న్యూఢిల్లీ: విపరీతమైన ఎండలు, రంజాన్ పర్వదినాల్లో ఉపవాసాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల తదుపరి దశల్లో పోలింగ్‌ను ఉదయం 5 గంటలకే ప్రారంభించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తమ నిర్ణయం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఉదయం 5 గంటలకే పోలింగ్ నిర్వహించాలని తాము ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించామని, అయితే వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నామని పిటిషన్ వేసిన లాయర్లు మహమ్మద్ నిజాముద్దీన్ పాషా, అసద్ హయత్‌లు సుప్రీంకోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment