోంది. లాలూ పెద్ద కొడుకు మామ పోటీలో ఉండడంతో ఆర్జేడీ ఈ స్థానంలో గెలుపునకు గట్టి ప్రయత్నం చేస్తోంది. సీతామఢీలో రాష్ట్ర మంత్రి, బీజేపీ మాజీ నేత సునీల్‌కుమార్ పింటూ(జేడీయూ) ఎన్డీఏ కూటమి తరఫున పోటీలో ఉన్నారు. ఆయనపై ఆర్జేడీ కూటమి తరఫున అర్జున్‌రాయ్ పోటీచేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో అప్పటి ఎన్డీఏ భాగస్వామి పార్టీ ఆరెలెస్పీ నేత రాంకుమార్ శర్మ కుష్వాహా తన సమీప ఆర్జేడీ ప్రత్యర్థి సీతారాంయాదవ్పై లక్షా 47 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మధుబనిలో కిందటిసారి గెలిచిన హుకుందేవ్ నారాయణ్ యాదవ్(బీజేపీ) కొడుకు అశోక్‌కుమార్ యాదవ్ ఈసారి బీజేపీ కూటమి తరఫున పోటీలో ఉన్నారు. ఆర్జేడీ కూటమిలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అభ్యర్థి బద్రీకుమార్ పూర్బే బరిలోకి దిగారు. 2014లో ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థిని బీజేపీ టికెట్‌పై పోటీచేసిన హుకుందేవ్ 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈసారి బీజేపీ అభ్యర్థి అశోక్ యాదవ్ తొలిసారి మధుబని నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నా తండ్రికి ఉన్న పలుకుబడి, ఎన్డీఏ బలంపై ఆధారపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ షకీల్ అహ్మద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయన యూపీఏ ఓట్లను చీల్చుకుంటే వీఐపీ అభ్యర్థి గెలుపు కష్టమే. మరో కీలక స్థానమైన ముజఫర్‌పూర్‌లో బీజేపీ తరఫున సిట్టింగ్ సభ్యుడు అజయ్ నిషాద్ మరోసారి పోటీకి దిగారు. ఆయన కిందటి ఎన్నికల్లో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి అఖిలేశ్ ప్రసాద్సింగ్ను రెండు లక్షల 22 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. అజయ్ నిషాద్ తండ్రి ఇక్కడ నుంచి గతంలో అనేకసార్లు గెలిచిన కేంద్ర మాజీ మంత్రి జైనారాయణ్ ప్రసాద్ నిషాద్. ఆర్జేడీ నాయకత్వంలోని మహాగuŠ‡బంధన్ తరఫున వీఐపీ పార్టీకి చెందిన రాజ్‌భూషణ్ చౌధరీ పోటీచేస్తున్నారు. ముజఫ్ఫర్‌పూర్ నుంచి అజయ్ నిషాద్ తండ్రి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. హాజీపూర్‌లో ఎల్జేపీ నేత పాస్వాన్ తమ్ముడు పశుపతి కుమార్ పారస్(ఎల్జేపీ) పోటీచేస్తుండగా, ఆయనపై ఆర్జేడీ అభ్యర్థి శివచరణ్ రామ్ పోటీకి దిగారు. ఝార్ఖండ్ కమలానికి కీలకం ఝార్ఖండ్‌లోని 14 సీట్లలో నాలుగు సీట్లకు ఐదో దశలో పోలింగ్ జరుగుతుంది. కోడర్మా, రాంచీ, హజారీబాగ్, ఖూంటీ(ఎస్టీ) స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్–జేఎంఎం కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. రాజధాని రాంచీ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుబోధ్‌కాంత్ సహాయ్(కాంగ్రెస్) మరోసారి బరిలోకి దిగారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు రామ్‌తహల్ చౌధరీకి ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్వతంత్ర అభ్యర్తిగా పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున కొత్త అభ్యర్థి సంజయ్ సేuŠ‡ రంగంలోకి దిగారు. బీజేపీ ఓట్ల చీలికతో తనకు విజయావకాశాలున్నాయని కాంగ్రెస్ నేత సహాయ్ భావిస్తున్నారు. మరో ముఖ్య స్థానం హజారీబాగ్‌లో కేంద్ర మంత్రి జయంత్ సిన్హా రెండోసారి బీజేపీ తరఫున పోటీకి దిగారు. జయంత్ సిన్హా ఆయన 2014లో తొలిసారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించారు. కాంగ్రెస్ తరఫున కొత్త అభ్యర్థి గోపాల్ సాహూ పోటీకి దిగారు. 2009లో జయంత్ తండ్రి యశ్వంత్ సిన్హా(బీజేపీ) ఇక్కడ నుంచి గెలిచారు. మరో జనరల్ స్థానం కోడర్మాలో బీజేపీ కొత్త అభ్యర్థి అన్నపూర్ణాదేవి యాదవ్‌ను పోటీకి నిలిపింది. 