సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌లో పెద్దసంఖ్యలో యువత ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. దేశ భవిష్యత్‌ను నిర్ధేశించేందుకు, ప్రజాస్వామ్య పరిపుష్టికి ఓటు దీటైన ఆయుధమని ప్రధాని సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. యువ ఓటర్లు రికార్డు సంఖ్యలో ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరారు. నేడు జరుగుతున్న ఐదో విడత పోలింగ్‌లో ప్రజలంతా పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
కాగా,ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. బిహార్, జమ్ము కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐదో విడత పోలింగ్ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment