chandra sekhar azad
-
యూపీలో భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు
షహరాన్‌పూర్: ప్రముఖ దళిత నాయకుడు, భీమ్ ఆర్మీ అధినేత, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్(36)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ యన గాయపడ్డారు. ప్రస్తు తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షహరాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌బంద్ పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆజాద్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు బుధవారం చెప్పారు. కారులో ఉండగానే గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారని చెప్పారు. చంద్రశేఖర్ ఆజాద్ కడుపులోకి ఓ తూటా దూసుకెళ్లిందని అన్నారు. దుండగులు ప్రయాణించిన వాహనంపై హరియాణా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందని వెల్లడించారు. వారిని గుర్తించి, అదుపులోకి తీసుకొనేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టామన్నారు. చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పుల ఘటన పట్ల ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. -
వంద సీట్లిచ్చినా ఎస్పీతో పొత్తు పెట్టుకోం: ఆజాద్
నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లిస్తామని చెప్పినా... సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) అధినేత చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో పొత్తుకు సిద్ధమేనన్న ఆజాద్, బీజేపీని ఓడించడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా అఖిలేష్ యాదవ్‌ను కలిసింది నిజమేనని, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వంద సీట్లిచ్చినా ఎస్పీతో పొత్తు కుదుర్చుకోబోమన్నారు. అది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. తమకు మద్దతిస్తామని చెబుతూనే ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏఎస్పీకి కేవలం రెండు సీట్లు ఆఫర్ చేశారని, ఆయన ఎగతాళి చేస్తున్నాడో, మద్దతు ఇస్తున్నాడో న్యాయ విద్యార్థి అయిన తనకు అర్థమవుతోందని అన్నారు. చదవండి: (కాక రేపుతున్న యూపీ ఎన్నికలు.. బీజేపీ ఎమ్మెల్యేకు అఖిలేష్ బంపర్ ఆఫర్) -
ఆజాద్ విడుదల కూడా రాజకీయమే
సాక్షి, న్యూఢిల్లీ : కుల ఘర్షణల్లో అరెస్ట్ చేసిన భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం అనూహ్యంగా విడుదల చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. 2017, మే 5వ తేదీన శహరాన్ పూర్ ఘర్షణల్లో హస్తం ఉందనే ఆరోపణలపై చంద్రశేఖర్ ఆజాద్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు ఠాకూర్లకు, దళితులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఇందులో శాంతిభద్రతల చట్టం కింద అరెస్ట్ చేసిన కొంత మంది ఠాకూర్లు ఎప్పుడో బెయిల్‌పై విడుదలయ్యారు. నాన్ బెయిలబుల్ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల ఆయన ఇంతకాలం జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కేసు పూర్తయ్యేవరకు ఆయన్ని జైల్లోనే నిర్బంధించే అవకాశం ఉన్నప్పటికీ యూపీ ప్రభుత్వం విడుదల చేసిందంటే అందుకు రాజకీయ కారణాలు ఉండే ఉంటాయి. అటూ కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా దళితుల పోరాటం ఎక్కువవుతోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల వేధింపుల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు సడలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత ఏప్రిల్ 2వ తేదీన దళితులు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. చట్టాన్ని యథావిధిగా పునరుద్ధరించాలంటూ దళితులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్లో ఓ బిల్లును తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత మే నెలలో కరియాన లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి దళితుల వ్యతిరేకతే కారణమని బీజేపీ అభిప్రాయపడింది. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాది, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ఉమ్మడిగా పోటీచేయడం కూడా వారికి కలసి వచ్చింది. మాయావతి పార్టీ అంటే చంద్ర శేఖర్ ఆజాద్‌కు అసలు పడదు. ఆమెను అనేకసార్లు నేరుగా, ఘాటుగా ఆజాద్ విమర్శించారు. మాయావతికి వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ బలోపేతం అవుతున్నందున రానున్న ఎన్నికల్లో రెండు దళిత కూటముల మధ్య ఓట్లు చీలుతాయని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 2019 యూపీ సార్వత్రిక ఎన్నికల్లో వీలైనంత వరకు దళితుల ఓట్లను చీల్చడం వల్లనే లాభ పడవడవచ్చని భావించిన బీజేపీ, దూరదృష్టితో ఆజాద్‌ను విడుదల చేసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నా నుంచి అభిమానులు ఏమి...
30న సినిమా విడుదల రేష్మీ గౌతమ్ బీచ్‌రోడ్: నగరంలో ‘తను వచ్చెనంట’ సినిమా టీమ్ సందడి చేసింది. తేజ, రేష్మీగౌతమ్ హీరో, హీరోయిన్లగా.. చలాకి చంటి ముఖ్యపాత్రలో చిత్రం రూపొందింది. వెంకట కాచర్ల దర్శకత్వంలో నిర్మాత చంద్ర శేఖర్ ఆజాద్ నిర్మించారు. ఈ నెల 30న విడుదల అవుతున్న సందర్భంగా నగరంలో చిత్ర యూనిట్ సందడి చేసింది. అనంతరం ఆర్కేబీచ్ దగ్గర వున్న ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేష్మీ గౌతమీ మాట్లాడుతూ ఈ సినిమా అన్ని వ ర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. నా నుంచి అభిమానులు ఏమి కోరుకుంటున్నారో అన్నీ ‘తనువచ్చెనంట’లో ఉంటాయన్నారు. హీరో తేజ మాట్లాడుతూ ఇది హర్రర్, రొమాంటిక్ కామెడీ సినిమా అన్నారు. చిత్రంలో కామెడీ అద్భుతంగా పండిందన్నారు. తప్పకుండా అందర్నీ అలరిస్తుందన్నారు. నిర్మాత చంద్రశేఖర్, సహాయ నిర్మాత యశ్వాంత్ తదితరులు పాల్గొన్నారు. బీచ్‌ను చూస్తూ కాఫీ తాగితే ఆ కిక్కే వేరబ్బా...! సాగర్ తీరంలో పార్కేలేటర్ కాఫీ హౌస్ నిర్వహించిన సెల్ఫీ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన పదిమందితో తను వచ్చెనంట సినిమా టీమ్ డిన్నర్ చేసింది. రేష్మీ గౌతమ్, నటుడు చెలాకీ చంటీ తదితరులు యువతీయువకుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా పార్కెలేటర్ కాఫీ హౌస్ యజమాని మనుదీప్ రెడ్డి మాట్లాడుతూ షాపునకు వచ్చిన కస్టమర్లకు సెల్ఫీ పోటీలు నిర్వహించామని, వీరిలో పదిమందిని ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా రేష్మీ గౌతమీ మాట్లాడుతూ బీచ్‌ను చూస్తూ కాఫీ తాగడం చాలా ఇష్టమన్నారు. నటుడు చంటి మాట్లాడుతూ వైజాగ్ బీచ్‌ను ఎన్ని సార్లు చూసినా తనివితీరదన్నారు. ఈ కార్యక్రమంలో సెల్ఫీ కాంటెస్ట్ విజేతలు రేష్మీ, చంటిలతో సెల్ఫీలు, ఫొటోలు తీయించుకుని సందడిగా గడిపారు.