2014లో ఇక్కడ నుంచి బీజేపీ టికెట్‌పై రవీంద్రకుమార్ రాయ్ సమీప సీపీఐ(ఎంఎల్) అభ్యర్థి రాజ్‌కుమార్ యాదవ్‌ను 95కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. మళ్లీ రాజ్‌కుమార్ పోటీకి దిగారు. కాంగ్రెస్ కూటమి తరఫున మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ(జేవీఎం–పీ) పోటీచేస్తున్నారు. ఝార్ఖండ్ తొలి ముఖ్యమంత్రిగా బీజేపీ తరఫున పనిచేసిన మరాండీకి ఈసారి గెలుపు కీలకంగా మారింది. పశ్చిమ బెంగాల్ పశ్చిమబెంగాల్లో దీదీ వర్సెస్ మోదీగా సాగుతున్న ఎన్నికల్లో అయిదో దశలో ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. హుగ్లీ నది చుట్టూ కొన్ని నియోజకవర్గాలు, బెంగాల్ సరిహద్దుల్లో మరికొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ ఈ సారి రెండు స్థానాలు బీజేపీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మూడింట్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో హుగ్లీ పరిధిలో సింగూరు ఉండడంతో పోటీపై ఆసక్తి నెలకొంది. టాటా నానో కార్లకు సంబంధించిన భూ కేటాయింపులపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత దీదీ చేసిన పోరాటం జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపింది. ఆ ఆందోళనలే ఆమెను తర్వాత కాలంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాయి. హుగ్లీ ఇప్పటికీ సీపీఎంకు పట్టున్న ప్రాంతం. సీపీఎం అభ్యర్థి రత్నదే నాగ్ హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి ప్రదీప్ సాహాను ఆమె ఓడించారు. ఈ సారి కూడా సీపీఎం ప్రదీప్‌నే బరిలో దింపింది. లాకెట్ ఛటర్జీ ఇక బీజేపీ తరపున మాజీ నటి లాకెట్ ఛటర్జీ గట్టి పోటీయే ఇస్తున్నారు. హౌరాలో పోటీ కూడా ఈసారి ఉత్కంఠనే రేపుతోంది. ఒకప్పుడు పరిశ్రమలకు పెట్టింది పేరు. ఇప్పుడు అవేవీ కనిపించడం లేదు. యూపీ బిహార్ నుంచి వలస వచ్చిన ప్రజలకే ఎక్కువ. బీజేపీ నుంచి జర్నలిస్టు రంతిదేవ్ సేన్ గుప్తా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ, ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రసూన్ సేన్ గుప్తా పోటీపడుతున్నారు. 90 శాతం పట్టణ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం 1998లో తొలిసారిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి పట్టు బిగిస్తోంది. హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువ మంది ఉండడంతో బీజేపీ గట్టి సవాల్నే విసురుతోంది. ఇక బన్గావ్, బ్యారక్‌పూర్ నియోజకవర్గాల్లో సమీకరణలు ఈసారి బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి. రాజస్థాన్‌లో మారిన బీజేపీ పరిస్థితి రాజస్థాన్‌లో జరిగే మొత్తం 12 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. పింక్ సిటీ జైపూర్‌లో అర్ధశతాబ్దం తర్వాత ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వడం, బికనీర్, జైపూర్ (రూరల్)లో కేంద్ర మంత్రులు పోటీకి దిగడం, మూకదాడులతో వార్తల్లోకెక్కిన అల్వార్ ఈ దశలో ఉండడంతో ఎడారి రాజ్యంలో పోరు ఉత్కంఠను రేపుతోంది. జైపూర్ రూరల్ నుంచి కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌పై కాంగ్రెస్ మరో ఒలింపియన్ కృష్ణ పూనియాను రంగంలోకి దించడంతో హోరాహోరీ పోరు నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అన్ని సీట్లలో విజయకేతనం ఎగురవేసినా ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. సికార్‌లో సిట్టింగ్ ఎంపీ, ఆధ్యాత్మిక గురువు స్వామి సుమేధానంద్ సరస్వతికి బీజేపీ మళ్లీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీని సుభాష్ మహారియాను బరిలోకి దింపింది. ఈ సారి సీపీఎం కూడా మాజీ ఎమ్మెల్యే ఆమ్రారామ్ను పోటీకి దింపడంతో కాంగ్రెస్ కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. చురు బీజేపీకి గట్టి పట్టున్న నియోజకవర్గమే. జాట్ సామాజిక వర్గానికి చెందిన మాజీ నేత రామ్‌సింగ్ కాశ్వాన్ కుమారుడు రాహుల్ కాశ్వాన్ బీఎస్పీ అభ్యర్థి అభినేష్ మహర్షిని ఓడించారు. బీజేపీ ఈసారి కూడా రాహుల్‌నే బరిలోకి దింపుతోంది. ఇక కాంగ్రెస్ తరఫున ఆర్. మండేలియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నియోజకవర్గంలో 3.50 లక్షలకు పైగా జాట్లు ఉన్నారు. 1984లో తప్ప ప్రతీసారి ఈ నియోజకవర్గం నుంచి జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గెలుస్తున్నారు. ఝున్ఝునూ కాంగ్రెస్ దివంగత నాయకుడు సిస్ రామ్ ఓలాకు బాగా పట్టున్న ప్రాంతం. 1999 నుంచి 2013 వరకు ఆయనే ఎంపీగా ఉన్నారు. 2013లో ఆయన మృతితో ఝున్ఝునూ ఖాళీ అయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాజ్ బాల ఓలాను బీజేపీ నాయకురాలు సంతోష్ అహ్లావత్ ఓడించారు. కానీ బీజేపీ ఈ సారి రాజస్తాన్‌లో ఏకైక మహిళా ఎంపీకి టికెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాంద్వా నరేంద్ర కుమార్ ఖించాల్ను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రవణ్‌కుమార్ పోటీ పడుతున్నారు. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్‌లో 3 దశల పోలింగ్ పూర్తవుతుంది! జమ్మూకశ్మీర్‌లో లోయలోని కీలక నియోజకవర్గమైన అనంత్‌నాగ్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మూడు దశల పోలింగ్ చివరి దశ సోమవారం పూర్తవుతుంది. ఈ స్థానంలో సిట్టింగ్ సభ్యురాలైన పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మళ్లీ పోటీచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తన సమీప నేషనల్ కాన్ఫరెన్స్ ప్రత్యర్థి మీర్జా మెహబూబ్ బేగ్‌పై ఆమె 65 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మెహబూబా ముఫ్తీ , గులాం అహ్మద్ మీర్ ఈసారి ఆమెపై నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి హస్నైన్ మసూదీ పోటీచేస్తున్నారు. ఇంకా ఈ స్థానంలో గులాం అహ్మద్ మీర్(కాంగ్రెస్), సోఫీ యూసుఫ్ (బీజేపీ) పోటీలో ఉన్నారు. ఈసారి పోలింగ్ జరిగే రెండో స్థానమైన లద్దాఖ్‌ను నిలబెట్టుకోవడానికి బీజేపీ కొత్త అభ్యర్థి త్సేరింగ్ నంగ్యాల్‌ను రంగంలోకి దింపింది. ఈసారి ఇద్దరు బలమైన స్వతంత్ర అభ్యర్థులు అస్గర్ అలీ కర్బలాయ్, సజ్జద్ హుస్సేన్ పోటీలో ఉన్నారు. యూపీలో హోరాహోరీ ఉత్తరప్రదేశ్‌లోని 14 సీట్లు–ధౌరహ్రా, సీతాపూర్, మోహన్‌లాల్‌గంజ్, లక్నో, రాయ్‌బరేలి, అమేథీ, బందా, ఫతేపూర్, కౌశంబి, బారాబంకీ, ఫైజాబాద్, బహ్రాయిచ్, కైసర్‌గంజ్, గోండా నియోజకవర్గాలకు ఐదో దశలో పోలింగ్ జరుగుతుంది. 2014లో ఈ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పదిచోట్ల ప్రస్తుత మహాగuŠ‡బంధన్ భాగస్వామ్య పక్షాలైన ఎస్పీ, బీఎస్పీ రెండో స్థానంలో నిలిచాయి. ఈ పద్నాలుగు స్థానాల్లో ఏడు సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ రాయ్‌బరేలి, అమేథీలు మినహా మిగిలిన చోట్ల ఓడిపోయింది. అమేథీలోపై ఉత్కంఠ! గాంధీ–నెహ్రూ కుటుంబ నియోజకవర్గమైన అమేథీ నుంచి రాహుల్‌గాంధీ వరుసగా నాలుగోసారి పోటీచేస్తున్నారు. 2014లో బీజేపీ తరఫున తొలిసారి పోటీచేసి ఓడిపోయిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(బీజేపీ) మళ్లీ పోటీకి దిగారు. కిందటిసారి రాహుల్ మెజారిటీ బాగా తగ్గడంతో ఆయన కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ తరఫున ఆయన చెల్లెలు ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. స్మృతి గెలపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్‌షా, ఎల్జేపీ నేత రామ్‌విలాస్ పాస్వాన్ కూడా అనేక ఎన్నికల సభల్లో ప్రసంగించారు. అమేథీపై గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తి నెలకొంది. రాయ్‌బరేలీలో రాహుల్ తల్లి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా నాలుగోసారి పోటీచేస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరఫున దినేష్ ప్రతాప్‌సింగ్ బరిలోకి దిగారు. ఆయన గతంలో సోనియా పోటీచేసినప్పుడు ఆమె తరఫున పనిచేశారు. గత ఏడాది కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దినేష్‌కు బీజేపీ టికెటివ్వడం విశేషం. లక్నోలో రాజ్‌నాథ్‌కు నామమాత్ర పోటీయేనా? కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పోటీచేస్తున్న లక్నోలో మహా కూటమి తరఫున సినీనటుడు, కేంద్ర మంత్రి మాజీ శత్రుఘ్న సిన్హా భార్య, బాలీవుడ్ మాజీ నటి పూనమ్ సిన్హా, కాంగ్రెస్ అభ్యర్థి సంభల్ కల్కీ పీఠం అధిపతి ప్రమోద్ కృష్ణం పోటీకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రత్యర్థులిద్దరూ ఇతర ప్రాంతాలవారు కావడంతో రాజ్‌నాథ్ గెలుపు సునాయాసమేనని అంటున్నారు. అవధ్ ప్రాంతంలోని మరో కీలక స్థానం ఫైజాబాద్‌లో కిందటిసారి గెలిచిన లల్లూసింగ్ (బీజేపీ) మరోసారి రంగంలోకి దిగారు. వివాదాస్పద ఆయోధ్య–రామజన్మభూమి ఉన్న ఫైజాబాద్ పోటీపై ఎప్పటిలాగానే ఆసక్తి నెలకొంది. 