
సోమవారం అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా జమ్మూలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన కశ్మీరీ పండితులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా సోమవారం నాటికి ఐదు దశల పోలింగ్ పూర్తయింది. మొత్తం 543 నియోజకవర్గాలకు గాను 424 చోట్ల ఎన్నికలు ముగిశాయి. ఇంకా రెండు దశల్లో 118 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఇంతవరకు 21 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. 5 రాష్ట్రాల్లో పాక్షికంగా పూర్తయింది. నాలుగో దశలో సగటున 67% పోలింగ్, 5వ దశలో 62.56% ఓట్లు పోలయ్యాయి. ఐదు దశల్లో జరిగిన పోలింగ్ గణంకాలను పరిశీలిస్తే..