2014లో ఎస్పీ తరఫున పోటీచేసి ఓడిన మాజీ ఎంపీ మిత్రసేన్ యాదవ్ కొడుకు ఆనంద్‌సేన్ ఈసారి మహాకూటమి అభ్యర్థిగా ఎస్పీ టికెట్‌పై బరిలోకి దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైజాబాద్ మాజీ ఎంపీ నిర్మల్ ఖత్రీ కాంగ్రెస్ టికెట్‌పై మరోసారి పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ జరుగుతోంది. ధౌరహ్రాలో కాంగ్రెస్ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర ప్రసాద్ కొడుకు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ మళ్లీ పోటీకి దిగారు. ఆయనపై బీజేపీ సిట్టింగ్ సభ్యురాలు రేఖా వర్మ మరోసారి పోటీలో ఉన్నారు. ఆమె కిందటిసారి తన సమీప బీఎస్పీ ప్రత్యర్థి దావూద్ అహ్మ ద్‌ను ఓడించారు. బీఎస్పీ–ఎస్పీ కూటమి తరఫున అర్షద్ ఇల్యాస్ అహ్మద్(బీఎస్పీ) పోటీచేస్తున్నారు. పోటీ ఇక్కడ ప్రధానంగా బీజేపీ, బీఎస్పీ మధ్యనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలకు రిజర్వ్‌చేసిన బహరాయిచ్‌లో వివాదాస్పద మాజీ బీజేపీ ఎంపీ సావిత్రీబాయి ఫూలే కాంగ్రెస్ తరఫున ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు. 2014లో ఆమె బీజేపీ టికెట్‌పై పోటీచేసి సమీప ఎస్పీ అభ్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మికీని ఓడించారు. వాల్మికీ మళ్లీ ఎస్పీ తరఫున పోటీచేస్తున్నారు. సావిత్రీబాయి కాంగ్రెస్‌లో చేరడంతో బీజేపీ తరఫున కొత్త అభ్యర్థి అక్షర్‌వర్ లాల్ బరిలోకి దిగారు. బహరాయిచ్‌లో పోటీ బీజేపీ, మహా కూటమి తరఫున ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన సీట్లలో కూడా పోటీ ప్రధానంగా బీజేపీ, బీఎస్పీ–ఎస్పీ కూటమి మధ్యనే ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కఠిన పరీక్షే! ఇక్కడి 7 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. 2014లో మధ్య ప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలకు గాను 27 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగురవేసిన బీజేపీకిగానీ, 2018 ఎన్నికల్లో అలుపెరుగకుండా పోరాడి తృటిలో బయటపడిన కాంగ్రెస్కిగానీ ఈ ఎన్నికల్లో విజయం అంత సులువుకాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఖజురహోలో ఈసారి బీజేపీ నుంచి వీ.డీ శర్మ తన విజయావకాశాలను పరీక్షించుకుంటున్నారు. స్థానిక రాజకుటుంబీకురాలు కవితాసింగ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. జనాభా రీత్యా ఓబీసీ, ఎస్సీ సామాజిక వర్గాలే అధికంగా ఉన్నా, సాంప్రదాయకంగా రాజ్‌పుత్‌ల ఆధిపత్యం ఇక్కడ కొనసాగుతోంది. ప్రహ్లద్ పటేల్ ఇక్కడ కుర్మీ, లోధి సామాజిక వర్గానిదే అధిక జనాభా. మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి అర్జున్‌సింగ్‌కి పట్టున్న సత్నా లోక్‌సభ స్థానంలో ఓబీసీ సామాజిక వర్గాలతో పాటు ఆదివాసీల సంఖ్య సైతం చెప్పుకోదగిన స్థాయిలోనే 20 శాతంగా ఉంది. 1998 1999 ఎన్నికల్లో బీజేపీ నుంచి రామానంద్ సింగ్ సత్నా సీటుని గెలుచుకున్నారు. 2004 నుంచి ఈ సీటుని బీజేపీ గణేశ్ సింగ్‌కి దక్కింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజారాం త్రిపాఠీని బరిలోకి దింపితే ఈసారి కూడా బీజేపీ మాత్రం గణేష్ సింగ్‌ని తిరిగి నిలబెట్టింది. రేవాలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ జనార్ధన్ మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థి సుందర్ లాల్ తివారీని ఓడించారు. ఈసారి కాంగ్రెస్ తరఫున రామూ టీకామ్ బీజేపీ అభ్యర్థి దుర్గాదాస్‌ను ఢీకొంటున్నారు. బేతుల్ నియోజకవర్గంలో అత్యధికంగా 40 శాతం మంది ఆదివాసీలే. బేతుల్ నియోజకవర్గంలో 1996 నుంచి, 2009 వరకు సుదీర్ఘకాలం బీజేపీ విజయప్రస్థానం కొనసాగింది. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా దుర్గాదాస్ పోటీ చేస్తోంటే, కాంగ్రెస్ రామూ టీకంని బరిలోకి దింపింది. హోసంగాబాద్ 1989 నుంచి బీజేపీకి మంచి పట్టున్న లోక్‌సభ స్థానం. 1989 నుంచి 2009 వరకు సర్తాజ్ సింగ్ ఐదు సార్లు ఈ లోక్‌సభ స్థానంలో విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వా కూడా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ బీజేపీ అభ్యర్థి ఉదయప్రతాప్ సింగ్. ఇక్కడ కూడా ఆదివాసీలు 16 శాతం ఉన్నారు. దామోహ్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రహ్లద్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థి చౌధురీ మహేంద్ర ప్రతాప్ సింగ్‌పై 2 లక్షల ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో దామోహ్‌లో బీజేపీ నుంచి తిరిగి ప్రహ్లద్ పటేల్ పోటీ చేస్తోంటే, కాంగ్రెస్ నుంచి ప్రతాప్ సింగ్, ప్రహ్లద్ సింగ్ బరిలోకి దిగారు. యావత్ దేశంలోనే ఆర్థికంగా అత్యంత వెనుకబడిన లోక్‌సభ నియోజకవర్గం టీకంగఢ్‌లో దాదాపు 77 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన వారే. ఈ నియోజకవర్గంలో నాలుగోవంతు మంది షెడ్యూల్డ్ కులాల ప్రజలే. గతంలో రెండుసార్లు విజయం సాధించిన వీరేంద్ర కుమార్‌నే తిరిగి బీజేపీ టీకంగఢ్‌లో పోటీకి దింపింది. బీజేపీ అభ్యర్థి వీరేంద్ర కుమార్‌తో కాంగ్రెస్ నేత కిరణ్ అహిర్వార్ తలపడుతున్నారు. ఐదు స్థానాల్లో స్వల్ప మెజారిటీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఐదు వేర్వేరు రాష్ట్రాల్లోని ఐదు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో సీట్లు కైవసం చేసుకుంది. ఈ స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగుతోంది. లద్దాఖ్(జమ్మూ కశ్మీర్)లో ఇండిపెండెంట్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి కేవలం 36 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌సింగ్‌పై బీజేపీ టికెట్‌పై పోటీచేసిన గణేశ్‌సింగ్ కేవలం 8,688 ఓట్ల తేడాతో గెలిచారు. బిహార్‌లోని మధుబని స్థానంలో ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి హుకుందేవ్ నారాయణ్ యాదవ్ 20,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజస్థాన్‌లోని కరౌలీ ధోల్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లఖీరామ్పై బీజేపీ నేత మనోజ్ రాజోరియా 27,216 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీ(ఎస్పీ రిజర్వ్డ్) స్థానంలో ఎస్పీ అభ్యర్థి శైలేంద్రకుమార్‌ను బీజేపీ టికెట్‌పై పోటీచేసిన వినోద్‌కుమార్ సోంకర్ 42,900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇంత తక్కువ మెజారిటీతో కైవసం చేసుకున్న ఈ ఐదు నియోజకవర్గాలను 2019 ఎన్నికల్లో నిలబెట్టుకోవడం బీజేపీకి కీలకంగా మారింది. 51 సీట్లలో కాంగ్రెస్‌కు రెండే ఐదో దశలో భాగంగా సోమవారం ఏడు రాష్ట్రాల్లోని 51 సీట్లలో పోలింగు జరుగుతోంది. వీటిలో ఏ సీటులో ఎవరు గెలుస్తారనేది 23వ తేదీన తెలుస్తుంది. అయితే, 2014 ఎన్నికల్లో ఈ 51 సీట్లలో 39 సీట్లు కమలనాధులే దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు స్థానాలు(రాయ్‌బరేలి,అమేథీ) మాత్రమే వచ్చాయి. ఇక బెంగాల్లో తృణమూల్ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రాల వారీగా చూస్తే...బిహార్‌లోని ఐదు సీట్లలో మూడు బీజేపీ గెలుచుకోగా ఒక దాంట్లో ఆర్ఎస్ఎల్పీ, ఇంకోచోట ఎల్జేపీలు గెలిచాయి. కశ్మీర్లో ఒకటి బీజేపీ, మరొకటి పీడీపీ కైవసం చేసుకున్నాయి. జార్ఖండ్‌లో నాలుగు స్థానాలూ బీజేపీ కైవసం చేసుకుంది. మధ్య ప్రదేశ్‌లో ఏడు,రాజస్థాన్‌లోని 12 స్థానాల్లోనూ కాషాయ జెండాయే ఎగిరింది. ఉత్తర ప్రదేశ్‌లో రాయ్‌బరేలి,అమేథీ తప్ప మిగతా 12 సీట్లలో బీజేపీ అభ్యర్ధులు గెలిచారు.ఇక బెంగాల్ విషయానికి వస్తే..ఏడు నియోజకవర్గాల్లోనూ తృణమూల్ జయకేతనం ఎగురవేసింది. -
ఈసారి ఓట్ల సునామీ!
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇంత వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ సరళి ఇక ముందు జరిగే మూడు దశల్లోకూడా కొనసాగితే ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతవరకు నాలుగు దశలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఆ దశల్లో పోలింగు శాతం ఇప్పటి కంటే ఒక శాతం పెరిగినా స్వతంత్ర భారతంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయిన ఎన్నికలుగా ఈ ఎన్నికలు చరిత్ర సృష్టిస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో వెల్లడయింది. ఈ ఎన్నికల్లో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అంచనా. ఇంత వరకు జరిగిన నాలుగు దశల్లో 67శాతం ఓట్లు పోలయ్యాయని, 2014 ఎన్నికల్లో ఇది 67.6 శాతంగా ఉందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. వచ్చే మూడు దశల్లో పోలింగ్ ఒక శాతం పెరిగినా ఇదే అత్యధిక పోలింగు శాతమవుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, కర్ణాటకల్లో ఈ సారి పోలింగ్ శాతం గత 57 ఏళ్ల కంటే ఎక్కువగా ఉందని, 1962 నుంచి చూస్తే ఇదే అత్యధికమని ఎస్బీఐ నివేదిక తెలిపింది. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 30 ఏళ్లలో ఇదే ఎక్కువ పోలింగ్ శాతం. ప్రజలకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన పెరిగిందనడానికి పోలింగ్ శాతం పెరగడమే నిదర్శనమని నివేదిక వ్యాఖ్యానించింది. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు, మహిళలే కాక యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొంది. అస్సాం, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్(రూరల్), రాజస్థాన్(రూరల్)లలో 18–25 ఏళ్ల ఓటర్లు పోలింగులో ఎక్కువగా పాల్గొన్నారని, వీరి పోలింగు శాతం జాతీయ సగటు పోలింగు శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక వివరించింది. -
మోదీ x దీదీ
బెంగాల్ అంటే ఎన్నికల్లో హింస, బెంగాల్ అంటే నాటు బాంబుల పేలుళ్లు, బెంగాల్ అంటే తుపాకుల రాజ్యం. ఇన్నాళ్లూ ఇదే మాట. ఈ సారి లోక్‌సభ ఎన్నికల వేళ బెంగాల్ అంటే మోదీ వర్సెస్ దీదీ అనే మాటే వినిపిస్తోంది. ఒకరు కొదమ సింహమైతే, మరొకరు రాయల్ బెంగాల్ టైగర్. వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తృణమూల్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన కామెంట్స్ బెంగాల్ రాజకీయాల్ని కుదిపేశాయి. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య జరుగుతున్న సమరం రసకందాయంలో పడింది. ఇప్పుడు ఇదే ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించే అంశంగా మారింది. ఈ నెల 6న జరిగే అయిదో దశ పోలింగ్‌లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో రెండింట్లో మాత్రమే బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు అంచనా. స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే బెంగాల్ రాష్ట్రం గురించి చెప్పిన మాట ఒకటుంది. ‘‘ఇవాళ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో, రేపు భారత్ కూడా అదే ఆలోచిస్తుంది‘‘ అంటే ఆ రాష్ట్ర ప్రజలు ఆలోచనల్లో ఎంత ముందు ఉంటారో అన్న అర్థంలో గోఖలే బెంగాల్‌ను ప్రశంసించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 42 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో చక్రం తిప్పగలిగే ఈ రాష్ట్రంలో రాజకీయపరమైన హింస, ఎన్నికల వేళ హింస, వ్యక్తిగత దూషణలు, ధనబలం, కండబలం ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడడం మొదలు పెట్టాక మతపరమైన విభజన కూడా మొదలైంది. కనీసం 22 లోక్‌సభ సీట్లలోనైనా నెగ్గాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న మోదీ, షా ద్వయం వ్యూహాలు అంత తేలిగ్గా అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తనకు తిరుగులేదని, తన మాటే శాసనమన్న నియంతృత్వ ధోరణిలో పాలిస్తున్న మమతా బెనర్జీ(దీదీ)లో ఒక కలవరమైతే తెప్పించారు. ఈ సారి ఎన్నికల పోరు టీఎంసీ, బీజేపీ మధ్యే సాగుతోంది, సీపీఎం, కాంగ్రెస్ సైడ్ ప్లేయర్లుగా మారి బిత్తర చూపులు చూస్తున్నాయి. బన్‌గావ్‌లో మార్పు కోరుతున్నారా ? భారత్, బంగ్లాదేశ్‌లకు సరిహద్దుగా ఉన్న బన్గావ్ నియోజకవర్గం (ఎస్సీ నియోజకవర్గం)లో ఎస్సీల్లో విష్ణువుని పూజించే మతువా వర్గం ఓట్లు అత్యంత కీలకం. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నట్టు స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులు, దిగుమతులు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పారిశ్రామిక పురోగతి జరగలేదు. అందుకే ఇక్కడ యువత మోదీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ‘ఎప్పుడైనా మార్పు మంచికే జరుగుతుంది. కొత్త తరం మోదీపైనే ఆశలు పెట్టుకున్నారు’ అని స్థానిక వ్యాపారులు అంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వలసలు, వారిని అక్కున చేర్చుకోవడానికి తృణమూల్ అనుసరించే బుజ్జగింపు విధానాలు ఎంత మేర ప్రభావితం చూపిస్తాయో చూడాల్సిందే. తృణమూల్ తరపు నుంచి సిట్టింగ్ ఎంపీ మమతా బాల్ ఠాకూర్ పోటీ పడుతుంటే, అదే కుటుంబానికి చెందిన శాంతను ఠాకూర్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. బ్యారక్‌పూర్‌లో కమల వికాసం ? బ్యారక్‌పూర్‌లో ఇతర రాష్ట్రాలైన యూపీ, బీహార్ నుంచి వలస వచ్చిన ఓటర్లే ఎక్కువ. ఈ సారి ఎన్నికల్లో తృణమూల్ నుంచి పార్టీ ఫిరాయించి బీజేపీ గూటికి చేరిన అర్జున్ సింగ్ బరిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఒకప్పుడు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన దినేశ్ త్రివేది పోటీ పడుతున్నారు. రాష్ట్రేతరులు ఎక్కువగా ఉండడం, పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక మిగిలిన నియోజకవర్గాలైన హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లో మోదీపై దీదీ పైచేయి సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓట్ల శాతం పెరుగుతుంది కానీ... 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17శాతం ఓటు షేరుతో 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ సారి ఓటింగ్ శాతం పెరగడం ఖాయం అన్న అంచనాలున్నాయి. అయిదు నుంచి ఏడు సీట్లు బీజేపీ గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో 15 సీట్లలో తృణమూల్‌కి గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఉత్తర బెంగాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఇక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పశ్చిమ ప్రాంతాలు, బెంగాల్‌కు సరిహద్దు ప్రాంతాల్లో బీజేపీ తన పట్టు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 42 నియోజకవర్గాలకు గాను 40 శాతం ఓటుషేర్‌తో 34 సీట్లలో నెగ్గి తన పవరేంటో చూపించిన మమతపై బెంగాల్ ప్రజలు ఎంత మమత కురిపిస్తారో చూడాల్సిందే మరి. బెంగాలీలు త్వరగా మార్పుని ఆహ్వానించలేరు బెంగాల్ ఓటర్లు మార్పుని త్వరితగతిన కోరుకోరు. వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం జెండాలు, ఎజెండాలు మారుస్తారేమో కానీ, ఓటరు రాత్రికి రాత్రి పార్టీలను మార్చడు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలవడానికే మూడు దశాబ్దాలకుపైగానే పట్టింది. ఇందుకు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ రేయింబగళ్లు కష్టపడాల్సి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కమ్యూనిజంతోనే సమాజంలో మార్పు వస్తుందన్న నమ్మకం బెంగాల్ మధ్యతరగతి ప్రజల్లో బలంగా ఉండేది. 1977లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక రాజకీయ, ఆర్థిక, ఎన్నికల ప్రణాళికకు సంబంధించి ఒక మోడల్ని సృష్టించారు. బెంగాల్ గ్రామాల్లో దున్నేవాడికే భూమిపై హక్కుల్ని కట్టబెట్టడంతో వ్యవసాయ రంగం పరుగులు పెట్టింది. అయితే పారిశ్రామిక రంగంపై మాత్రం నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అసంఘటిత రంగాలనే సీపీఎం ప్రోత్సహించింది. చిల్లర వ్యాపారులు, వీధి వ్యాపారులు, దుకాణదారులు, వారి సహాయకులు ఇలా కార్మిక శక్తినే కామ్రేడ్లు నమ్ముకున్నారు. 1990ల్లో అసంఘటిత రంగాల్లో ఉద్యోగాల రేటు ఏడాదికి 12 శాతం వరకు వెళ్లింది. కర్షక, కార్మిక శక్తులు బలపడినా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆ రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది ఏమీ లేదు. పారిశ్రామిక రంగ పురోగతి సాధించకపోవడం, చిన్న కమతాలు కలిగిన రైతుల సంఖ్య పెరిగిపోవడం వల్ల పశ్చిమ బెంగాల్ మోడల్ ఒక విఫలప్రయోగంగానే మిగిలిపోయింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా భారత్ జాతీయ సగటుకి చేరుకోలేకపోయింది. దీంతో సీపీఎం తన దారి మార్చుకొని పారిశ్రామికీకరణను బలవంతంగా అమలు చేయడం మొదలు పెట్టింది. అదే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత దీదీ ఒక అస్త్రంలా మార్చుకొని పోరు బాట పట్టారు. సింగూర్ ఆందోళనలు జనంలో ఆమె ఇమేజ్ను పెంచాయి. ఫలితం బెంగాల్లో ఎర్రకోట బీటలు వారింది. 2011లో తొలిసారిగా అధికారం చేపట్టిన దీదీ తనపైనున్న సింగూర్ ఇమేజ్‌ని చెరిపేసుకోలేక, కొత్త విధానాలు అమలు చెయ్యలేక కొంతకాలం సతమతమయ్యారు. ఆ తర్వాత మార్క్సిస్టుల బాటలో నడవక తప్పలేదు. బడా బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారు. ముఖేశ్ అంబానీ వంటి వారు ఆ రాష్ట్రాన్ని ‘వెస్ట్ బెంగాల్ ఈజ్ బెస్ట్ బెంగాల్’ అనేలా పారిశ్రామిక విధానాలు సరళతరం చేశారు. ఎన్నికల మోడల్ సూపర్ హిట్ పరిపాలనలో చతికిలపడినా ఎన్నికల ప్రణాళికలో సీపీఎం అనుసరించిన విధానాలు సక్సెస్ అయ్యాయి. 1990లలో సీపీఎంకి కార్యకర్తల బలం ఎంత ఉందంటే, అప్పట్లో బెంగాల్లో ఓటర్ల సంఖ్య 4 కోట్లు ఉంటే, దాదాపుగా 20 లక్షల మంది సీపీఎం కార్యకర్తలే ఎన్నికల్లో పనిచేసేవారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అంతకు అంత కార్యకర్తల అండదండ సంపాదించింది. అయితే ఇదంతా అధికార దర్పంతో, నియంతృత్వ విధానాలతోనే సాధించారు. రాష్ట్రంలో ఆరెస్సెస్ చాలా కాలంగా పనిచేస్తున్నప్పటికీ కమలనాథులు తృణమూల్ పార్టీ స్థాయిలో బలపడలేదు. కానీ మతపరమైన విభజన రేఖ గీయడంలో విజయం సాధించారు. అదే ఇప్పుడు ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతోంది. ముస్లిం ఓటర్లే కీలకం పశ్చిమ బెంగాల్ ఓటర్లలో 27శాతం ముస్లింలే. 28 లోక్‌సభ స్థానాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. సీపీఎం ఓటు బ్యాంకు అటూ ఇటూ మళ్లిందేమో కానీ, ముస్లింలు మాత్రం దీదీ వైపే ఉన్నారు. ఆమె పాలనలోనే వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారు ‘‘ముస్లింలు ఇప్పుడు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. టీఎంసీలో కూడా స్థానికంగా నాయకత్వం వహిస్తున్నారు’’ అని ప్రశాంత చటోపాధ్యాయ అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు. నదీ తీరంలో రాజకీయాలు ఏ మలుపు తిప్పుతాయి? ఈ నెల 6న జరగనున్న అయిదో దశ పోలింగ్‌లో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అయిదు హుగ్లీ నదికి చెరోవైపున విస్తరించి ఉన్నాయి. బన్గావ్, బ్యారక్‌పూర్, హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లలో పోలింగ్ జరగనుంది. వీటిలో ఉత్తర 24 పరగణా జిల్లాలకు సరిహద్దుగా ఉన్న బన్గావ్, బ్యారక్పూర్లలో మతపరమైన హింస చెలరేగిన చోట బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టుగా అంచనా. మమతఠాకూర్, శాంతను ఠాకూర్, అర్జున్ సింగ్, దినేశ్ త్రివేది -
ఉదయం ఐదుకే పోలింగ్ ఓకేనా?
న్యూఢిల్లీ: విపరీతమైన ఎండలు, రంజాన్ పర్వదినాల్లో ఉపవాసాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల తదుపరి దశల్లో పోలింగ్‌ను ఉదయం 5 గంటలకే ప్రారంభించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తమ నిర్ణయం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఉదయం 5 గంటలకే పోలింగ్ నిర్వహించాలని తాము ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించామని, అయితే వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నామని పిటిషన్ వేసిన లాయర్లు మహమ్మద్ నిజాముద్దీన్ పాషా, అసద్ హయత్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. -
దూషణలపర్వంలో కొత్త రికార్డు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అయిదో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు తమ నోటికి పనిచెప్పారు. వ్యక్తిగత దూషణల్లో తామెవరికీ తక్కువ కాదని నిరూపించారు. యూపీలో మొత్తం 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాలకు శనివారంతో ఎన్నికల ప్రచారం పూర్తైంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నుద్దేశించి ‘గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయకండి’ అని పరోక్షంగా మోదీని విమర్శించడంపై మండిపడ్డ కమలనాథులు గాడిదలకున్నంత విశ్వాసం అఖిలేశ్‌కు లేదని మండిపడ్డారు. బహ్రీచ్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ గాడిదలంటే అఖిలేశ్‌కు భయమెందుకో? అని చురకలంటించారు. 125 కోట్ల దేశ ప్రజలే తన యజమానులనీ, వారికోసం గాడిదలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తానని మోదీ ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలను ‘కసబ్’గా అభివర్ణించడంతో, అమిత్ షా కంటే పెద్ద కసబ్ (ఉగ్రవాది) దేశంలోనే లేరని బీఎస్పీ చీఫ్ మాయావతి కౌంటరిచ్చారు. అఖిలేశ్ కూడా కసబ్‌లో ‘క’ అంటే పావురమనీ (కబూతర్), ఈ ఎన్నికల్లో బీజేపీ పావురాన్ని ప్రజలు వదిలించుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.